పెషావర్: పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడికి గురైన ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఏపీఎస్) సోమవారం పునఃప్రారంభమైంది. స్కూల్ విద్యార్థులు కళ్ల ముందే జరిగిన దారుణ మారణహోమాన్ని నెమ్మదిగా మరవడానికి ప్రయత్నిస్తూ మళ్లీ స్కూల్ బాట పట్టారు. కిందటేడాది డిసెంబర్ 16న తాలిబాన్ మిలిటెంట్లు ఏపీఎస్‌పై దాడి చేసి 134 మంది విద్యార్థులతో సహా 150 మందిని దారుణంగా చంపిన సంగతి తెలిసిం దే. అన్ని స్కూళ్లలో భద్రతా ఏర్పాట్లు చేసేందుకు వీలుగా పాక్ ప్రభుత్వం శీతాకాల విరామాన్ని పన్నెండు రోజులు పొడిగించింది. సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, స్కూల్ ప్రహరీల ఎత్తు పెంపు తదితర రక్షణ చర్యలు చేపట్టిన స్కూళ్లకే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (ఎన్‌వోసీ) జారీ చేసింది.
గాయాన్ని మరచి మళ్లీ స్కూల్‌కి...
Published Tue, Jan 13 2015 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM
Advertisement