
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. అరిజోనాలో నూతనంగా ఏర్పాటైన మాస్క్ ఫ్యాక్టరీని ట్రంప్ సందర్శించిన సందర్భం ఇందుకు వేదికైంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న క్రమంలో ముఖానికి మాస్క్ లేకుండా ట్రంప్ మాస్క్ ఫ్యాక్టరీని సందర్శించడం వివాదాస్పదమైంది. ఈ పర్యటనలో అధ్యక్షుడు సేఫ్టీ గాగుల్స్ ధరించినా ఫేస్ మాస్క్‌ను విస్మరించారు. ఫ్యాక్టరీలో ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలని అక్కడ సైన్ బోర్డు ఉండటం విశేషం.
ఈ ప్లాంట్‌లో కార్మికులందరూ మాస్క్‌లు ధరించగా ట్రంప్ సహా ఇతర అతిధులు మాస్క్‌లు ధరించలేదు. దీంతో మాస్క్‌లను తయారు చేసే ఫ్యాక్టరీలోనే ట్రంప్ మాస్క్ లేకుండా తిరిగారని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. మాస్క్‌లపై ఆయనకు నమ్మకం లేదా..? అందుకే మాస్క్ ఫ్యాక్టరీకి ముఖాన్ని కవర్ చేసుకోకుండా వెళ్లారా.? అంటూ ఓ ట్విటర్ యూజర్ ప్రశ్నించారు. కోవిడ్-19 దిగ్గజాలకు సోకదు..అందుకే మాస్క్ ఫ్యాక్టరీలో కేవలం కార్మికులే మాస్క్ ధరించారని మరో యూజర్ ట్రంప్‌ను ట్రోల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment