ఇంటింటికీ గాలిమర!
విద్యుత్ కోతల బాధ లేకుండా.. అతితక్కువ ఖర్చుతోనే ఇంటికి కావాల్సినంత విద్యుత్‌ను మీరే ఉత్పత్తి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సరికొత్త గాలిమర వచ్చేసింది. నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యామ్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ది ఆర్కిమెడీస్’ అనే సంస్థ ఇటీవలే దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది.
‘లియాం మినీ ఎఫ్1’ అని పిలుస్తున్న ఈ గాలి మర అతితక్కువ గాలి వేగం (సెకనుకు 2-5 మీటర్లు)తోనూ పనిచేస్తుంది. శంఖు ఆకారపు టర్బైన్ డిజైన్ దీనికి దోహదపడుతుంది. గాలివేగాన్నిబట్టి ఇది ఏడాదికి 300 నుంచి 1,500 కిలోవాట్/గంటల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ చెబుతోంది.