ట్రాన్స్పోర్ట్ బిజినెస్లోకి ఎంటరైన ఫేస్బుక్! | Facebook enters transport business with Uber | Sakshi
Sakshi News home page

ట్రాన్స్పోర్ట్ బిజినెస్లోకి ఎంటరైన ఫేస్బుక్!

Published Thu, Dec 17 2015 3:28 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ట్రాన్స్పోర్ట్ బిజినెస్లోకి ఎంటరైన ఫేస్బుక్! - Sakshi

ట్రాన్స్పోర్ట్ బిజినెస్లోకి ఎంటరైన ఫేస్బుక్!

వాషింగ్టన్: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లోకి ఎంటరైంది. ఈ మేరకు ఫేస్బుక్ సంస్థ 'ఉబర్'తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఫేస్బుక్ వినియోగదారులు తమ ఫేస్బుక్ అకౌంట్ నుండే నేరుగా క్యాబ్ను బుక్ చేసుకునే వీలు ఉంటుంది.

అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఫేస్బుక్ ద్వారా తమ ట్రాన్స్పోర్ట్ సేవలు ఈ వారంలో అందుబాటులోకి రానున్నాయని ఉబర్ ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు ఉబర్ యాప్ను ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే తమ ఫేస్బుక్ అకౌంట్ నుండి నేరుగా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త విధానం ప్రారంభం సందర్భంగా..మొదటి సారి ఈ సదుపాయాన్ని వినియోగించుకొనే వినియోగదారులకు ఫ్రీ రైడ్ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది.

ఈ విధానాన్ని త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని ఫేస్బుక్ భావిస్తోంది. ఉబర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఉబర్తో పాటు ఇతర కంపెనీలతో సైతం ఈ తరహా ఒప్పందాలను కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement