భారతీయులకు బెస్ట్ వీసా ఇదే
భారతీయులకు బెస్ట్ వీసా ఇదే
Published Tue, Jun 27 2017 1:34 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
ఛండీఘర్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడ నివసిస్తున్న భారతీయుల్లో గుండెల్లో దడ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా కలలు కల్లలు కాకుండా ఉండటానికి భారతీయులకు బెస్ట్ వీసాగా ఈబీ-5 వీసా ఉన్నట్టు అమెరికా ఇమ్మిగ్రేషన్ లాయర్ చెప్పారు. అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలనుకునేవారికి ఇది ఓ ఆశాకిరణంగా పేర్కొన్నారు. ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన అమెరికా ఇన్వెస్ట్ మెంట్ ఇమ్మిగ్రేషన్ అటార్ని వాఘన్ డీ కిర్బీ, తమ సంస్థ విజయవంతంగా 1,300 ఈబీ-5 అప్లికెంట్లను కలిగి ఉందని చెప్పారు. ఈ ప్రోగ్రాం ద్వారా అమెరికాలో పెట్టుబడులు పెడితే చాలు సదరు వ్యక్తి, అతని కుటుంబంతో సహా జీవితకాలం అమెరికాలోనే ఉండొచ్చని తెలిపారు. అయితే వారి పిల్లల వయసు 21 ఏళ్ల కంటే తక్కువగా ఉండాలి.
కాగ, ఈబీ-5 ఇన్వెస్ట్ మెంట్ వీసా ప్రొగ్రామ్ గడువు 2017 సెప్టెంబర్ 30తో ముగుస్తోంది. అయితే ఈబీ-5 ఇన్వెస్ట్ మెంట్ వీసా ప్రొగ్రామ్ కింద అప్లికెంట్ అమెరికాలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడైతేనే గ్రీన్ కార్డు పొందుతారు. అదేవిధంగా శాశ్వత గ్రీన్ కార్డు పొందిన తర్వాత కూడా 10మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించగలగాలి. భారతీయులకు ఈ వీసా కేటగిరీ ప్రాసెసింగ్ సమయం కేవలం 18నెలలే పడుతుందని కిర్బీ చెప్పారు. గత కొంతకాలంగా ట్రావెల్ నిషేధం, హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు, విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిపై ఆంక్షలు ఈబీ-5 వీసా దరఖాస్తులపై మరలుస్తోంది. అమెరికాలో స్వేచ్ఛగా ప్రయాణించడానికి, పనిచేయడానికి, ఈబీ-5 వీసానే సరియైనది కిర్బీ తెలిపారు.
Advertisement
Advertisement