నడకతో డిప్రెషన్‌కు స్వస్తి!
వాషింగ్టన్: ప్రస్తుతం జీవనశైలిలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురవటం, డిప్రెషన్‌కు లోనవటం జరుగుతోంది. అయితే ప్రతి రోజూ ఆహ్లాదకరమైన వాతావరణంలో కొద్ది సేపు నడిస్తే డిప్రెషన్ వచ్చే ప్రమాదం చాలా తక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పార్కులు, పచ్చికమైదానాలు వంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నడిస్తే మానసిక ప్రశాంత చేకూరి, మెదడులోఎలాంటి ప్రతికూల భావాలు జనించవని అమెరికాలోని స్టాన్‌ఫోన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు గ్రెచెన్ తెలిపారు. ట్రాఫిక్, ఇతర రణగొణ ధ్వనుల మధ్య వాక్ చేస్తే మెదడులో నెగెటివ్ ఎమోషన్స్ పుట్టి, ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయని వెల్లడించారు. ట్రాఫిక్‌లో, పార్కులు వంటి ఆహ్లాదకరమైన వాతారణంలో ప్రతి రోజూ 90 నిమిషాలు నడిచే వారిపై అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలు కనుగొన్నారు.