Health records
-
వర్సిటీల్లో విద్యార్థుల హెల్త్‌రికార్డ్
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల విద్యార్థుల ఆరోగ్య రికార్డులను తయారు చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారులకు సూచించారు. గవర్నర్ అధ్యక్షతన గురువారం రాజ్‌భవన్‌లో ‘యూనియన్ బడ్జెట్ 2023–24లో ప్రతిపాదించిన ఆరోగ్యరంగ కార్యక్రమాలు, కేటా యింపులు’అనే అంశంపై వివిధ కేంద్ర వైద్యసంస్థలు, ఇతర సంస్థల అధిపతులు, ప్రతినిధులు, పలువురు డాక్టర్లతో సమావేశం నిర్వహించారు. గవర్నర్ మాట్లాడుతూ కేంద్రబడ్జెట్–2023లో ఆరోగ్యరంగానికి భారీ కేటాయింపులతో సుస్థిర ఆరోగ్య సంరక్షణ రంగాన్ని రూపొందించడానికి మార్గం ఏర్పడిందన్నారు. కేంద్రబడ్జెట్లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు రూ.89,155 కోట్లు కేటాయించడంవల్ల ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాలు, సేవలను అద్భుతంగా మార్చడా నికి వీలు కలుగుతుందన్నారు. వైద్య విద్య, పారా మెడికల్ రంగం, ఆయుష్మాన్ భారత్ కోసం బడ్జెట్లో కేటాయింపులు భారీగా పెరిగాయని, దీనివల్ల ఈ పథకం కింద మరో 40 కోట్ల మందిని ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకు రావాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య పరిశోధనలకు కేటాయింపులు పెరగ డం ఆ రంగంలో నూతన ఆవిష్కరణలు పెరుగుతా యని, నాణ్యమైన పరిశోధనలకు దోహదపడుతుందని గవర్నర్ అన్నారు. నర్సింగ్ విద్యకు అంతర్జాతీయ డిమాండ్ కొత్త మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రుల ఆధునికీకరణకు రూ.6,500 కోట్లు కేటాయించారని గవర్నర్ వివరించారు. కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలు రాబోతున్నాయని, మనదేశంలో నర్సింగ్ విద్యకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ రంగం మరింత వృద్ధి చెందిందన్నారు. బడ్జెట్‌సహా వివిధ అంశాలపై సమావేశానికి వచ్చిన ప్రముఖులు వ్యాసాలు రాసి పంపితే వాటిని పుస్తకరూపంలో ప్రచురిస్తామని గవర్నర్ తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా మాట్లాడుతూ ఈ దశాబ్దకాలంలో దేశంలో ఎంబీబీఎస్ సీట్లు 87 శాతం, పీజీ మెడికల్ సీట్లు 105 శాతం, మెడికల్ కాలేజీల సంఖ్య రెట్టింపు అయ్యాయన్నారు. సమావేశంలో సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందుకుమార్, జాతీయ పోషకా హార సంస్థ డైరెక్టర్ డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. -
వైద్యం.. మరింత సులభతరం
రోగి వైద్యుని వద్దకు వెళ్లినప్పుడు ఇదివరకు తీసుకున్న చికిత్స.. వైద్య పరీక్షల నివేదికలు తప్పనిసరి. దీని ఆధారంగా చికిత్స ఏది అవసరమో అది కొనసాగించవచ్చు. ఇలాంటివి రోగి మరచిపోయినప్పుడు వైద్యులు మొదటి నుంచి పరీక్షలు, స్కానింగ్ చేయించి వివరాలు తెలుసుకుని తర్వాత చికిత్స ప్రారంభించేవారు. ఇదంతా గతం. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)లో భాగంగా అలాంటి కాగితాలు ఏవీ లేకుండానే ‘రోగి చరిత్ర’ మొత్తం ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ (ఈ–హెల్త్ రికార్డ్)లో నిక్షిప్తం చేసే విధానం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: రోగులు రాష్ట్రంలో ఎక్కడ వైద్యానికి వెళ్లినా తమ పూర్వపు ఆరోగ్య స్థితులను ఇట్టే తెలియజెప్పే ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డుల (ఈ–హెచ్ఆర్) రిజిస్ట్రేషన్ ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. రోగులు పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వచ్చినప్పుడు వారికి వైద్యపరీక్షలు నిర్వహించడం, దీర్ఘకాలిక వ్యాధులు, జీవనశైలి జబ్బులు ఇలాంటివేవైనా ఉంటే పూర్తిస్థాయిలో వివరాలన్నీ ఎల్రక్టానిక్ రికార్డుల్లోకి ఎక్కిస్తారు. రోగి ఆధార్, మొబైల్ నంబర్లను క్రోడీకరించి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు. ఈ నంబర్ ఆధారంగా పూర్వపు ఆరోగ్య వివరాలన్నీ ఏ డాక్టరు వద్దకు వెళ్లినా తెలుసుకోవచ్చు. అనంతలో 43 వేలు, శ్రీసత్యసాయిలో 35 వేలు.. రాష్ట్రంలో 542 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. అందులో శ్రీసత్యసాయి జిల్లాలో 18, అనంతపురం జిల్లాలో 26 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల వాసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తుండగా, పట్టణ పేదలు అర్బన్ హెల్త్ కేంద్రాలకు వస్తున్నారు. ఇలా వస్తున్న వారిలో శ్రీసత్యసాయి జిల్లాలో 35,052 మందికి, అనంతపురం జిల్లాలో 43,578 మందికి ఈహెచ్‌ఆర్ నమోదు పూర్తి చేశారు. ఇప్పటికీ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఎలక్ట్రానిక్ హెల్త్‌రికార్డులతో.. ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డుల వల్ల వైద్యం మరింత సులభమవుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన డేటా మొత్తం ఇందులో ఉండటంతో జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఏ ఆస్పత్రికెళ్లినా పూర్తి వివరాలు ఉంటాయి. కొత్తగా ఎప్పుడు వైద్యం చేయించుకున్నా అదనపు వివరాలు నమోదు చేస్తారు. దీనివల్ల జీవనశైలి జబ్బులు ఎంతమందికి ఉన్నాయి, దీర్ఘకాలిక జబ్బులు ఎంతమందికి ఉన్నాయి ఇలా జిల్లాలో ఉన్న మొత్తం వివరాలు అందుబాటులోకి వస్తాయి. దీన్నిబట్టి జబ్బుల శైలిని కూడా అంచనా వేయొచ్చు. ఈహెచ్‌ఆర్‌లో ఆరోగ్యశ్రీ నెంబర్ కూడా నమోదు చేయడం వల్ల ఎక్కడికెళ్లినా ఉచితంగానే వైద్యం పొందే అవకాశం ఉంటుంది. రోగులతో పాటు వైద్యుల వివరాలు ఏబీడీఎంలో నమోదు చేస్తారు. ఏ డాక్టరు ఏ వైద్యం చేశారన్నది కూడా ఇకపై హెల్త్ రికార్డుల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఇదీ చదవండి: సర్కారీ వైద్యం సూపర్ -
డిజిటల్ ఆరోగ్య సేవల్లో ఏపీ నంబర్ వన్
సాక్షి, అమరావతి: డిజిటల్ ఆరోగ్య సేవల్లో ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మరో ముందడుగు వేసింది. శుక్రవారానికి రాష్ట్రంలో కోటి హెల్త్ రికార్డులను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌కు అనుసంధానం చేసి, ఈ ఘనతను సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచిందని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టర్ జీఎస్ నవీన్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వంటి క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో 3.4 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అథారిటీ రికార్డులను రాష్ట్ర ప్రజలకు అందజేశామని, ఇది కూడా మిగతా రాష్ట్రాలకంటే అధికమేనని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు డిజిటలైజేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. రోగుల ఆరోగ్య నివేదికలను డిజిటలైజ్ చేసి భద్రపరచడంతో పాటు అవసరమైనప్పుడు వాటిని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇందులో అర్బన్, రూరల్ హెల్త్ సెంటర్ల నుంచి బోధనాస్పత్రుల వరకు భాగస్వాములవుతాయన్నారు. ఈ కేంద్రాలన్నీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎకో సిస్టంలో భాగంగా మారాయని ఆయన వివరించారు. -
ఏకంగా పది కరోనా వ్యాక్సిన్లు వేయించుకున్న మహానుభావుడు!
Man Vaccinated 10 Times In One Day: ఒక్క కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నాకే నాకు బాగోలేదని కొందరూ... బాబోయ్! మేము వ్యాక్సిన్ వేయించుకోమంటూ ఇప్పటికీ భయపడుతున్నవాళ్లు ఉన్నారు. అయితే న్యూజిలాండ్‌కి చెందిన ఈ మహానుభావుడు మాత్రం ఏకంగా పది కరోనా వ్యాక్సిన్లు వేయించుకన్నాడు. (చదవండి: ఎల్లప్పుడూ ఇలానే ఉండనివ్వండి!.... సోదరీమణులతో దిగిన ఫోటోలను పోస్ట్ చేసిన కత్రినా!) అసలు విషయంలోకెళ్లితే...న్యూజిలాండ్‌కు చెందిన ఒక వ్యక్తి కేవలం 24 గంటల్లో 10 వ్యాక్సిన్లు తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఇది నిజమా కాదా అన్న ఉద్దేశంతో న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి ధర్యాప్తు చేయడం మొదలుపెట్టింది. అయితే సదరు వ్యక్తి వేర్వేరు వ్యక్తుల గర్తింపు కార్డులతో వ్యాక్సిన్ మరీ వేయించుకున్నాడని విచారణలో తెలుస్తుంది. దీంతో ఆరోగ్య మంత్రిత్వశాఖకు సంబంధించిన కోవిడ్ వ్యాక్సిన్ మేనేజర్ ఆస్ట్రిడ్ కూర్నీఫ్ ఆ వ్యక్తి ఆరోగ్యం గురించి ఆందోళనకు గురై సదరు వ్యక్తిని తక్షణమే వైద్యుడుని సంప్రదించవల్సిందిగా సూచించారు. అయితే హెల్త్ రికార్డు ప్రకారం ఎవరి హెల్త్ రికార్డు ప్రకారం వారు వేయించకోవాలి. ఇలా మరోకరి గుర్తింపు రికార్డుతో వేయించుకోవడం చాల ప్రమాదం అంటూ న్యూజిలాండ్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హెలెన్ ప్రజలను హెచ్చరించారు. (చదవండి: పెళ్లి చేసుకోమని అడిగినందుకు... గొంతు కోసి చంపేశాడు!) -
దేశంలోనే కొత్త రికార్డు: సీఎం జగన్
గుంటూరులోని కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ ద్వారా మెడికల్, సర్జికల్ ఆంకాలజీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఏఇఆర్బీ (ఆటమిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్) అనుమతి ఉన్న మొట్టమొదటి యూనిట్ ఇది. ఇటువంటిదే కర్నూలులో నిర్మిస్తున్నాం. మరో ఏడాదిలో అది కూడా పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లందరికీ శుభాకాంక్షలు. 104 ద్వారా ఐదు లేదా ఏడు గ్రామాల ప్రజల ఆరోగ్య బాధ్యతను ఒక డాక్టర్‌కు అప్పగిస్తున్నాం. తద్వారా విదేశాలలో మాదిరిగా ఫ్యామిలీ డాక్టర్ అనే భావనను ఆయా కుటుంబాలకు కలిగిస్తాం. ఒక్కోసారి సకాలంలో వైద్యం అందక పిల్లలు ప్రాణాపాయంలోకి వెళ్లడం బాధాకరం. ఆ పరిస్థితి రాకుండా పసిపిల్లల కోసం నియోనేటల్ అంబులెన్స్‌లను జిల్లాకు రెండు చొప్పున కేటాయించాం. ఇది మనసుకు ఆనందం కలిగించే అంశం. –సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘ప్రజారోగ్య రంగంలో ఈ రోజు సువర్ణ అధ్యాయం.. మార్పు మాటల్లో కాకుండా చేతల్లో చూపించాం.. గతానికి ఇప్పటికీ తేడాను ప్రజలందరూ ఒకసారి గమనించాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఒకేరోజు అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన 1,088 అంబులెన్స్‌లను ప్రారంభించడం ద్వారా దేశంలోనే కొత్త రికార్డును సృష్టించామని స్పష్టం చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాట్కో ట్రస్ట్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించిన.. ప్రభుత్వ రంగంలో పనిచేసే తొలి కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్‌ను బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. గతానికి, ఇప్పటికీ మధ్య తేడాను గమనించాలి ► వైద్య రంగంలో ప్రభుత్వం అందిస్తున్న సేవలకు సంబంధించి ఇంతకు ముందుకు, ఇప్పటికీ తేడా ఏమిటీ అనేది అందరూ గమనించాలి. గతంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఆలోచించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి చూస్తే.. ఎలుకలు కొరికి పిల్లలు చనిపోతున్నారనే కథనాలు పత్రికల్లో వచ్చాయి. సెల్ ఫోన్ వెలుగుల్లో ఆపరేషన్లు చేస్తున్నారనే కథనాలు చూశాం. ► గతంలో పేరుకే 104 ఉండేది. 108 అంబులెన్స్‌లు అరకొరగా నడిచేవి. 108 అంబులెన్సులు నడిచే కండిషన్ లో వున్నవి 336 మాత్రమే. అంత దారుణంగా అంబులెన్స్‌లు, ప్రభుత్వ ఆసుపత్రులు ఉండేవి. ► దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులను చేతల్లో చూపించాను. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాతీయ స్థాయి ప్రమాణాలు ఉండేలా తీర్చి దిద్దుతున్నామని గర్వంగా చెబుతున్నా. ► విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో జాతీయ ప్రమాణాలు ఉండేలా రూపురేఖలు మారుస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా మరో 16 టీచింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ► ఆగస్టు 15న వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ మొదలవుతుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక టీచింగ్, నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ పరిధిలో 7 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించబోతున్నాం. క్యాన్సర్, కిడ్నీ స్పెషాలిటీ ఆసుపత్రలను ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి పౌరుడికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ► ప్రతి మండలానికి రెండు పీహెచ్సీ సెంటర్లను నిర్వహిస్తున్నాం. ప్రతి సెంటర్లోనూ కనీసం ఇద్దరు డాక్టర్లు ఉంటారు. ప్రతి మండలానికి కేటాయించిన 104 వాహనంలో మరో డాక్టర్ ఉంటారు. ► ప్రతి మండలంలో కనీసం 30 ఊళ్లు వుంటాయని అనుకుంటే.. వాటిని ఈ రెండు పీహెచ్‌సీలు సమానంగా పంచుకుంటాయి. ఒక డాక్టర్ 104లో కూర్చుని కనీసంగా 5 నుంచి 7 గ్రామాల బాధ్యత తీసుకుంటారు. ఆ డాక్టర్ ప్రతినెలా కచ్చితంగా ఒకరోజు తన పరిధిలోని గ్రామానికి వెళ్లి వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ► ఆ గ్రామాల్లోని రోగుల వైద్య సంబంధ వివరాలను, పరీక్షలను, ఇచ్చిన మందులను ఎలక్ట్రానిక్ డేటా రికార్డ్‌లో నమోదు చేస్తారు. ► రాష్ట్రంలో మొట్టమొదటి సారి పౌరుల ఎలక్ట్రానిక్ హెల్త్ డేటాను ప్రభుత్వం నమోదు చేస్తోంది. క్యూఆర్ కోడ్ ఆధారంగా హెల్త్ రికార్డులను చెక్ చేయవచ్చు. ► ప్రతి పేషెంట్‌కు సంబంధించిన డిజిటల్ ఎలక్ట్రికల్ డేటా రికార్డ్స్‌ను 104, పీహెచ్‌సీలు, రాబోయే రోజుల్లో వచ్చే విలేజ్ క్లినిక్‌లకు అనుసంధానం చేస్తాం. సకాలంలో 108 అంబులెన్స్ వస్తుందనే నమ్మకం కలిగించాం ► రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ రోజు 1,088 కొత్త వాహనాలు ప్రారంభించి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. ఇందులో 412.. 108 అంబులెన్స్‌లు, 676 కొత్త 104 వాహనాలు ఉన్నాయి. ► ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఫోన్ చేస్తే సకాలంలో 108 అంబులెన్స్ వస్తుందనే నమ్మకాన్ని కలిగించాం. ► పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20, ఏజెన్సీలో 25 నిమిషాల్లో 108 వాహనం వస్తుందని ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా. గత ప్రభుత్వ హయాంలో లైఫ్ సపోర్ట్ ఉన్న వాహనాలు కేవలం 86 మాత్రమే. ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాం. 432 అంబులెన్స్‌లలో 300 పై చిలుకు బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. 104 వాహనాలన్నింటిలో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. వీటితో పాటు 26 నియోనేటల్ అంబులెన్స్‌లను నిర్వహిస్తున్నాం. ► ఈ అంబులెన్సుల్లో అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేశాం. మల్టీప్యార మానిటర్, అత్యాధునిక వెంటిలేటర్లు, నియోనేటల్లో మొట్ట మొదటిసారిగా ఇంక్యుబేటర్లతో కూడిన వెంటిలేటర్ల వంటి పరికరాలను అమర్చాం. ► మొదటిసారిగా అంబులెన్స్‌ల్లో కెమెరాలు కనిపిస్తున్నాయి. పేషెంట్ 108 వాహనంలో ఎక్కిన వెంటనే రోగి పరిస్థితిని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లో ఉన్న వైద్యులు ఈ కెమెరా ద్వారా పరిశీలిస్తారు. అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. అడ్వాన్స్డ్ వెహికిల్ లొకేషన్ సిస్టమ్, టువే కనెక్టివిటీ, జీపీఎస్ వంటి సదుపాయాలు కూడా కల్పించాం. తద్వారా ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి, వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగించే పరిస్థితి తీసుకువచ్చాం. 108 సర్వీసుల సిబ్బందికి జీతాల పెంపు ► గతంలో 108 వాహనం డ్రైవర్లకు రూ.10 వేలు జీతం ఉండేది. ప్రస్తుతం వారి సర్వీసును బట్టి రూ.18 వేల నుంచి రూ.28 వేల వరకు పెంపు. ► ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్‌కు గతంలో రూ.12 వేలు ఇచ్చేవారు. ప్రస్తుతం వారి సర్వీసును బట్టి రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంపు. ఇది ఈ రోజు (బుధవారం) నుంచే అమలులోకి వస్తుంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ వైద్యం ► రాష్ట్రంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం రూపురేఖలను పూర్తిగా మార్చే కార్యక్రమం చేస్తున్నాం. వైద్యం అందించిన మూడు వారాల్లో బిల్లులు చెల్లిస్తున్నాం. దీనివల్ల ఆరోగ్య శ్రీ కార్డుతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తులకు అక్కడ సిబ్బంది చిరునవ్వుతో వైద్యం అందిస్తున్నారు. పేదవాడికి వైద్యం ఎలా అందించాలన్న ఆరాటంతో ఆరోగ్యశ్రీని మెరుగు పరుస్తున్నాం. ► ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయడంతో పాటు ఆ తర్వాత విశ్రాంతి సమయంలో ఆరోగ్య ఆసరా కింద రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేలు చొప్పున ప్రభుత్వం నుంచి సాయం అందిస్తున్నాం. ► ఈ నెల 8వ తేదీన ఆరు జిల్లాల్లో 2059 ప్రోసీజర్లకు (వ్యాధులు) ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించే కార్యక్రమం చేపడుతున్నాం. నవంబర్ 14 నాటికి దీనిని అన్ని జిల్లాలకు విస్తరింప చేస్తాం. వెయ్యి రూపాయలు వైద్యం ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులు చెల్లిస్తున్నాం. పక్క రాష్ట్రాల్లోని 130 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. ఖరీదైన క్యాన్సర్ చికిత్స ఉచితం ► గుంటూరు లోని కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ కోసం నిధులను అందించడం పట్ల నాట్కో ట్రస్ట్ సీఎండీ నన్నపనేని వెంకయ్య చౌదరి, ఇతర ట్రస్ట్ ప్రతినిధులకు అభినందనలు. ప్రజల ఆరోగ్యం కోసం నాట్కో ట్రస్ట్ ఈ రకంగా ముందుకు రావడం సంతోషం. ► ఈ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుతో పేదలకు ఉచితంగానే ఖరీదైన క్యాన్సర్ చికిత్సను అందించడానికి వీలు పడుతుంది. ఈ సెంటర్ కారణంగా రాష్ట్రానికి రెండు పీజీ ఆంకాలజీ రేడియాలజిస్ట్ పోస్టులు కూడా రావడం మరింత సంతోషం కలిగిస్తోంది. మీరు చల్లగా ఉండాలయ్యా అయ్యా మాది మచిలీపట్నం. నేను గుంటూరు జీజీహెచ్‌లో క్యాన్సర్ చికిత్స పొందుతున్నాను. ప్రభు త్వమే ఉచితంగా చికిత్స అంది స్తుండటంతో పాటు మందులు సమకూరు స్తోంది. నాలా గా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఎంతో మంది కోసం మీరు (సీఎం) అధునాతన ప్రమాణాలతో ఆసుపత్రి నిర్మించారు. ఇలాంటి ఆసుపత్రి ఎంతో అవసరం. మాలాంటోళ్లను అన్ని విధాలా ఆదుకుంటున్నారు. నిత్యావసరాలు అందజేస్తు న్నారు. నా భర్తకు పింఛన్ ఇస్తున్నారు. మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా. – వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంతో లక్ష్మి అంబులెన్స్ వ్యవస్థకు జీవం పోశారు ‘వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం 108 అంబులెన్స్ వ్యవస్థ నీరుగారి పోయింది. ఏ ప్రభుత్వమొచ్చినా పట్టించుకోలేదు. చివరకు మాకు వేతనాలు కూడా సకాలంలో ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టించారు. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేశాక.. మాకు, ఈ పథకానికి జీవం పోశారు. కొత్త వాహనాలు కొనుగోలు చేశారు. మాకు వేతనాలు రెట్టింపు చేశారు. బాధితులకు ఎలా భరోసా ఇచ్చారో మా జీవితాల్లోనూ అలాగే సంతోషం నింపారు’ అని 108 అంబులెన్స్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. నిర్వీర్యమైన వ్యవస్థను బతికించారు వాహనాలు మూలనపడ్డాయి. బాధితుల ఇబ్బందులు వర్ణనాతీతం. అలాంటి వ్యవస్థను ముఖ్యమంత్రి బతికించారు. ఇక రోగులకు, క్షతగాత్రులకు సకాలంలో సేవలందుతాయి. –బి.కిరణ్‌కుమార్, అధ్యక్షుడు, 108 ఉద్యోగుల సంఘం ప్రజలకు భరోసా ఇచ్చారు ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందో రాదోనన్న అనుమానం లేదు. ఏ సమయంలో ఫోన్ చేసినా అంబులెన్సు వస్తుందన్న భరోసా ఇ చ్చారు. పైగా ఎన్నో అధునాతన సదుపాయాలు కల్పించడం గొప్ప విషయం. – కేవీవీ నరసింహారావు, పైలట్, తూర్పుగోదావరి నేను విన్నాను అన్నది నిజమైంది పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మీ అందరికీ అండగా నేనున్నాను అంటూ ముఖ్యమంత్రి ధైర్యాన్నిచ్చారు. అందరూ ఆశ్చర్యపోయేలా వ్యవస్థలో మార్పు చేశారు. –ఎం.శ్రీనివాసరావు, పైలట్, విశాఖపట్నం అంబులెన్స్‌లకు స్వర్ణయుగం చెదలు పట్టిన అంబులెన్స్ వ్యవస్థకు స్వర్ణయుగం వచ్చింది. బాధి తులకు భరోసా ఇవ్వడమే కాదు, వేతనాలు పెంచి మాకూ అండగా నిలిచారు. సీఎం ఆలోచనలకు అనుగుణంగా అందరం పని చేస్తాం. – ఎన్. మహేష్, పైలట్, గుంటూరు -
ఆరోగ్య ప్రొఫైల్.. గజ్వేల్ నుంచే
మనం ఎన్ని కోట్లు సంపాదించి పిల్లలకు ఇచ్చామనేది ముఖ్యం కాదు. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అందించామన్నదే కీలకం. కోట్లు సంపాదించి పెట్టి వాతావరణ కాలుష్యం ఇస్తే ఏం ప్రయోజనం? ఇందుకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. హరితహారం కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి. పిల్లలను పెంచినట్లు మొక్కలు పెంచాలి. – ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గా ఉండాలి.. అందుకు ప్రజల ఆరోగ్య రికార్డును తయారు చేయాలి.. దీనికి గజ్వేల్ నియోజకవర్గమే నాంది కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగులో ఫారెస్టు కళాశాల, పరిశోధనా కేంద్రం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయ భవనాలను ఆయన ప్రారంభించారు. బుధవారం గజ్వేల్ పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనంపై పూల వర్షం కురిపిస్తున్న మహిళలు అనంతరం గజ్వేల్‌లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనం, మహతి ఆడిటోరియాలను ప్రారంభించి.. వంద పడకల మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అందరి ఆరోగ్య రికార్డు ఉంటుంది. ఇలాగే మన రాష్ట్రం లోనూ తయారు చేయాలని కేసీఆర్ అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు బ్లెడ్ గ్రూప్, ఇతర వివరాలు తెలిస్తే వెంటనే చికిత్స అందుతుందన్నారు. ములుగు అటవీ కళాశాలలో సరస్వతి దేవి విగ్రహం వద్ద పూజ చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు హరీశ్‌రావు, ఈటల, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు ముందుగా గజ్వేల్ నియోజకవర్గం ఎక్స్‌రే పేరుతో ప్రతి ఒక్కరినీ పరీక్షించి రికార్డు సిద్ధం చేయాలని చెప్పారు. తర్వాత రాష్ట్రమంతా అమలు చేయాలని ఆదేశించారు. గజ్వేల్‌లో నిర్మించిన ఆడిటోరియం పేరు ‘మహతి’అని.. ఈ పేరు తానే పెట్టానని చెప్పారు. ప్రపంచంలోనే గొప్ప సంగీత విద్వాంసులు నారద, తుంబురులని, నారద మహాముని వద్ద ఉన్న వీణ పేరు ‘మహతి’ అని చెప్పారు. ఇలాంటి ఆడిటోరియం ప్రతీ నియోజకవర్గంలో నిర్మించాలని ఆలోచిస్తున్నామని చెప్పా రు. అలాగే ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. అక్కడే సంపద సృష్టించాలని అందుకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కథానాయకులు కావాలని సీఎం పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలు.. జనవరి చివరి నాటికి గోదావరి జలాలు సిద్దిపేట జిల్లాలో ప్రవహిస్తాయని కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం జలాలతో కొండపోచమ్మ సాగర్ ప్రాం తమంతా పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుందని కేసీఆర్ అన్నారు. ఈ ప్రాంతంలో ఔషధ, సుగంధ మొక్కలు నాటాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. గతంలో ‘వికారాబాద్ హవా.. లాకో మరీదోంకా ధవా..’(వికారాబాద్ ప్రాంతంలోని ఔషధ మొక్కల గాలి లక్షల రోగాల ఉపయోగపడే ఔషధం) అనే నానుడి ఉండేదని కేసీఆర్ అన్నారు. అటువంటి వాతావరణం కొండపాక ప్రాంతంలో తీసుకురావాలన్నారు. జర గజ్వేల్‌పై దృష్టి పెట్టండి.. తాను వివిధ పనుల నిమిత్తం బిజీగా ఉండి నియోజకవర్గంపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నానని, మంత్రులూ.. మీరే గజ్వేల్‌పై జర కన్నేసి నిధులు మంజూరు చేయాలని కేసీఆర్ చమత్కరించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగులో నిర్మించిన అటవీశాఖ కళాశాల, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు తన కార్యాలయంలో పనిచేసే ఐఎఫ్ఎస్ అధికారిని ప్రియాంకా వర్గీస్ స్ఫూర్తి అని కేసీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఈటల రాజేందర్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, హౌసింగ్ కార్పొషన్ చైర్మన్ దామోదర్ గుప్త, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్రావు, కూర రఘోత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, యాదగిరిరెడ్డి, రసమయి బాలకిషన్, సతీష్‌కుమార్, పీసీసీఆర్ ఆర్ శోభ, డీన్ చంద్రశేఖర్రెడ్డిలు పాల్గొన్నారు. ఏమ్మా.. కిలో టమాటా ఎంత? రాయపోలు(దుబ్బాక): గజ్వేల్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ అక్కడి వ్యాపారులతో మాట్లాడారు. గజ్వేల్‌కు చెందిన కూరగాయల వ్యాపారి అడివమ్మను పలకరించారు. ఏమ్మా వ్యాపారం ఎలా ఉంది.. టమాటా కిలో ఎంత అంటూ ప్రశ్నించారు. బాగుంది సారూ.. అని ఆమె చెప్పగానే ‘మరి నాకు కూరగాయలు ఏమైనా ఇస్తావా’.. అంటూ అడిగారు. దీనికి ఆమె సంతోషంగా నవ్వులు కురిపిస్తూ.. ‘అయ్యో ఎంతమాట సారూ.. ఏం కావాలంటే అది ఇస్తాను..’అంటూ నాలుగైదు రకాల కూరగాయలను కేసీఆర్‌కు ఇవ్వబోయింది. అందుకు బోణీ అయిందా అంటూ.. ఆయన తన జేబులోంచి రూ.2 వేల నోటును తీసి అడివమ్మకు ఇచ్చారు. దీంతో ఎంతో సంబరపడిన అడివమ్మ.. కేసీఆర్‌కు రెండు చేతులు జోడించి దండం పెట్టింది. అనంతరం ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఏర్పాటు చేసిన సూపర్‌మార్కెట్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. మాంసం వ్యాపారులు, చేపల వ్యాపారులతో మాట్లాడారు. మల్లన్నసాగర్ పూర్తయితే అన్ని చెరువులు నీటితో నిండుతాయని, అప్పుడు మన చేపలే అమ్ముకుందామని వ్యాపారులతో అన్నారు. మోడల్ సీఎం కేసీఆర్ హరీశ్‌రావు నియోజకవ ర్గం ఎలా ఉండాలో చేసి చూపించిన కేసీఆర్ అని, గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్రానికే కాదు.. దేశానికే ఆదర్శమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం మహతి ఆడిటోరియం లో ఆయన మాట్లాడారు. ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా కేంద్రం, ఉద్యానవన వర్సిటీ, సమీకృత మార్కెట్, మహతి ఆడి టోరియం అన్నీ ఒకే రోజు ప్రారంభమయ్యాయని.. ఇది గజ్వేల్ చరిత్రలో శుభదినం అన్నా రు. ఒక్క గజ్వేల్‌లోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతీ పల్లెకు, ప్రతీ ఇంటికి తాగునీరు అందిం చిన ఘనత తెలంగాణదని, ఆ క్రెడిట్ అంతా సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. -
ట్రంప్ ఆరోగ్యం బాగాలేదా?
వాషింగ్టన్ : త్వరలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షల నివేదికలను విడుదల చేయనున్నారు. ఆయన మాటలు చూసి భయపడుతూ, ఆయన మానసిక, శారీరక ఆరోగ్య పరిస్థితి బాగా లేనట్లుంది అంటూ వస్తున్న విమర్శలకు సమాధానంగా వీటిని స్వయంగా ప్రభుత్వ వైద్యులే రిలీజ్ చేయనున్నారు. 2018లో కూడా ఆయన సమర్థంగా పనిచేయగలరని, అందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారని తెలిపేందుకు వీటిని బయటపెడుతున్నారు. 71 ఏళ్ల ట్రంప్ వివిధ సందర్భాల్లో ఎలాంటి మాటలు మాట్లాడతారో అందరికీ తెలిసిందే. ఒక్కోసారి 'గాడ్ బ్లెస్ అమెరికా' అనే మాటలు కూడా ఆయన అంటుండటంతో పలువురికి ఆయన ఆరోగ్య స్థితిపై ఊహగానాలు తలెత్తాయి. ముఖ్యంగా బుధవారంనాడు జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నానని చెప్పిన సందర్భంలో చేసిన ప్రసంగం తడబడటం కూడా ఆయన ఆరోగ్య స్థితి సరిగా ఉందా లేదని తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో వాల్టర్ రీడ్(నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్)లో పరీక్షలు నిర్వహించి ఆ రికార్డులను విడుదల చేయనున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ తెలిపారు. -
ఆరోగ్య రికార్డుల డిజిటైజేషన్
టాటా ట్రస్ట్‌తో వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలందరి ఆరోగ్య రికార్డులన్నింటినీ డిజిటైజేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీహెచ్‌సీలు మొదలు నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల వరకు వచ్చే రోగుల వైద్య వివరాలను ఆన్లైన్లో భద్రపరచనుంది. ఈ బాధ్యతను టాటా ట్రస్ట్‌కు అప్పగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుగా పిలిచే ఈ పద్ధతిలో రోగులందరి ఆరోగ్య సమాచార వివరాలను రిపోర్టులతో సహా స్కానింగ్ చేసి ఆన్లైన్లో ఉంచుతారు. సంబంధిత రోగికి కేటాయించిన ఆన్లైన్ నంబర్‌ను ఎంటర్ చేయగానే వారి ఆరోగ్య రికార్డులు వస్తాయి. మరో నంబర్ ఏదైనా ఇచ్చినా ఆధార్ నంబర్‌తోనే సమాచారం వచ్చేలా చేయాలని భావి స్తున్నారు. ఎప్పటిలోగా దీన్ని పూర్తి చేయాలనేది ఖరారు కాలేదని టాటా ట్రస్ట్ ప్రతినిధి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
ప్రభుత్వ స్కూళ్లలో వేద గణితం
- డిజిటల్ తరగతులు,ఆన్లైన్ పాఠాలతో బోధన - వినూత్న సంస్కరణల బాటలో పాఠశాల విద్యాశాఖ - త్వరలోనే ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం కడియం సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాల విద్యాశాఖ సంస్కరణల బాట పట్టింది. పలు వినూత్న విద్యా కార్యక్రమాల అమలుకు కార్యాచరణ రూపొందించింది. డిజిటల్ తరగతులు, ఆన్లైన్ పాఠాలు, వేద గణితం మెళకువలు, మార్షల్ ఆర్ట్స్, యోగా, స్పోర్ట్స్, గేమ్స్ వంటి వాటిని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ అంశాల్లో టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్ వెల్లడించారు. అందులో కొన్నింటిని ఇప్పటికిప్పుడే అమల్లోకి తేనున్నామని... మరి కొన్నింటిని దశల వారీగా అమల్లోకి తెస్తామని చెప్పారు. పాఠశాల విద్యలో తీసుకురాబోతున్న వివిధ మార్పులు, సంస్కరణలను ఆయన వెల్లడించారు. 3,700 పాఠశాలల్లో అమలు వంద మందికిపైగా విద్యార్థులున్న దాదాపు 3,700 ఉన్నత పాఠశాలల్లో వేద గణితం మెళకువలు, మార్షల్ ఆర్ట్స్, యోగా, స్పోర్ట్స్ వం టివి తప్పనిసరిగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక పద్ధతులు, మెళకువలు కలిగిన వేద గణితంలోని అంశాల ఆధారంగా గణితం బోధన చేపడతారు. తద్వారా విద్యార్థులకు సులభంగా అర్థంకావడంతో పాటు విద్యార్థులు కూడా బోధనలో పాలు పంచుకునేలా చేస్తారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికే వందేమాతరం ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీచర్లకు, విద్యా వలంటీర్లకు శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం నియమిస్తున్న 9,335 మంది విద్యా వలంటీర్లు ఈ నెల 16వ తేదీ నుంచి బోధన ప్రారంభించాల్సి ఉంది. కానీ తాజా నిర్ణయం నేపథ్యంలో వారంతా శిక్షణ తరువాతే బోధన ప్రారంభిస్తారు. ఇక ప్రతి జిల్లాలో 20 మందిని మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేసి.. ఈ వారంలో లేదా వచ్చే వారంలో శిక్షణ ఇస్తారు. తరువాత వారి ఆధ్వర్యంలో జిల్లాల్లోని మిగతా టీచర్లకు శిక్షణ ఇస్తారు. బోధనలోనే కాదు యోగా వంటి అంశాల్లోనూ ఈ శిక్షణ ఉంటుంది. అలాగే ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లను విద్యా వలంటీర్లుగా తీసుకుంటున్న నేపథ్యంలో వారికి, పీఈటీలకు కూడా యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చి పాఠశాలల్లో అమలు చేస్తారు. ప్రతి ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్, గేమ్స్ తప్పనిసరి చేస్తారు. రెండు ఇండోర్ గేమ్స్, ఆటస్థలాలున్న చోట రెండు ఔట్‌డోర్ గేమ్స్ తప్పనిసరిగా అమలు చేస్తారు. విద్యార్థులకు హెల్త్ రికార్డులు పాఠశాలల్లో విద్యార్థులకు పక్కాగా హెల్త్ చెకప్‌తోపాటు హెల్త్ రికార్డులు రూపొందిస్తారు. వీటిని ఆన్‌లైన్‌లోనూ నమోదు చేస్తారు. ఈసారి యూనిఫారాల ధరలు 25 శాతం మేర తగ్గనున్నాయి. పవర్ లూమ్స్ ఆధ్వర్యంలో వస్త్రం తయారు చేసి, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పాఠశాల యూనిట్‌గా కుట్టించి అందించేందుకు చర్యలు చేపడుతున్నందున ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. దీనివల్ల యూని ఫారాలు అందించే క్రమంలో కిందిస్థాయి సిబ్బంది ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది. డిజిటల్ తరగతులు, డిజిటల్ లెర్నింగ్ పాఠశాలల్లో డిజిటల్ ఆధారిత శిక్షణను ప్రారంభించనున్నారు. ఇప్పటికే 70 శాతం ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్‌కు అవసరమైన ప్రొజెక్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాష్ట్రానికి తిరిగి రాగానే వాటిని ప్రారంభిస్తారు. ఈ లెర్నింగ్ కోసం 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంటరాక్టివ్ మాడ్యూల్స్‌ను సిద్ధం చేశారు. వీలైన చోట ఆన్లైన్లో అంశాల ఆధారంగా పాఠ్యాంశాల బోధన చేపడతారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ ఆధ ్వర్యంలో 250 స్కూళ్లలో, ఐటీ శాఖ ఆధ్వర్యంలో 500 స్కూళ్లలో మొదట దీనిని అమలు చేస్తారు. తరువాత మిగతా పాఠశాలలకు విస్తరిస్తారు. ఇక ప్రైమరీ, ప్రీపైమరీ విద్యార్థుల కోసం యూనిసెఫ్ ఆధ్వర్యంలో టాకింగ్ బుక్స్‌ను సిద్ధం చేశారు. ఇందులో ఏదైనా బొమ్మ, పదంపై దానికి సంబంధించిన పెన్ను పెట్టగానే అదేమిటన్నది ధ్వని రూపంలో వస్తుంది. దీనిని 6నెలల్లోగా అమల్లోకి తెస్తారు. ప్రీప్రైమరీ ఇంగ్లిష్ మీడియం టీచర్లకు ఈ నెలాఖరులో బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బోధనలో శిక్షణ ఇస్తారు.