Michigan couple
-
భార్య మాట విన్నాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు!
వాషింగ్టన్: ఇంట్లో సరుకులు అయిపోయాయి వచ్చేటప్పుడు తీసుకురండి అనీ భార్య ఫోన్ చేస్తే చాలా మంది భర్తలు విసుక్కుంటారు. నువ్వే వెళ్లి తెచ్చుకో.. నాకు ఓపిక లేదని తెగేసి చెబుతుంటారు. కానీ, భార్య మాట విని చెప్పిన పని చేసిన ఓ భర్త జీవితమే మారిపోయింది. లాటరీలో ఏకంగా రూ.1.5 కోట్ల జాక్‌పాట్ తగిలింది. ఈ సంఘటన అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో జరిగింది. మిచిగన్ రాష్ట్రంలోని మార్క్వేట్ ప్రాంతానికి చెందిన ప్రిస్టోన్ మాకీ(46) అనే వ్యక్తికి ‘మిచిగన్ లాటరీ’లో 190,736డాలర్లు(రూ.1.5కోట్లు) గెలుచుకున్నాడు. అయితే, ఆ లాటరీలో డబ్బులు వచ్చేందుకు తన భార్య పంపిన మెసేజ్ కారణమని చెబుతున్నాడు ప్రిస్టోన్ మాకీ. ‘నేను నా విధులు ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు కిరాణ సరుకులు తీసుకురావాలని నా భార్య మెసేజ్ చేసింది. దీంతో వచ్చే దారిలో సరుకులు కొనేందుకు షాప్‌కి వెళ్లాను, అక్కడే 5 లాటరీ టికెట్లు కొనుగోలు చేశాను. ఆ తర్వాతి రోజు ఉదయం, కిచెన్‌లో ఉన్న సమయంలో లాటరీ టికెట్లను మొబైల్ యాప్‌లో స్కాన్ చేశాను. నేనే జాక్‌పాట్ విన్నర్‌గా తెలుసుకున్నాను. అది ఊహించని పరిణామంగా అనిపించింది. ’ అని తెలిపారు ప్రిస్టోన్ మాకీ. లాటరీలో లభించే రూ.1.5 కోట్ల నగదులో కొంత తన పెట్టుబడుల కోసం ఉంచుకుని, మిగిలినది కుటుంబ సభ్యులకు పంచిస్తానని చెప్పారు ప్రిస్టోన్ మాకీ. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి సైతం ఈ విధంగానే రూ.15 కోట్ల జాక్‌పాట్ కొట్టినట్లు చెప్పాడు. తాను కిరాణ సరుకుల కోసం వెళ్లి టికెట్ కొనుగోలు చేయటం ద్వారానే లాటరీలో విజేతగా నిలిచానని తెలిపాడు. ఇదీ చదవండి: ఢిల్లీ నుంచే యూరప్‌లో ప్రధాని మోదీ కారు డ్రైవింగ్.. 5జీ సాయంతో.. -
శరీరం నుంచి దుర్వాసన వస్తోందంటూ...
మిచిగాన్కు చెందిన యూదు దంపతులకు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చేదు అనుభవం ఎదురైంది. శరీరం నుంచి దుర్వాసన వస్తోందన్న కారణంగా 19 నెలల చిన్నారితో సహా ఆ దంపతులను అత్యవసరంగా విమానం నుంచి దించేశారు. బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మిచిగాన్కు చెందిన యోసి ఆడ్లర్ అనే వ్యక్తి భార్య, తన చిన్నారితో కలిసి హాలిడే ట్రిప్ కోసం మియామీ వచ్చాడు. ట్రిప్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం విమానం ఎక్కిన కొద్ది సేపటి తర్వాత.. ఆడ్లర్ దంపతులు అత్యవసరంగా విమానం దిగిపోవాలంటూ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ క్రమంలో తమను దించేయడానికి గల కారణమేంటని అడగగా.. ‘మీ శరీరం నుంచి దుర్వాసన వస్తోందని ప్రయాణికులతో పాటు, మా సిబ్బంది కూడా ఫిర్యాదు చేశారు. కాబట్టి మీరు దిగిపోవాల్సిందే’ అంటూ క్రూ మెంబర్ ఇచ్చిన సమాధానం విని షాక్‌కు గురయ్యారు. యూదులం అయిన కారణంగానే ఇలా.. తమకు జరిగిన అవమానం గురించి ఆడ్లర్ మీడియాతో మాట్లాడుతూ...‘ యూదులమనే కారణంగానే మాకు చేదు అనుభవం ఎదురైంది. మమ్మల్ని ఎందుకు దించేస్తున్నారని అడిగినపుడు..మీ మతస్తులు స్నానం చేయరు కదా.. అలాగే మంచి దుస్తులు ధరించరు అంటూ వారు ఇచ్చిన సమాధానం కలచివేసింది. నిజంగా సాటి మనుషులమనే భావన ఉంటే మంచి దుస్తులు ఇచ్చి, సువాసనలు వెదజల్లే సెంట్ ఇచ్చి ఉండవచ్చు కదా. కానీ అసలు కారణం అది కాదు. అందుకే మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా దింపేసారు. అయితే నాకు సంబంధించిన వస్తువులు మాత్రం కార్గోలో వెళ్లిపోయాయి. మరుసటి రోజు విమానం ఎక్కేవరకు హోటల్లో బస చేసేందుకు చాలా ఖర్చయింది. అది ఎవరు కడతారు. మాకు జరిగిన అవమానానికి ఎవరు సమాధానం చెబుతారు. ఇంటి దగ్గర నా ఎనిమిది పిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఈ ఘటనపై స్పందించిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ .. ‘ఆడ్లర్ శరీర దుర్వాసన వల్ల మా సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే అతడిని దింపేశాం. జాతి వివక్ష చూపలేదు. మియామీ ఎయిర్‌పోర్టులో అతడికి కావాల్సిన సదుపాయాలు కల్పించాం. అయితే మేము ఇచ్చిన వాచర్లు పనిచేయలేదని ఆడ్లర్ చెప్పాడు. ఈ విషయంపై మేము విచారణ చేశాం. ఆ తర్వాత గురువారం ఉదయం టికెట్లు బుక్ చేసి పంపించేశాం’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక.. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ఎయిర్‌లైన్స్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
హత్య కేసులో చిలుక సాక్ష్యం!
మిచిగన్: రామచిలుకలు మాట్లాడతాయని విన్నాం. కానీ ఇప్పుడు సాక్ష్యాలు చెప్పేందుకు కూడా రెడీ అయ్యాయి. అమెరికాలోని మిచిగన్‌లో ఓ హత్య కేసులో రామచిలుక సాక్షిగా నిలిచిలింది. చిలుక సాక్ష్యంతో కేసును ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు. మిచిగన్‌లోని సాండ్‌లేక్ పట్టణంలో గత ఏడాది మేలో భర్త మార్టిన్‌ను హత్య చేసిందనే ఆరోపణలతో గ్లెనా డురమ్ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఐదు బుల్లెట్ గాయాలతో వారి నివాసంలో పడి ఉన్న భర్త మార్టిన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గ్లెనా డురమ్ తలకు కూడా బుల్లెట్ గాయమైంది. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు గ్లెనా డురమ్ ఇంటిలోని పెంపుడు చిలుక మాటలు విని ఆశ్చర్యపోయారు. మార్టిన్ హత్య జరిగిన కొన్ని వారాల తర్వాత ఆ దంపతుల మధ్య చోటుచేసుకున్న గొడవ గురించి చిన్న చిన్న మాటలతో చిలుక అరవడం ప్రారంభించింది. ‘ఇంట్లోంచి బయటకు వెళ్లిపో..’, ‘ఎక్కడికి వెళ్లాలి..’ ‘నన్ను కాల్చొద్దు..’ అనే పదాలను చిలుక చెబుతుండటాన్ని పోలీసులు గమనించారు. చిలుక మాటలను అధ్యయనం చేస్తున్నామని.. హత్య కేసులో చిలుక సాక్ష్యంను కోర్టు అనుమతిస్తుందా? లేదా? అనేది నిర్ధారించాల్సి ఉందని న్యూఎగో కౌంటీ ప్రాసిక్యూటర్ రాబర్ట్ స్ప్రింగ్ స్టెడ్ తెలిపారు. అయితే మరోవైపు తన భర్తను హత్య చేయలేదని గ్లెనా డురమ్ వాదిస్తోంది. -
ఆ లక్కీ డాటర్స్ తో లాటరీ తగిలింది!
ఆడపిల్ల పుడితే సాక్షాత్తూ అదృష్ట లక్ష్మీ ఇంటికొచ్చినట్టేనని చాలామంది భావిస్తారు. మరీ అలాంటి ఇద్దరు అదృష్ట లక్ష్ములు అత్యంత అరుదుగా వచ్చే ఒకే తేదీన జన్మిస్తే.. అంతకంటే ఆ తల్లిదండ్రులకు ఆనందం ఏముంటుంది. ప్రస్తుతం అమెరికాలోని వాయవ్య మిచిగన్‌కు చెందిన చాడ్, మెలిస్సా క్రాఫ్ దంపతులు ఇదే ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. ఈ దంపతులకు ఫిబ్రవరి 29 (లీపు సంవత్సరం) తెల్లవారుజామున 3.06 గంటలకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. వాస్తవానికి గర్భవతి అయిన మెలిస్సా క్రాఫ్ పదిరోజుల ముందే ప్రసవం కావాల్సి ఉంది. ప్రవసం ఆలస్యం కావడంతో నాలుగేళ్లకు ఓసారి వచ్చే లీపు సంవత్సరం రోజున ఆమె 'ఎవన్లీ జాయ్' అనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇంకా అద్భుతమేమిటంటే సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే తేదీన ఆమె తన మొదటిబిడ్డకు జన్మనివ్వడం. ఈ దంపతుల పెద్దబిడ్డ ఎలియానా ఆడాయా 2012 ఫిబ్రవరి 29న.. అంటే లిపు సంవత్సరం నాడే జన్మించింది. 'ఇది నిజంగా నమ్మశక్యంగా అనిపించడం లేదు. పెద్ద లాటరీ తగిలినట్టు అనిపిస్తోంది. బేబీ లాటరీ మమ్మల్ని వరించింది' అని తల్లి మెలిస్సా ఆనందం వ్యక్తం చేసింది. పెద్దగా ప్రసవ వేదన పడకుండా, ఔషధాలు, సీజేరియన్ లేకుండా ప్రశాంతంగా ప్రసవం జరిగిందని ఆమె తెలిపింది. శనివారం పెద్ద కూతురు ఎలియానా పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ఆమె బంధువులు కూడా ఇది నిజంగా లాటరీ తగలడమే అంటున్నారు. నాలుగేళ్లకోసారి అది కూడా ఇద్దరు కూతుళ్ల బర్త్ డే ఒకేసారి చేయడమంటే లాటరీ తగలడమే కాదా? అని చమత్కరిస్తున్నారు. నిజానికి తోబుట్టువులు ఒకే తేదీన పుట్టడం అత్యంత అరుదుగా జరుగుతుంది. 1952-60 మధ్యకాలంలో కేవలం ఐదుగురు తోబుట్టువులు మాత్రమే ఒకే తేదీన జన్మించినట్టు గిన్నిస్ రికార్డులు చెప్తున్నాయి.