
‘లిటిల్ బ్లాక్ డ్రెస్’ తో ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త ఒరవడిని సృష్టించిన ప్రముఖ ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ హుబెర్ట్ డి గివెన్చీ(91) శనివారం పారిస్‌లో కన్నుమూశారు. 1950వ దశకంలో క్వీన్ ఎలిజబెత్‌తో పాటు, పలువురు చైనీస్ సోషలైట్స్‌కు డ్రెస్ డిజైనింగ్ చేయటం ద్వారా ప్రఖ్యాతిగాంచారు. అమెరికా మాజీ మొదటి మహిళ జాక్వలిన్ కెన్నెడీ దుస్తులను డిజైన్ చేసేందుకు హుబెర్ట్‌ను డిజైనర్‌గా నియమించుకున్నారు. తన అధికార పర్యటనల్లో భాగంగా ఆమె ఎల్లప్పుడూ హుబెర్ట్ డిజైన్ చేసిన దుస్తులనే ధరించేవారు. ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచిన హుబెర్ట్ మరణించారని ఆయన భాగస్వామి ఫిలిప్ వెనెట్ తెలిపారు.






Comments
Please login to add a commentAdd a comment