
డెమోక్రటిక్ చీఫ్ రాజీనామా
ఈ-మెయిల్ లీకుల ప్రభావం
ఫిలడెల్ఫియా : అంతర్గత ఈ-మెయిల్స్ లీకేజీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కమిటీ అధ్యక్షురాలు డెబ్బీ వాజర్‌మాన్ షల్జ్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ సమావేశాల ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఈ ప్రకటన చేశారు. తన ముందున్న లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. దీనికి ముందు ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు ఒబామాను, హిల్లరీ క్లింటన్‌ను ఆమె సంప్రదించారు.