EB-5 visas
-
అమెరికా వెళ్లేవారికి అలర్ట్: కొత్త ఫీజులు రేపటి నుంచే..
అమెరికా వెళ్లాలనుకుని వీసా ప్రయత్నాల్లో ఉన్నవారికి షాకింగ్ వార్త ఇది. ఏప్రిల్ 1 నుంచి వలసేతర అమెరికన్ వీసా కోసం వసూలు చేసే ఫీజులో భారీ పెరుగుదల ఉండబోతోంది. వీసా ఫీజు ఒకేసారి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ఈ పెంపు హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1), ఈబీ-5 (EB-5) వీసాలకు వర్తిస్తుంది. 8 ఏళ్ల తర్వాత పెంపు అమెరికాలో నివసించడానికి వచ్చే భారతీయులు ఎక్కువగా హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసాలు తీసుకుంటారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఫీజుల పెంపుదల జరుగుతోంది. గతంలో 2016లో ఫీజులు పెంచారు. వీసాల పెంపుదల తర్వాత ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు వర్తిస్తాయని ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లో యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. వీసా కొత్త ఫీజులు ఇలా.. కొత్త హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, దీని కోసం ఫారమ్ I-129 ఉంటుంది. దీని రుసుము 460 డాలర్లు నుండి 780 డాలర్లకు పెరగనుంది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ.38,000 నుంచి రూ.64,000కు పైగా పెరుగుతుంది. ఇది కాకుండా హెచ్1బీ రిజిస్ట్రేషన్ ఫీజు 10 డాలర్లు(రూ. 829) నుంచి 215 డాలర్లు (సుమారు రూ. 17,000) పెరుగుతుంది. ఇక ఎల్-1 వీసా రుసుము ఏప్రిల్ 1 నుంచి మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతానికి ఇది 460 డాలర్లు (సుమారు రూ. 38,000) ఉంది. ఇది ఏప్రిల్ 1 నుండి 1385 డాలర్లకు (రూ. 1,10,000) పెరుగుతుందని అంచనా. ఎల్-1 అమెరికాలో నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీ కింద వస్తుంది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల బదిలీ కోసం దీన్ని రూపొందించారు. అలాగే ఈబీ-5 వీసా ఫీజులు కూడా మూడు రెట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం 3675 డాలర్లు (దాదాపు రూ. 3 లక్షలు) ఉండగా 11160 డాలర్లకు (దాదాపు రూ.9 లక్షలు) పెరగవచ్చని అంచనా. ఈబీ-5 వీసాను 1990లో యూఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. దీని కింద అధిక ఆదాయ విదేశీ పెట్టుబడిదారులు అమెరికన్ వ్యాపారాలలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టడం ద్వారా వారి కుటుంబాలకు వీసాలు పొందవచ్చు. కనీసం 10 మంది అమెరికన్లు ఉద్యోగాలు పొందగలిగేలా ఈ వ్యాపారం ఉండాలి. -
వీసా ఫీజులు పెంచిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ, ఎల్–1, ఈబీ–5 తదితర నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపు ప్రకారం..భారతీయ టెక్కీలు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే హెచ్–1బీ వీసా ఫీజు ప్రస్తుతమున్న 460 డాలర్ల నుంచి ఏకంగా 780 డాలర్లకు పెరిగింది. హెచ్–1బీ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా 10 అమెరికన్ డాలర్ల నుంచి 215 డాలర్లకు పెరగనుంది. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. అదే విధంగా, ఎల్–1 వీసా ఫీజు 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు, ఇన్వెస్టర్ల వీసాగా పిలిచే ఈబీ–5 కేటగిరీ వీసా ఫీజును ప్రస్తుతమున్న 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచుతున్నట్లు ఫెడరల్ ప్రభుత్వం బుధవారం ఒక నోటిఫికేషన్లో వివరించింది. 2016 తర్వాత మొదటిసారిగా చేపట్టిన వీసా ఫీజుల పెంపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కానుంది. -
అమెరికన్ వీసా మంజూరులో మార్పులు.. తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
డాలర్ డ్రీమ్‌ను నెరవేర్చుకోవాలనుకునే ప్రతి పౌరుడి కలల్ని నిజం చేసేలా అమెరికా ప్రభుత్వం వీసాల మంజూరులో తగు మార్పులు చేస్తూ వస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ తరుణంలో 2023 వీసాల జారీ అంశంలో జోబైడెన్ ప్రభుత్వం ఏయే మార్పులు చేసిందో తెలుసుకుందాం. హెచ్-1బీ, ఈబీ-5, స్టూడెంట్ వీసాలు (ఎఫ్, ఎం, జే) సహా వివిధ కేటగిరీలను ప్రభావితం చేసేలా 2023లో గణనీయమైన మార్పులు చేసింది. వాటిల్లో హెచ్-1బీ వీసా పునరుద్ధరణకు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే టెక్నాలజీ రంగాల్లో ప్రతిభావంతులైన నిపుణులకు హెచ్-1 బీ వీసా తప్పని సరి. ఇప్పుడీ వీసాల పునరుద్ధరణ కోసం ఈ ఏడాది పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. జనవరిలో అమెరికా విదేశాంగ శాఖ హెచ్-1బీ డొమెస్టిక్ వీసా రెన్యువల్ పైలట్‌ను పరిమితంగా ప్రవేశపెట్టి 20,000 మందిని తమ వీసాలను రెన్యువల్ చేసుకునేందుకు అనుమతించింది. ఇందులో భాగంగా దరఖాస్తుదారులు వీసా రెన్యూవల్ కోసం వారి దేశానికి వెళ్లే పనిలేకుండా తమ దేశంలోనే రెన్యూవల్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే వారి జీవిత భాగస్వాములు ఈ ప్రక్రియకు అనర్హులుగా గుర్తించింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లలో అధిక ప్రాతినిధ్యాన్ని అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం 2023లో కఠిన చర్యలు చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం. అయితే ఇప్పుడు యజమానులు ప్రతి నమోదుదారుకు పాస్ పోర్ట్ సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. నో పేపర్.. ఇకపై అంతా అన్లైన్ 2023లో అమెరికా ప్రభుత్వం వీసా ధరఖాస్తును ఆన్లైన్లోనే చేసుకునే వెసలు బాటు కల్పించింది. పేపర్ వర్క్ వల్ల చిన్న చిన్న పొరపాట్లు తలెత్తి వీసా రిజెక్ట్‌లు అవుతున్న సందర్భాలు అనేకం. దీని వల్ల అభ్యర్ధులు అమెరికాకు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల్ని అధిగమించేలా పేపర్‌పై ధరఖాస్తు చేసుకోవడాన్ని తగ్గించింది. ఆన్లైన్లో వీసా ప్రాసెస్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈబీ-5 వీసా దరఖాస్తుదారులకు అక్టోబర్ 2023 లో, యూఎస్ఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) ఈబీ -5 వీసా విధానంలో మార్పులు చేసింది. ఎవరైతే ఈబీ-5 వీసా పొంది దాన్ని రీఎంబర్స్మెంట్ చేయించుకున్న రెండేళ్ల తర్వాత గ్రీన్ కార్డ్‌కు అర్హులుగా గుర్తిస్తుంది. ఈ ఏడాది ఈబీ-5 వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ వేగాన్ని కూడా యూఎస్ సీఐఎస్ గణనీయంగా పెంచింది. ఈబీ–5 వీసా అంటే.. అమెరికాలో గ్రీన్కార్డ్కు దాదాపు సమానమైన గుర్తింపు ఉన్నదే ఈబీ–5 వీసా. అంతటి ప్రాధాన్యమున్న ఈ వీసా పొందాలంటే వ్యక్తులు అమెరికాలో కనీసం 8 లక్షల అమెరికన్ డాలర్లను (భారతీయ కరెన్సీలో రూ.6.57 కోట్లు) పెట్టుబడిగా పెట్టడంతోపాటు కనీసం 10 ఉద్యోగాలను కల్పించాలి. దాంతో వారికి పెట్టుబడిదారుల హోదా కింద ఈబీ–5 వీసాను జారీచేస్తారు. ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేయాలంటే గతంలో 5 లక్షల అమెరికన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని నిబంధన ఉండేది. కానీ, ఈ వీసాల కోసం డిమాండ్ పెరుగుతుండడంతో యూఎస్సీఐఎస్ ఈ కనీస పెట్టుబడి మొత్తాన్ని 2022లో 8 లక్షల డాలర్లకు పెంచింది. స్టూడెంట్ వీసా పాలసీల అప్ డేట్ అమెరికన్ కాన్సులర్ అధికారులు చేసే వీసా ప్రాసెసింగ్‌కు సంబంధించిన ఖర్చులకు అనుగుణంగా ఎఫ్, ఎం, జే వీసాల ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతున్నట్లు జోబైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక, కాన్సులర్ అధికారులు ఇప్పుడు విద్యార్థుల వీసా దరఖాస్తులను పరిశీలిస్తారని తెలిపింది. -
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? కచ్చితంగా ఇవి తెలుసుకోండి!
చక్రవర్తి (40) ఐటీ టెక్నికల్ మేనేజర్. శుభ్ర (32) ఐటీ బిజినెస్ అనలిస్ట్. ఈ దంపతులు మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం, నాణ్యమైన జీవితం కోరుకుంటూ 2019లో విదేశానికి వెళ్లిపోయి స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. కెనడా శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకున్నారు. చివరికి 2022 మార్చిలో వీరు టొరంటోకు వెళ్లిపోయారు. ఇదొక్క ఉదాహరణ మాత్రమే. విద్యార్థులు ఉన్నత విద్య పేరుతో వెళ్లి, కోర్సు ముగిసిన అనంతరం అక్కడే అవకాశాలు వెతుక్కుని స్థిరపడుతున్నారు. ఇక్కడ కెరీర్ మొదలు పెట్టిన వారు కూడా విదేశీ అవకాశాల కోసం అన్వేíÙస్తున్నారు. కానీ, వలసపోవడం అంత సులభ ప్రక్రియ కాదు. దానికి చాలా సమయం తీసుకుంటుంది. అనుకున్న గడువు కంటే ముందుగా ఆరంభించాలి. దీనికి ఎన్నో పత్రాలు సమరి్పంచాలి. ముందస్తు ప్రణాళిక మేరకు నడుచుకుంటే అనుకున్న విధంగా విదేశీయానం సుఖవంతమవుతుంది. ఈ దిశగా ఆలోచన చేసే వారు నిపుణుల సూచనలు తెలుసుకోవడం వల్ల మెరుగైన ప్రణాళిక వేసుకోవడం సాధ్యపడుతుంది. ‘ప్యూ రీసెర్చ్’ అధ్యయనం ప్రకారం ప్రపంచ దేశాల్లో ఉద్యోగ వలసలు భారత్ నుంచే ఎక్కువగా ఉంటున్నాయి. ‘‘2020లో 1.79 కోట్ల మంది అంతర్జాతీయ వలసవాదుల మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత 1.12 కోట్ల మంది మెక్సికో, 1.08 కోట్ల మంది రష్యా మూలాలు కలిగి ఉన్నారు’’అని ‘ప్యూ రీసెర్చ్’ నివేదిక వెల్లడించింది. మన దేశం నుంచి ఏటా లక్షల సంఖ్యలో విదేశాలకు వలస పోతున్నట్టు ఈ నివేదికలోని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ‘‘విదేశీయాన ప్రక్రియను ముందుగా ప్రారంభించాలి. అప్పుడు అది సులభతరం అవుతుంది. ఏదైనా ఊహించని ఘటన ఎదురైనా ఎదురుకావచ్చు. మరో ఆరు నెలల్లో వెళ్లాలని అనుకుంటే ఇప్పుడే ఆ ప్రక్రి యను ప్రారంభించాలి’’అనిక్యానమ్ ఎంటర్ప్రైజెస్ సీఈవో క్యాలబ్రెస్ సూచించారు. క్యానమ్ అనేది న్యూయార్క్‌కు చెందిన బహుళజాతి పెట్టుబడుల నిర్వహణ సంస్థ. వివరాలతో సరైన ప్రణాళిక ఎలా..? చక్రవర్తి, శుభ్ర 2019లో కెనడా వెళ్లాలని ప్లాన్ చేసుకోగా, 2020లో కరోనా రాకతో ఆలస్యం అయింది. కాకపోతే భారత్‌లో వారు పనిచేస్తున్న కంపెనీయే ఇద్దరు బదిలీకి ఏర్పాట్లు చేయడంతో ఆలస్యమైనా సాఫీగా విదేశానికి తరలిపోయారు. కానీ, ప్రతి ఒక్కరికీ ఇలా జరగాలని లేదు. ‘‘కొందరు విద్యార్థులుగానే విదేశాలకు వెళ్లి గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఉద్యోగంలో చేరిపోతారు. కొందరు స్వదేశంలోనే విద్య పూర్తి చేసుకుని నిపుణులుగా తర్వాత విదేశీ ఉద్యోగానికి వెళ్లిపోతుంటారు. కొందరు వ్యాపారవేత్తలుగా వెళ్లి వ్యాపారాలు ప్రారంభిస్తుంటారు. చివరిగా పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా విదేశీ పౌరసత్వం సొంతం చేసుకోవచ్చు’’అని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన గ్లోబల్‌గేట్ గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అభినవ్ లోహియా వివరించారు. విదేశంలో ఉద్యోగం సంపాదించి వలసపోవడం అన్నింటిలోకి ప్రముఖమైనది. ‘ఎక్స్‌పాట్ ఇన్సైడర్ 2021’ సర్వే ప్రకారం విదేశాల్లో పనిచేస్తున్న 59 శాతం మంది భారతీయులు కెరీర్లో మెరుగైన అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లినవారే. అంతర్జాతీయంగా ఈ రేటు 47 శాతంగానే ఉంది. ఇలా విదేశాల్లో స్థిరపడిన భారతీయుల్లో 23 శాతం మంది సొంతంగా ఉద్యోగాన్ని వెతుక్కోగా, 19 శాతం మందిని అంతర్జాతీయ సంస్థలు సొంతంగా నియమించుకున్నాయి. 14 శాతం మందిని వారి సంస్థలే పంపించాయి. కేవలం 3 శాతం మంది వ్యాపారం పేరుతో విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. బ్రిటన్ను తీసుకుంటే భారత్ నుంచి ఎక్కువమంది స్కిల్డ్ వర్కర్ వీసా ద్వారానే అక్కడికి వెళుతున్నారు. 2022లో భారతీయులు 1,03,000 యూకే వీసాలను సొంతం చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 148 శాతం ఎక్కువ. 2022లో యూకే జారీ చేసిన వర్కర్ వీసాల్లో 46 శాతం భారతీయులకే దక్కాయి. జాబ్ ఆఫర్ ఉన్న వారికే స్కిల్డ్ వర్కర్ వీసా జారీ చేస్తారు. అభ్యర్థులకు ఇంగ్లిష్ ప్రావీణ్యం కూడా ఉండాలి’’అని ఏవై అండ్ జే అసోసియేట్స్ డైరెక్టర్ యాష్ దుబాల్ తెలిపారు. స్టూడెంట్ వీసా ద్వారా విదేశాలకు వెళ్లడం మరో మార్గం. ఇది పరోక్ష మార్గం కిందకు వస్తుంది. సాధారణంగా స్టూడెంట్ వీసా గడువు పూర్తయిన తర్వాత, విద్యార్థులు ఏడాది గడువుతో కూడిన విజిట్ పాస్ పొందొచ్చు. ఈ కాలంలో ఉద్యోగం వెతుక్కోవచ్చు. ఉద్యోగం పొందిన ఆరు నుంచి రెండేళ్ల అనంతరం (వివిధ దేశాల్లో వివిధ కాల వ్యవధి) శాశ్వత నివాస హోదా పొందొచ్చు. స్టూడెంట్ వీసా ఖర్చు అన్నది వివిధ దేశాల మధ్య మారిపోతుంటుంది. కొన్ని దేశాల్లో పౌరసత్వం కొనుగోలు చేసుకోవడం మరొక మార్గం. పరిమితి మేరకు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈబీ–5 వీసా తీసుకోవచ్చు. అమెరికాలో ఈబీ–5 వీసా కోసం యునైటెడ్ స్టేట్స్ సిటిజన్íÙప్ సర్వీస్ ప్రాయోజిత ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అమెరికాకు స్వల్ప వ్యవధిలోనే పౌరసత్వం ద్వారా వెళ్లేందుకు ఉన్న ఏకైక మార్గం ఇది. విద్యార్థులు అయితే యూనివర్సిటీ ర్యాంకింగులు చూడాలి. కెరీర్ వృద్ధి, ఉద్యోగ స్థిరత్వాన్ని పరిశీలించాలి. వ్యాపారం ప్రారంభించేందుకు వెళ్లేవారు ముందే విజయావకాశాలను అంచనా వేసుకోవాలి. వ్యయాలు చూడాలి.. ఏ దేశానికి, ఏ రూపంలో వెళ్లాలనే దాని ఆధారంగా ఖర్చు మారిపోతుంది. ఓ కంపెనీలో పనిచేసే నిపుణుడు అదే కంపెనీ ఉద్యోగిగా వేరే దేశానికి వెళ్లేట్టు అయితే టికెట్, రవాణా చార్జీలను పెట్టుకుంటే చాలు. ఇమిగ్రేషన్ చార్జీలను కంపెనీలే భరిస్తాయి. వీసా, లీగల్ ఫీజు వంటి ఇతర వ్యయాలు కూడా ఉంటాయి. ‘‘నా స్నేహితులు కొందరు ఉద్యోగం కోసం ఇక్కడకు (కెనడాకు) వచ్చారు. తగిన ఉద్యోగం వెతుక్కునేందుకు కొన్ని నెలల పాటు ఇక్కడ ఉండాల్సి వచి్చంది. ఇక్కడ అద్దెలు చాలా ఎక్కువ. కనుక ఇక్కడకు వచ్చే వారు ముందుగానే ఈ ఖర్చుల గురించి తెలుసుకోవాలి. అందుకు సరిపడా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకుని రావాలి. తమ ఖర్చులకు సరిపడా డబ్బులున్నట్టు ఆధారాలు కూడా చూపించాలి’’అని శుభ్ర తెలిపారు. కెనడాకు వెళ్లాలంటే ఒక వ్యక్తికి ఎంతలేదన్నా 15,500 కెనడియన్ డాలర్లు కావాలి. అదే దంపతులకు అయితే 21,000 డాలర్లు, పిల్లలతో వెళ్లాలంటే 30,000 డాలర్లు అవసరమవుతాయి. అమెరికాకు వెళ్లాంటే గ్రీన్ కార్డ్ కోసం కనీసం 1.8 మిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం అవుతుంది. అదే ఆ్రస్టేలియాకు వెళ్లాలంటే నలుగురు సభ్యుల కుటుంబానికి 30,000 నుంచి 40,000 ఆ్రస్టేలియన్ డాలర్లు కావాలి. ‘‘ఈబీ–5 వీసా కోసం పెట్టుబడి వేర్వేరుగా ఉంటుంది. అమెరికా అయితే ఈబీ–5 వీసా ఖర్చు 8 లక్షల డాలర్లు. కెనడా అయితే 12 లక్షల కెనడియన్ డాలర్లు. ఈబీ–5 వీసాకు ముందు లోతైన పరిశీలన ఉంటుంది. సంబంధిత వ్యక్తి చేసే పెట్టుబడులకు మూలాలు, ఎంత మందికి ఉపాధి కలి్పస్తున్నారన్నది చూస్తారు. దీనికి అదనంగా అమెరికాలో పరిపాలనా, న్యాయపరమైన చార్జీలు 75,000 డాలర్లు అవుతాయి. అటార్నీ ఫీజులు 10,000–20,000 డాలర్లు పెట్టుకోవాలి. అదే యూకే అయితే స్కిల్డ్ వర్కర్ వీసా కోసం దరఖాస్తు ఫీజు 625 నుంచి 1,423 బ్రిటిష్ పౌండ్లు ఉంటుంది. హెల్త్‌కేర్ సర్‌చార్జీ మరో 624 బ్రిటిష్ పౌండ్ల వరకు ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీ, హోటల్ తదితర చార్జీలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వెళ్లే ముందుగా.. ‘‘విదేశానికి వలస వెళ్లే వరకు రెండు దేశాల కరెన్సీని దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే కొత్త దేశానికి వెళ్లి సెటిల్ అవ్వడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. నివసించే దేశానికి సంబంధించి పన్ను నిబంధనలు, పౌర చట్టాల గురించి తెలుసుకోవాలి. విదేశాల్లో నివాస ప్రమాణాలు చాలా ఎక్కువ. కనుక తగినన్ని నిధులు సిద్ధం చేసుకుని వెళ్లాలి. పెద్ద మొత్తంలో ఖర్చులు ఎదురుకావచ్చు’’ అని ఎప్సిలాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్ రావు సూచించారు. ఇక బీమా తీసుకోవడం కూడా మర్చిపోవద్దు. చాలా దేశాల్లో దీన్ని తీసుకోవడం తప్పనిసరిగా అమల్లో ఉంది. తీసుకునే బీమాలో వేటికి కవరేజీ ఉంది, లేనిదీ తెలుసుకోవాలి. విదేశాలకు వెళ్లిన తర్వాత భారత్‌లో కేవైసీల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దేశీయంగా పెట్టుబడులు కలిగిన ఆరి్థక సంస్థలకు విదేశాల్లోని చిరునామా ఇవ్వాలి. ఎన్ఆర్ఐగా హోదా మార్చుకోవాలి. అప్పుడు స్వదేశంలో పెట్టుబడులు, పన్నుల బాధ్యతలు కొనసాగించుకోవచ్చు. విదేశాలకు తరలిపోయే వారు స్వదేశంలో విలువ తరిగిపోయే ఆస్తులను వదిలించుకుని వెళ్లడమే సరైనది. విలువ పెరిగే రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు ఉంటే వాటి సంరక్షణ బాధ్యతలను ఎవరో ఒకరు చూసేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా అన్ని అంశాలను సమగ్రంగా తెలుసుకుని, అన్నీ విచారించుకుని, తగిన ప్రణాళికతో బయల్దేరితే విదేశీయానం సుఖవంతమవుతుంది. -
పెట్టుబడి పెట్టు.. ఈబీ–5 వీసా పట్టు
సాక్షి, అమరావతి: ఈబీ–5 వీసా.. ఇదీ ప్రస్తుతం అమెరికాలోని భారతీయ వృత్తి నిపుణుల సరికొత్త తారకమంత్రం. అమెరికాలోని ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తుండటంతో ఆ దేశంలో కొనసాగేందుకు భారతీయ వృత్తి నిపుణులకు కనిపిస్తున్న మరో ప్రత్యామ్నాయం. అమెరికాలో వృత్తి నిపుణులుగా కొనసాగేందుకు ఆ దేశంలో పెట్టుబడిదారులుగా మారుతున్నారు. ఇందులో భాగంగా అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ కేటగిరీలో ఈబీ–5 వీసాల కోసం అమెరికాలోని భారతీయులు అత్యధికంగా దరఖాస్తులు చేస్తున్నారని ‘యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రియల్ ఎస్టేట్‌లో మన వాళ్ల పెట్టుబడులు.. ఆర్థిక మాంద్యం ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంలో అమెరికాలోని దిగ్గజ ఐటీ కంపెనీలతోపాటు ఇతర కంపెనీలు భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దాంతో హెచ్1బీ వీసా మీద ఆ దేశం వెళ్లిన భారతీయులు వెనక్కి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికాలోనే కొనసాగాలంటే మరో కంపెనీల్లో ఉద్యోగం దక్కించుకోవాలి. అందుకు అవకాశాలు కూడా పెద్దగా లేకపోవడంతో భారతీయ వృత్తి నిపుణులు ఈబీ–5 వీసా కోసం దరఖాస్తులు చేస్తున్నారు. అందుకోసం ఆ దేశంలో పెట్టుబడులు పెట్టే కన్సల్టెన్సీలతో భాగస్వాములుగా మారుతున్నారు. ఎక్కువగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కన్సల్టెన్సీలు కనీసం 20 మందిని ఓ గ్రూప్‌గా ఏర్పరచి ఒక్కొక్కరి నుంచి 8 లక్షల అమెరికన్ డాలర్ల చొప్పున 16 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో రూ.131.39 కోట్ల) నిధిని సేకరిస్తున్నాయి. ఆ నిధులను వివిధ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ చేపడుతున్న రెంటల్ అపార్ట్మెంట్లు, భవనాలు, హోటళ్లు తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడిగా పెడుతున్నాయి. ఆ విధంగా పెట్టుబడి పెడుతున్న వారు ఆ వ్యాపారంలో క్రియాశీలకంగా ఉండటంగానీ ప్రత్యక్షంగా ఎవరికీ ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరంగానీ లేదు. వారు పాసివ్ పెట్టుబడిదారులుగా ఉంటారు. పెట్టిన పెట్టుబడిపై వారికి వడ్డీ లభిస్తుంది కూడా. దాంతోపాటు పెట్టుబడిదారు హోదా దక్కుతుంది. ఆ హోదాపై ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేసి పొందుతున్నారు. ఆ వీసాపై అమెరికాలో ఏ ప్రాంతంలోనైనా పనిచేసేందుకు వారికి అవకాశం దక్కుతుంది. ఈబీ–5 వీసా కింద ఐదుగురు కుటుంబ సభ్యులు అమెరికాలో నివసించేందుకు అవకాశముంది. పెరుగుతున్న ఈబీ–5 వీసాలు భారతీయులకు ఈబీ–5 వీసాల జారీ పెరుగుతోంది. 2019లో 756 మంది భారతీయులు ఈబీ–5 వీసాలు పొందగా.. 2022లో ఏకంగా 1,381 మందికి వీటిని జారీ చేయడం విశేషం. 2016తో పోలిస్తే ఈబీ–5 వీసాలు పొందిన భారతీయుల సంఖ్య 400 శాతం పెరిగింది. 2022లో అమెరికా మొత్తం 10,885 ఈబీ–5 వీసాలు జారీచేసింది. వాటిలో 1,381 వీసాలతో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో చైనా, మూడో స్థానంలో వియత్నాం ఉన్నాయి. ఇక 2023లో 14,200 ఈబీ–5 వీసాలు జారీచేయాలని యూఎస్సీఐఎస్ భావిస్తోంది. ఈబీ–5 వీసా అంటే.. అమెరికాలో గ్రీన్కార్డ్కు దాదాపు సమానమైన గుర్తింపు ఉన్నదే ఈబీ–5 వీసా. అంతటి ప్రాధాన్యమున్న ఈ వీసా పొందాలంటే వ్యక్తులు అమెరికాలో కనీసం 8 లక్షల అమెరికన్ డాలర్లను (భారతీయ కరెన్సీలో రూ.6.57 కోట్లు) పెట్టుబడిగా పెట్టడంతోపాటు కనీసం 10 ఉద్యోగాలను కల్పించాలి. దాంతో వారికి పెట్టుబడిదారుల హోదా కింద ఈబీ–5 వీసాను జారీచేస్తారు. ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేయాలంటే గతంలో 5 లక్షల అమెరికన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని నిబంధన ఉండేది. కానీ, ఈ వీసాల కోసం డిమాండ్ పెరుగుతుండడంతో యూఎస్సీఐఎస్ ఈ కనీస పెట్టుబడి మొత్తాన్ని 2022లో 8 లక్షల డాలర్లకు పెంచింది. -
ఇమ్మిగ్రేషన్ అలర్ట్: ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం
అమెరికాలో విదేశీ వ్యాపారులకుద్దేశించిన వీసాపై అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈబీ-5 గా పిలిచే ఈ వీసాలకు సంబంధించి కనీస పెట్టుబడిన 50 వేల డాలర్లను అమాంతం 90 వేల డాలర్లకు పెంచింది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 21కంటే ముందుగానే అమల్లోకి రానున్నాయి. దీంతో ఈబీ- 5 వీసాదారుల గ్రీన్ కార్డు కల చెదిరిపోనుంది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ప్రచురించిన కొత్త నియమం ప్రకారం ఈ మార్పులు నవంబర్ 1, 2019 నుండి అమల్లోకి వస్తాయి. అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే ఈబీ-5 వీసాలకు సంబంధించి విదేశీ పెట్టుబడిదారులకు పెట్టుబడి పరిమితి టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియ(ఏఈఏ)లో కనీసం 5 లక్షల డాలర్లు (సుమారు రూ.3.45 కోట్లు) గా ఉండేది. తాజా నిబంధనల ప్రకారం ఈ మొత్తాన్ని 9 లక్షల డాలర్లకు (సుమారు రూ.6.21 కోట్లు) పెంచారు. అలాగే ద్రవ్యోల్బణం ఆధారంగా నిర్ణయించే ప్రామాణిక కనీస పెట్టుబడుల పరిమితినీ 10 లక్షల డాలర్ల (రూ.6.9 కోట్లు) నుంచి 18లక్షల డాలర్లకు (రూ.12.42 కోట్లు) పెంచింది ట్రంప్ ప్రభుత్వం. ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలో పెట్టుబడి పెట్టే విదేశీయులకు గ్రీన్ కార్డ్ పొందటానికి, చట్టబద్ధమైన శాశ్వత నివాసితులుగా ఉండటానికి, చివరికి అమెరికా పౌరులుగా మారడానికి వీలు కల్పిస్తుంది. పెట్టుబడి పెట్టుబడిదారుడు శాశ్వతంగా జీవించడానికి గ్రీన్ కార్డుకు దారితీస్తుంది. దీనిద్వారా పెట్టుబడిదారుడు జీవిత భాగస్వామి, పెళ్లికాని పిల్లలతో యుఎస్‌లో ఉండొచ్చు. అమెకికా సిటిజెన్షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ దీన్నినిర్వహిస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులను సులభతరం చేయడానికి 1990 ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. అయితే నిబంధనలతో ఈ వీసాపై అగ్రరాజ్యంలో స్థిర పడాలనుకునే వారి కలలు కల్లలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేసింది ట్రంప్ సర్కార్. దీంతో ప్రధానంగా ఎక్కువ మంది భారతీయులకే ఇబ్బందిగా మారనుందని అంచనా. ఈ వీసాలకు భారతీయుల దరఖాస్తులు 10-15 శాతం తగ్గనుందని భావిస్తున్నారు. -
యూఎస్ రియల్టీలో భారతీయులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూఎస్ గ్రీన్‌కార్డ్ ఎందరో భారతీయుల కల. దాన్ని నెరవేర్చుకోవటానికి కొందరు సంపన్నులు ఈబీ–5 మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ మార్గంలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించడం ద్వారా యూఎస్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. పెట్టుబడిదారు, ఆయన భార్య, పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. సాధారణంగా గ్రీన్కార్డ్కు 15–20 ఏళ్లు పడుతుంది. ఈబీ–5 ద్వారా 18 నెలల్లోపే కండిషనల్ గ్రీన్‌కార్డ్ పొందవచ్చు. భారత్ నుంచి ఈబీ–5 దరఖాస్తుదారుల్లో 60% మంది రియల్టీలో పెట్టుబడికి ఆసక్తి కనబరుస్తున్నారని ‘కెన్ ఏమ్’ ఎంటర్ప్రైజెస్ ఇండియా, మిడిల్ ఈస్ట్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ లోహియా మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. న్యూయార్క్ కేంద్రంగా సేవలందిస్తున్న ‘కెన్ ఏమ్’ ఇమిగ్రేషన్ ఆధారిత పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. వీసా నిబంధనలతో..: ట్రంప్ అధ్యక్షుడయ్యాక వీసా, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినమయ్యాయని, ఈ మధ్య వీసాల రెన్యువల్స్ తిరస్కరణ పెరిగిందని, దీంతో ఈబీ–5 వీసాలకు డిమాండ్ పెరిగిందని అభినవ్ వెల్లడించారు. ‘ఎంట్రప్రెన్యూర్స్, టెకీల నుంచి ఈ దరఖాస్తులు పెరుగుతున్నాయి. యూఎస్‌లో ఉన్నవారికి ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేయటం చాలా సులువు. అయితే పెట్టుబడి మొత్తాన్ని 2018 సెప్టెంబరు నుంచి 9.25 లక్షలు లేదా 13 లక్షల డాలర్లు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారత్ నుంచి దరఖాస్తులు 80–90 శాతం తగ్గే అవకాశముంది. నిజానికి 5 లక్షల డాలర్లు చాలా తక్కువ. అదే ఆస్ట్రేలియాలో అయితే కనీసం 20 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టాలి’ అని ఆయన వివరించారు. ఈ ఏడాది 700 దరఖాస్తులు.. గతేడాది భారత్ నుంచి 500 దాకా ఈబీ–5 దరఖాస్తులొచ్చాయని, ఈ ఏడాది 700 దరఖాస్తులొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు అభినవ్ చెప్పారు. చైనా, వియత్నాం తర్వాత అత్యధిక అప్లికేషన్లు భారత్ నుంచే వస్తున్నట్లు చెప్పారాయన. ఇక కెన్ ఏమ్ 2016లో 50, 2017లో 97 దరఖాస్తులను స్వీకరించింది. ఈ ఏడాది ఇది 200 రావచ్చని భావిస్తోంది. హైదరాబాద్ నుంచి గత రెండేళ్లలో 10 అప్లికేషన్లను ప్రాసెస్ చేసింది. -
ట్రంప్ టార్గెట్ ‘ఈబీ–5’
వాషింగ్టన్: అమెరికాలో విదేశీయులకు గ్రీన్ కార్డు ఇచ్చే ‘ఈబీ–5 వీసా’ విధానాన్ని ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఈ వీసా నిబంధనల ప్రకారం అమెరికాలో 10లక్షల డాలర్లు (దాదాపు రూ.6.78 కోట్లు) పెట్టుబడి పెట్టే వారికి (దీని ద్వారా కనీసం 10 మంది శాశ్వత ఉద్యోగాల కల్పన జరుగుతుంది) ఆ దేశం గ్రీన్ కార్డులు అందిస్తోంది. అయితే ఈ వీసా విధానాన్ని పూర్తిగా సంస్కరించడం లేదా పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలని యూఎస్ కాంగ్రెస్‌ను ట్రంప్ సర్కారు కోరింది. ఈబీ–5 విధానం ద్వారా వచ్చిన గ్రీన్‌కార్డును సంపాదించిన వారు దీన్ని దుర్వినియోగం చేయడంతోపాటు మోసాలకు పాల్పడుతున్న కేసులు నమోదవుతున్న నేపథ్యంలోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది అమల్లోకి వస్తే.. ఈబీ–5 విధానంలో అమెరికాలో గ్రీన్ కార్డులు పొందుతున్న భారతీయులపైనా పెను ప్రభావం పడనుంది. ఈ జాబితాలో చైనా, వియత్నాంలు తొలి రెండు స్థానాల్లో ఉండగా.. భారత్ మూడో దేశంగా ఉంది. ఈ విధానంలో ఏటా10వేల వీసాలను విదేశీయులకు ఇస్తున్నారు. ఇందులో ఒక్కో దేశానికి గరిష్టంగా 7% పరిమితి ఉంటుంది. గతేడాది భారత్ నుంచి 500 ఈబీ–5 వీసా పిటిషన్లు దాఖలవగా.. ఈసారి ఈ సంఖ్య 700కు చేరవచ్చని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నమోదు చేసుకున్న వారి వీసా తిరస్కరణ రేటు గరిష్టంగా 20% మాత్రమే. ఇది కూడా సమర్పించే దస్తావేజులు, నిధుల విషయంలో సమస్యలతోనే. భారత్ నుంచి ఈ వీసాలు పొందేవారిలో చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కర్ణాటక నుంచే ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఉంటారు. అమెరికా ‘గూఢచర్య’ ఆరోపణ! అమెరికా సీనియర్ చట్టసభ్యులు కూడా ఈబీ–5 ఇన్వెస్టర్స్ వీసా కార్యక్రమాన్ని మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఈ వీసాల దుర్వినియోగం జరుగుతున్న ఘటనలను ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. ‘ఈబీ–5 విధానం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుంది. ’మనీలాండరింగ్, గూఢచర్యం చేసేందుకు కూడా కొందరు ఈ విధానాన్ని వినియోగించుకుంటున్నారు’ అని అమెరికా సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్నా ఇటీవలే.. కాంగ్రెస్ సభ్యుల విచారణలో వెల్లడించారు. 1990లో కేటగిరీ–5ను సృష్టించినపుడు.. ఉద్యోగ కల్పన, పెట్టుబడుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందనే కాంగ్రెస్ భావించింది. రెండేళ్ల తర్వాత నిరుద్యోగం పెరగడంతో రీజనల్ సెంటర్ ప్రోగ్రామ్‌ను అమల్లోకి తెచ్చి.. దీనికి ఈబీ–5 వీసా విధానాన్ని జోడించారు. చైనీయులే మోసగిస్తున్నారు! గత ఐదేళ్లలో ఈ వీసాల ద్వారా దేశ భద్రతను ప్రశ్నించేలా 19 కేసులు నమోదయ్యాయని సిస్నా తెలిపారు. ఈబీ–5 వీసాలను దుర్వినియోగం చేస్తున్న వారిలో ఎక్కువమంది చైనీయులే ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో 120 మంది చైనీయులు తప్పుడు విధానాల్లో పెట్టుబడులు పెట్టినట్లు అంగీకరించారని అమెరికా ఇమిగ్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఇలా వివిధ కేసులు బయటపడుతూ.. అమెరికా భద్రతకే సవాల్ విసురుతున్నందున ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు భావిస్తోంది. 350 గ్రాములకు మించి పౌడర్లు తేవొద్దు! అమెరికా వచ్చే ప్రయాణికులు 350 గ్రాములకు మించి బరువున్న పొడి పదార్థాలు విమానం కేబిన్‌లోకి తీసుకురాకుండా అమెరికా నిషేధం విధించింది. జూన్ 30 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అమెరికా రవాణా భద్రత పరిపాలన విభాగం (టీఎస్ఏ) పేర్కొంది. గతేడాది ఆస్ట్రేలియాలో ఓ గల్ఫ్ విమానంలో పౌడర్ ఎక్స్‌ప్లోజివ్స్ ద్వారా పేలుడు జరిపేందుకు విఫలయత్నం చేసిన నేపథ్యంలో టీఎస్ఏ ఈ నిర్ణయం తీసుకుంది. ‘350 గ్రాములకు మించి బరువున్న పొడి పదార్థాలను ఎక్స్‌రే స్క్రీనింగ్ చేయనున్నాం. అలాంటి పదార్థాలను చెకింగ్ బ్యాగుల్లో ఉంచితే అదనపు తనిఖీలు ఉండవు’ అని టీఎస్ఏ పేర్కొంది. పౌడర్ లాంటి పదార్థాలు తీసుకొస్తే అదనపు తనిఖీలుంటాయని, వాటిని చెకింగ్ బ్యాగుల్లో ఉంచడం ఉత్తమమని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. వైద్యం, పిల్లలకు సంబంధించిన పౌడర్లు, చితాభస్మం, సుంకం లేని పౌడర్లను వెంట తీసుకెళ్లొచ్చని తెలిపాయి. -
‘గోల్డెన్ వీసా’ గడువు పొడిగింపు
వాషింగ్టన్: విదేశీయులు అమెరికాలో స్థిరపడేందుకు అత్యంత సులభమైన మార్గంగా భావించే ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును డిసెంబర్ 22 వరకు పొడిగించారు. హెచ్–1బీ వీసా పొందటం కష్టతరమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం భారతీయులు సహా అనేక దేశాల ప్రజలు... గోల్డెన్ వీసాగా పేరుగాంచిన ఈబీ–5 వీసాకే దరఖాస్తు చేసుకుంటున్నారు. 1990లో అమెరికా కాంగ్రెస్ ఈబీ–5 వీసా విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అమెరికాలో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు కొన్ని చోట్ల లక్షిత ఉపాధి ప్రాంతాల (టీఈఏ–టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియాస్)ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో 5 లక్షల డాలర్ల పెట్టుబడి లేదా టీఈఏ కిందకు రాని ప్రాంతాల్లో 10 లక్షల డాలర్ల పెట్టుబడి పెట్టి కంపెనీలను స్థాపించి కనీసం పది మందికి ఉపాధి కల్పించగలిగిన విదేశీయులకు ఈ వీసాలు మంజూరుచేస్తారు. వీసాలు పొందిన వారికి తొలుత గ్రీన్ కార్డు ఇచ్చి ఆ తర్వాత చాలా తొందరగానే పౌరసత్వం కూడా ఇస్తారు. ఈ కేటగిరీ కింద వీసాకు దరఖాస్తు చేస్తున్న భారతీయుల్లో 74% మంది అభ్యర్థులు నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. మరికొందరు ఆతిథ్య రంగంపై ఆసక్తిగా ఉన్నారు. అమెరికా వర్సిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు కూడా భారీ సంఖ్యలోనే ఈబీ–5 వీసా కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. -
భారతీయులకు బెస్ట్ వీసా ఇదే
ఛండీఘర్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడ నివసిస్తున్న భారతీయుల్లో గుండెల్లో దడ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా కలలు కల్లలు కాకుండా ఉండటానికి భారతీయులకు బెస్ట్ వీసాగా ఈబీ-5 వీసా ఉన్నట్టు అమెరికా ఇమ్మిగ్రేషన్ లాయర్ చెప్పారు. అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలనుకునేవారికి ఇది ఓ ఆశాకిరణంగా పేర్కొన్నారు. ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన అమెరికా ఇన్వెస్ట్ మెంట్ ఇమ్మిగ్రేషన్ అటార్ని వాఘన్ డీ కిర్బీ, తమ సంస్థ విజయవంతంగా 1,300 ఈబీ-5 అప్లికెంట్లను కలిగి ఉందని చెప్పారు. ఈ ప్రోగ్రాం ద్వారా అమెరికాలో పెట్టుబడులు పెడితే చాలు సదరు వ్యక్తి, అతని కుటుంబంతో సహా జీవితకాలం అమెరికాలోనే ఉండొచ్చని తెలిపారు. అయితే వారి పిల్లల వయసు 21 ఏళ్ల కంటే తక్కువగా ఉండాలి. కాగ, ఈబీ-5 ఇన్వెస్ట్ మెంట్ వీసా ప్రొగ్రామ్ గడువు 2017 సెప్టెంబర్ 30తో ముగుస్తోంది. అయితే ఈబీ-5 ఇన్వెస్ట్ మెంట్ వీసా ప్రొగ్రామ్ కింద అప్లికెంట్ అమెరికాలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడైతేనే గ్రీన్ కార్డు పొందుతారు. అదేవిధంగా శాశ్వత గ్రీన్ కార్డు పొందిన తర్వాత కూడా 10మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించగలగాలి. భారతీయులకు ఈ వీసా కేటగిరీ ప్రాసెసింగ్ సమయం కేవలం 18నెలలే పడుతుందని కిర్బీ చెప్పారు. గత కొంతకాలంగా ట్రావెల్ నిషేధం, హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు, విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిపై ఆంక్షలు ఈబీ-5 వీసా దరఖాస్తులపై మరలుస్తోంది. అమెరికాలో స్వేచ్ఛగా ప్రయాణించడానికి, పనిచేయడానికి, ఈబీ-5 వీసానే సరియైనది కిర్బీ తెలిపారు.