
వాషింగ్టన్ : త్వరలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షల నివేదికలను విడుదల చేయనున్నారు. ఆయన మాటలు చూసి భయపడుతూ, ఆయన మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితి బాగా లేనట్లుంది అంటూ వస్తున్న విమర్శలకు సమాధానంగా వీటిని స్వయంగా ప్రభుత్వ వైద్యులే రిలీజ్ చేయనున్నారు. 2018లో కూడా ఆయన సమర్థంగా పనిచేయగలరని, అందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారని తెలిపేందుకు వీటిని బయటపెడుతున్నారు.
71 ఏళ్ల ట్రంప్ వివిధ సందర్భాల్లో ఎలాంటి మాటలు మాట్లాడతారో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి 'గాడ్ బ్లెస్ అమెరికా' అనే మాటలు కూడా ఆయన అంటుండటంతో పలువురికి ఆయన ఆరోగ్య స్థితిపై ఊహగానాలు తలెత్తాయి. ముఖ్యంగా బుధవారంనాడు జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నానని చెప్పిన సందర్భంలో చేసిన ప్రసంగం తడబడటం కూడా ఆయన ఆరోగ్య స్థితి సరిగా ఉందా లేదని తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో వాల్టర్ రీడ్(నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్)లో పరీక్షలు నిర్వహించి ఆ రికార్డులను విడుదల చేయనున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment