
దొంగ ప్రేమికులకు, అడ్డదారి భర్తలకు ఇలా చెక్ పెట్టొచ్చు
లండన్: మీ భర్త మీకు అన్యాయం చేస్తున్నారని అనుమానమా..? సీక్రెట్‌గా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని డౌటా..? అయితే వెంటనే ‘ఎంకపుల్’ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి.. దీనితో మీ భర్తకు సంబంధించిన డిజిటల్ సమాచారం మొత్తం సులువుగా తెలుసుకోవచ్చు. లండన్‌కు చెందిన ‘ఎంస్పై’ అనే సంస్థ ఈ యాప్‌ను రూపొందించింది. దీని ద్వారా మీ భాగస్వామికి వచ్చే ప్రతి కాల్, మెసేజ్, ఈ-మెయిల్ సమాచారం మీకు అందుతుంది. స్కైప్, ఫేస్‌బుక్ ఉపయోగించి చాటింగ్ చేసినా ఇట్టే పట్టేస్తుంది.
అలాగే మీ భాగస్వామి స్మార్ట్‌ఫోన్‌లో తీసి ఫేస్‌బుక్, స్కైప్‌లో పోస్ట్ చేసిన లేదా షేర్ చేసిన వీడియోలు, ఫొటోలు కూడా మీకు అందిస్తుంది. అంతేనా మీ భాగస్వామి ఫోన్ సంభాషణలను రికార్డ్ చేసే సౌకర్యం కూడా ఇది మీకు కల్పిస్తుంది. అలాగే జీపీఎస్ ద్వారా వారి కదలికలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అయితే మీ భాగస్వామి అనుమతి ఉంటేనే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం సాధ్యపడుతుంది. ప్రస్తుతం ఈ సంస్థ పిల్లల కదలికలపై నిఘా పెట్టే తల్లిదండ్రులు, ఆఫీసుల్లో సిబ్బంది పనితీరుపై కన్నేసే కంపెనీలను లక్ష్యంగా చేసుకుంది. అయితే ఈ యాప్‌తో ప్రేమ పేరుతో చేసే చీటింగ్‌లకు చెక్ పెట్టొచ్చని ఎంస్పై వర్గాలు నమ్మకంగా చెపుతున్నాయి.