హత్య కేసులో చిలుక సాక్ష్యం! | Does parrot's foulmouthed squawk hold key to murder case? | Sakshi
Sakshi News home page

హత్య కేసులో చిలుక సాక్ష్యం!

Published Tue, Jun 28 2016 2:29 PM | Last Updated on Mon, Sep 4 2017 3:38 AM

హత్య కేసులో చిలుక సాక్ష్యం!

హత్య కేసులో చిలుక సాక్ష్యం!

మిచిగన్: రామచిలుకలు మాట్లాడతాయని విన్నాం. కానీ ఇప్పుడు సాక్ష్యాలు చెప్పేందుకు కూడా రెడీ అయ్యాయి. అమెరికాలోని మిచిగన్‌లో ఓ హత్య కేసులో రామచిలుక సాక్షిగా నిలిచిలింది. చిలుక సాక్ష్యంతో కేసును ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు. మిచిగన్‌లోని సాండ్‌లేక్‌ పట్టణంలో గత ఏడాది మేలో భర్త మార్టిన్‌ను హత్య చేసిందనే ఆరోపణలతో గ్లెనా డురమ్‌ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఐదు బుల్లెట్‌ గాయాలతో వారి నివాసంలో పడి ఉన్న భర్త మార్టిన్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గ్లెనా డురమ్‌ తలకు కూడా బుల్లెట్ గాయమైంది.

కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు గ్లెనా డురమ్‌ ఇంటిలోని పెంపుడు చిలుక మాటలు విని ఆశ్చర్యపోయారు. మార్టిన్‌ హత్య జరిగిన కొన్ని వారాల తర్వాత ఆ దంపతుల మధ్య చోటుచేసుకున్న గొడవ గురించి చిన్న చిన్న మాటలతో చిలుక అరవడం ప్రారంభించింది. ‘ఇంట్లోంచి బయటకు వెళ్లిపో..’, ‘ఎక్కడికి వెళ్లాలి..’ ‘నన్ను కాల్చొద్దు..’ అనే పదాలను చిలుక చెబుతుండటాన్ని పోలీసులు గమనించారు. చిలుక మాటలను అధ్యయనం చేస్తున్నామని.. హత్య కేసులో చిలుక సాక్ష్యంను కోర్టు అనుమతిస్తుందా? లేదా? అనేది నిర్ధారించాల్సి ఉందని న్యూఎగో కౌంటీ ప్రాసిక్యూటర్‌ రాబర్ట్‌ స్ప్రింగ్ స్టెడ్ తెలిపారు. అయితే మరోవైపు తన భర్తను హత్య చేయలేదని గ్లెనా డురమ్‌ వాదిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement