ఘోర అగ్ని ప్రమాదం.. 70 మంది మృతి | Fire Accident In Bangladesh At Least 56 Dead | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 70 మంది మృతి

Published Thu, Feb 21 2019 7:56 AM | Last Updated on Thu, Feb 21 2019 12:45 PM

Fire Accident In Bangladesh At Least 56 Dead - Sakshi

ఢాకా : బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు 70 మంది సజీవ దహనం కాగా... మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలు... ఢాకాలోని చాక్‌బజార్‌లోని ఓ అపార్టుమెంటులో గురువారం గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. అయితే అదే అపార్టుమెంటులో ఓ కెమికల్‌ వేర్‌హౌజ్‌ కూడా ఉండటంతో చుట్టూ ఉన్న భవనాలకు కూడా మంటలు అంటుకున్నాయి.

కాగా ఈ ఘటనలో సుమారు 70 మంది మరణించారని, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బంగ్లాదేశ్‌ ఫైర్‌ సర్వీస్‌ చీఫ్‌ అలీ అహ్మద్‌ తెలిపారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గతంలో కూడా ఢాకాలో ఇలాంటి ఘెర అగ్ని ప్రమాదం సంభవించింది. 2010లో జరిగిన ఈ ఘటనలో సుమారు 120 మంది మృతి చెందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement