వాషింగ్టన్: తమ దేశం ప్రస్తుతం నాలుగు సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోందని, కఠిన శ్రమతో వాటిని అధిగమిస్తామని అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘‘కోవిడ్-19 మొదలు ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పు, జాతి వివక్ష- సమన్యాయం వంటి నాలుగు అతిపెద్ద చారిత్రాత్మక సంక్షోభాలు ఒకేసారి దేశాన్ని చుట్టుముట్టాయి. జనవరి నుంచి సమయం వృథాగా పోనివ్వం. సంక్షోభాల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు మొదటి రోజు నుంచే చర్యలు తీసుకునేలా నేను, నా బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’ అని బైడెన్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా... ఆరోగ్య సంక్షోభం నుంచి బయపడేందుకు ఉద్దేశించిన ట్రిలియన్ డాలర్ కరోనా రిలీఫ్ బిల్‌కు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ఆదివారం ఆమోదముద్ర వేశారు.(చదవండి: భారత్‌తో చెలిమికే బైడెన్ మొగ్గు!)
‘‘కోవిడ్ రిలీఫ్ బిల్లు గురించి ఒక శుభవార్త. మరింత సమాచారం గురించి తెలుసుకోండి’’ అని ట్విటర్ వేదికగా బైడెన్‌కు కౌంటర్ ఇచ్చారు. కాగా తొలుత ఈ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ట్రంప్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ట్రంప్ మొండి వైఖరి కారణంగా లక్షలాది మంది ప్రజలు సహాయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బైడెన్ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, ఇటీవల జరిగిన ఎలక్టోరల్ కాలేజీ ఓటింగ్‌లో 306 ఓట్లు పొందడంతో ఆయన విజయం మరోసారి నిర్దారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా జనవరిలో బైడెన్ పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. కరోనా వైరస్ ధాటికి అమెరికాలో పెద్ద ఎత్తున మరణాలు సంభవించడం, ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం, వీటికి తోడు దేశంలో జాతి వివక్ష చర్యలు పెచ్చుమీరడంతో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా ఓటర్లు ఈ మేరకు తీర్పునిచ్చారు.
From COVID-19 and the economy to climate change and racial justice — our nation is facing four historic crises at once. And come January, there will be no time to waste. That’s why my team and I are hard at work preparing to take action on day one.
— Joe Biden (@JoeBiden) December 27, 2020
Good news on Covid Relief Bill. Information to follow!
— Donald J. Trump (@realDonaldTrump) December 27, 2020
Comments
Please login to add a commentAdd a comment