
భారత్‌కు బయల్దేరే ముందు మేరీల్యాండ్‌లోని ఎయిర్‌బేస్‌లో ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ విమానం ఎక్కేందుకు వస్తున్న ట్రంప్, మెలానియా
భారత ప్రధాని నరేంద్రమోదీ తనకు మంచి స్నేహితుడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. తామిద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయన్నారు. భారత్ పర్యటనకు బయల్దేరే ముందు ట్రంప్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. భారత్‌కు వస్తానని చాలా రోజుల క్రితమే మాట ఇచ్చానని ఈ సందర్భంగా తెలిపారు. ‘భారత ప్రజలతో మమేకమయ్యేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నా పర్యటన సందర్భంగా అక్కడ ఒక పెద్ద కార్యక్రమం జరగబోతోందని విన్నా. భారత్‌లో ఇంతవరకు జరగనంత భారీ కార్యక్రమం అది అని భారత ప్రధాని నాకు చెప్పారు. భారత ప్రధాని మోదీ నా స్నేహితుడు. మేమిద్దరం బాగా కలసిపోతాం’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారత్ ఎదురు చూస్తోంది: మోదీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు స్వాగతం పలికేందుకు భారత్ ఎదురుచూస్తోందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు స్వాగతం పలకడం గౌరవంగా భావిస్తున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment