Rotterdam
-
హాకీలో భారత్ మహిళల సంచలనం
రోటర్‌డామ్ (నెదర్లాండ్స్): ప్రొ హాకీ మహిళల లీగ్‌లో భారత జట్టు సంచలనం సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత అర్జెంటీనా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ‘షూటౌట్’లో 2–1తో గెలిచింది. ‘షూటౌట్’లో భారత్ తరఫున నేహా గోయల్, సోనిక స్కోరు చేశారు. షర్మిలా దేవి, మోనిక విఫలమయ్యారు. అర్జెంటీనా క్రీడాకారిణుల ఐదు షాట్లలో భారత గోల్‌కీపర్, కెప్టెన్ సవితా పూనియా నాలుగింటిని నిలువరించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు రెగ్యులర్ సమయం ముగిసేసరికి రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ రెండు గోల్స్, లాల్రెమ్సియామి ఒక గోల్ చేశారు. అర్జెంటీనా తరఫున అగస్టీనా మూడు గోల్స్‌తో హ్యాట్రిక్ సాధించింది. ఫలితం తేలడానికి ‘షూటౌట్’ నిర్వహించగా భారత్ పైచేయి సాధించింది. ఇదే వేదికపై జరిగిన పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు 1–4తో ‘షూటౌట్’లో నెదర్లాండ్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. -
బోపన్న జంట ఓటమి
న్యూఢిల్లీ: రోటర్‌డామ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట పోరాటం ముగిసింది. నెదర్లాండ్స్‌లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 7–5, 2–6, 8–10తో ‘సూపర్ టైబ్రేక్’లో హెన్రీ కొంటినెన్ (ఫిన్లాండ్)–జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట ఏడు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. సెమీస్‌లో ఓడిన బోపన్న జోడీకి 180 ర్యాంకింగ్ పాయింట్లతోపాటు 32,080 యూరోలు (రూ. 24 లక్షల 85 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
ఇంటింటికీ గాలిమర!
విద్యుత్ కోతల బాధ లేకుండా.. అతితక్కువ ఖర్చుతోనే ఇంటికి కావాల్సినంత విద్యుత్‌ను మీరే ఉత్పత్తి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సరికొత్త గాలిమర వచ్చేసింది. నెదర్లాండ్స్‌లోని రోటర్డ్యామ్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ది ఆర్కిమెడీస్’ అనే సంస్థ ఇటీవలే దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. ‘లియాం మినీ ఎఫ్1’ అని పిలుస్తున్న ఈ గాలి మర అతితక్కువ గాలి వేగం (సెకనుకు 2-5 మీటర్లు)తోనూ పనిచేస్తుంది. శంఖు ఆకారపు టర్బైన్ డిజైన్ దీనికి దోహదపడుతుంది. గాలివేగాన్నిబట్టి ఇది ఏడాదికి 300 నుంచి 1,500 కిలోవాట్/గంటల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ చెబుతోంది.