ట్రంప్‌కు రెండోసారి కరోనా పరీక్షలు | Donald Trump Tested Negative In Recent 15 Minute Corona Test | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు రెండోసారి కరోనా పరీక్షలు

Published Fri, Apr 3 2020 9:37 AM | Last Updated on Fri, Apr 3 2020 9:54 AM

Donald Trump Tested Negative In Recent 15 Minute Corona Test - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. గురువారం నిర్వహించిన పరీక్షల్లోనూ ఆయనకు నెగిటివ్‌ వచ్చింది. 15 నిమిషాల కంటే తక్కువ సమయంలో ఫలితాలను ఇచ్చే అబాట్‌ లాబరేటరీ ప్రవేశపెట్టిన నూతన పద్దతి ద్వారా ఆయన ఈ పరీక్ష చేయించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన స్పందిస్తూ.. ‘‘‘  నా ఆత్రుతను పక్కన పెట్టి, అది అంత త్వరగా ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుంద’’ని పేర్కొన్నారు. గత నెలలో ట్రంప్‌తో చర్చలు నిర్వహించిన బ్రెజిల్‌ ప్రతినిధి బృందానికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. (చిగురుటాకులా వణికిపోతున్న అమెరికా )

ఈ నేపథ్యంలో వారితో ట్రంప్‌ సన్నిహితంగా మెలగడంతో ఆయనకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ట్రంప్‌కు ఎలాంటి వైరస్‌ సోకలేదని వైద్యులు ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. కాగా, అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 2 లక్షల 36 వేలకు పైగా కేసులు నమోదు కాగా, దాదాపు 6 వేల మంది మృత్యువాత పడ్డారు. నిన్న ఒక్కరోజే 900పైగా మంది మరణించటం గమనార్హం. ( ‘‘డాడీ! వద్దు డాడీ.. వద్దు అంకుల్’’ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement