Army public school
-
హైదరాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో వేడుకలు
-
ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురంలో టీచర్ పోస్టులు
సికింద్రాబాద్‌లోని ఆర్కే పురం ఆర్మీ పబ్లిక్ స్కూల్(ఏపీఎస్).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ సబ్జెక్టుల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 21 ► పోస్టుల వివరాలు: పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)–06, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)–05, ప్రైమరీ టీచర్లు(పీఆర్టీ)–10. ► పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ): సబ్జెక్టులు: సైకాలజీ, కామర్స్, జాగ్రఫీ, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్. అర్హత: కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ ఉండాలి. సీబీఎస్ఈ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు బోధించిన అనుభవం ఉండాలి. ► ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ): సబ్జెక్టులు–ఖాళీలు: ఇంగ్లిష్–01, హిందీ–02, సోషల్ సైన్స్–02. అర్హత: కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరోతరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధించిన అనుభవం ఉండాలి. ► ప్రైమరీ టీచర్స్(పీఆర్టీ): అర్హత: కనీసం 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ/డీఈడీ చేసి ఉండాలి. ప్రైమరీ తరగతుల విద్యార్థులకు బోధించే నైపుణ్యం ఉండాలి. ► వయసు: ఫ్రెష్ అభ్యర్థులకు ఐదేళ్ల అనుభవంతో 40 ఏళ్లు మించకుండా చూసుకోవాలి. అనుభవమున్న వారికి ఐదేళ్ల అనుభవంతో 57 ఏళ్లు మించకుండా ఉండాలి. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం ఫ్లైఓవర్, సికింద్రాబాద్ చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 10.06.2021 ► వెబ్సైట్: https://www.apsrkpuram.edu.in/ మరిన్ని నోటిఫికేషన్లు: ఎయిమ్స్, భువనేశ్వర్‌లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు తిరుపతి ఎస్వీవీయూలో ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీలు -
బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగాలు
సికింద్రాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ, రక్షణ విభాగానికి చెందిన బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్(ఏపీఎస్).. టీచర్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 33 ► పోస్టుల వివరాలు: పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, కంప్యూటర్ సైన్స్ టీచర్లు, లైబ్రేరియన్ తదితరాలు. ► విభాగాలు: హిస్టరీ, సైన్స్, జాగ్రఫీ, ఎకనామిక్స్, సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లిష్, హిందీ, సోషల్ సైన్స్ తదితరాలు. ► పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీ): అర్హతలు: సంబంధిత విభాగాన్ని అనుసరించి 50శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు. ► ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ): అర్హతలు: సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు. ► ప్రైమరీ టీచర్లు(పీఆర్టీ): అర్హతలు: సంబంధిత విభాగంలో 50శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: ఫ్రెషర్స్ అభ్యర్థులు 40 ఏళ్లు మించకూడదు. అనుభవం ఉన్నవారు 57 ఏళ్లు మించకూడదు. ► లైబ్రేరియన్: అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ(లైబ్రరీ సైన్స్)/డిప్లొమా(లైబ్రరీ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి. ► సెక్యూరిటీ సూపర్వైజర్: అర్హతలు: ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం ఉండాలి. 55ఏళ్లు నిండిన ఎక్స్సర్వీస్మెన్లకు ప్రాధాన్యం ఇస్తారు. ► కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్: అర్హతలు: ఇంటర్మీడియట్, డిప్లొమా(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్ స్కూల్, బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్–500087 చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 05.06.2021 ► వెబ్సైట్: http://www.apsbolarum.edu.in/index.html మరిన్ని నోటిఫికేషన్లు: టీటీడబ్ల్యూఆర్‌డీసీఎస్‌లో పార్ట్‌టైం టీచింగ్ పోస్టులు డీఎస్ఎస్ఎస్బీలో 7236 ఉద్యోగాలు -
ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త
హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వేలాది విద్యార్థులకు ఇదో శుభవార్త. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ కింద దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8 వేల మంది ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కంటోన్మెంట్ ఏరియాలు, మిలటరీ స్టేషన్లలో నడుస్తున్న మొత్తం 137 ఆర్మీ పబ్లిక్ స్కూళ్ల (ఏపీఎస్) లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను ఆన్ లైన్ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆన్ లైన్ లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. వచ్చే నవంబర్ నెల 26, 27 తేదీల్లో ఈ ఆన్ లైన్ పరీక్ష నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వచ్చిన దరఖాస్తులను బట్టి ఏవైనా మార్పు చేర్పులు చేయాల్సి వస్తే పరీక్షను నవంబర్ లో చివరి ఆదివారం లేదా డిసెంబర్ లో వచ్చే మొదటి ఆదివారం రోజున స్క్రీనింగ్ టెస్టు నిర్వహించడానికి ఆవకాశాలున్నాయి. ఇందులో అర్హత సాధించిన వారికి స్కోర్ కార్డులు జారీ చేస్తారు. డిసెంబర్ 15 న ఫలితాలను వెల్లడిస్తారు. అభ్యర్థులు http://aps-csb.in పోర్టల్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. స్కోర్ కార్డు ఆధారంగా తదుపరి దశల్లో నిర్వహించే పరీక్షకు అర్హత సాధిస్తారు. ఆ స్కోర్ కార్డులు మూడేళ్ల పాటు పనికొస్తుంది. స్కోర్ కార్డు వచ్చిన తర్వాత రెండో దశలో ఇంటర్వ్యూ ఉంటుంది. మూడో దశలో ఆయా సబ్జెక్టుల్లో స్కిల్స్ ను పరిశీలించడానికి ఎస్సే, కాంప్రిహెన్షన్ లపై రాత పరీక్ష నిర్వహిస్తారు. సెప్టెంబర్ 13 లోగా ఆన్ లైన్ లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధానంగా పీజీటీ, టీజీటీ, పీఆర్ టీ ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక కోసం ఈ ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తున్నారు. పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఎడ్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే టీజీటీ, పీఆర్టీ పోస్టులకు డిగ్రీతో పాటు బీఎడ్ తప్పనిసరిగా ఉండాలి. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు సంబంధించి ఇంగ్లీషు, హిందీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్, సైకాలజీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేటిక్స్, హోం సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి. టీజీటీ పోస్టులు ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నట్టు నోటిఫికేషన్ లో తెలియజేసారు. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు, బీఏడ్ లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. 1 ఏప్రిల్ 2017 నాటికి 40 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇకపోతే, టీజీటీ, పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీటెట్, లేదా ఆయా రాష్ట్రాలు నిర్వహించిన టెట్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాంటి వారిని రెగ్యులర్ ప్రాతిపదిక నియమిస్తారు. ఆ అర్హతలు లేని అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఎంపికైతే అలాంటి అభ్యర్థులను హడ్ హక్ ప్రాతిపదికన నియమిస్తారు. రెగ్యులరైజేషన్ కోసం ఆ తర్వాత దశలో టెట్ అర్హత సాధించాల్సి ఉంటుంది. పీజీటీ, టీజీటీ కోసం పార్ట్ ఏ, పార్ట్ బీ పేరుతో ఆన్ లైన్ లో రెండు పరీక్షలు ఉంటాయి. పార్ట్ ఏ లో జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, కాంప్రిహెన్షన్, ఎడ్యుకేషనల్ కాంసెప్ట్స్, మెథడాలజీ ఉంటాయి. పార్ట్ బీ లో సంబంధిత సబ్జెక్టులపై ప్రశ్నలుంటాయి. ఒక్కో పార్ట్ లో పరీక్ష 3 గంటల పాటు ఉంటుంది. ఒక్కో పార్టులో 90 మార్కుల చొప్పున మొత్తం 180 మార్కులకు నిర్వహిస్తారు. పీఆర్టీలకు మాత్రం పార్ట్ ఏ మాత్రమే ఉంటుంది. అర్హత సాధించడానికి అభ్యర్థి ప్రతి పార్ట్ లో కనీసం 50శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు www.awesindia.com. చూసుకోవచ్చు. -
పెషావర్ దాడి ముష్కరుల ఉరితీత
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పెషావర్ ఆర్మీ స్కూలు ఉగ్రదాడి ఘటనలో నలుగురు ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం ఉరితీసింది. కోహత్ జిల్లాలోని కారాగారంలో బుధవారం వీరికి ఈ శిక్ష అమలైంది. పెనువిషాదాన్ని నింపిన ఈ దారుణ మారణకాండలో అబ్దుల్ సలాం, హజ్రత్ అలీ, ముజీబ్ ఉర్ రెహమాన్, అలియాస్ నజీబ్ ఉల్లా, సబీల్లను దోషులుగా నిర్ధారించారు. ఈ నలుగురు ఉగ్రవాదులు తెహాద్వాల్ జిహాద్ గ్రూపు చెందినవారని గుర్తించింది. దీనికి సంబంధించిన పత్రాలపై సైనిక ప్రధానాధికారి జనరల్ రషీల్ షరీప్ సోమవారం సంతకం చేశారు. మరోవైపు ఈ ఘటన జరిగి సంవత్సరం కావస్తున్న సందర్భంగా, ఈ ఘటనలో అసువులు బాసిన చిన్నారులకు నివాళులర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దోషులు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను దేశ అధ్యక్షుడు హుస్సేన్ ఆగస్టులో తిరస్కరించారు. వీరిపై వివిధ అభియోగాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం దోషులుగా తేల్చడంతో కోర్టు వారికి ఉరిశిక్షను ఖరారు చేసింది. గత ఏడాది డిసెంబర్ 16 న పెషావర్‌లోని ఓ ఆర్మీ స్కూలుపై దాడిచేసిన ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. పాక్ స్కూల్లో సైనికదుస్తుల్లో ప్రవేశించిన ముష్కరులు నేరుగా పిల్లలపై కాల్పులకు తెగబడ్డారు. పిల్లల్లో పెద్దవాళ్లని ఏరి మరీ కాల్చిచంపారు. ఈ ఘటనలో 150 మంది బలైన సంగతి తెలిసిందే. -
గాయాన్ని మరచి మళ్లీ స్కూల్‌కి...
పెషావర్: పాకిస్తాన్లో ఉగ్రవాద దాడికి గురైన ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఏపీఎస్) సోమవారం పునఃప్రారంభమైంది. స్కూల్ విద్యార్థులు కళ్ల ముందే జరిగిన దారుణ మారణహోమాన్ని నెమ్మదిగా మరవడానికి ప్రయత్నిస్తూ మళ్లీ స్కూల్ బాట పట్టారు. కిందటేడాది డిసెంబర్ 16న తాలిబాన్ మిలిటెంట్లు ఏపీఎస్‌పై దాడి చేసి 134 మంది విద్యార్థులతో సహా 150 మందిని దారుణంగా చంపిన సంగతి తెలిసిం దే. అన్ని స్కూళ్లలో భద్రతా ఏర్పాట్లు చేసేందుకు వీలుగా పాక్ ప్రభుత్వం శీతాకాల విరామాన్ని పన్నెండు రోజులు పొడిగించింది. సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, స్కూల్ ప్రహరీల ఎత్తు పెంపు తదితర రక్షణ చర్యలు చేపట్టిన స్కూళ్లకే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (ఎన్వోసీ) జారీ చేసింది. -
విజేత ఆర్మీ పబ్లిక్ స్కూల్
నేరేడ్మెట్, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో రామకృష్ణాపురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ విజేతగా నిలిచింది. సైనిక్‌పురిలోని భవాన్స్ శ్రీరామ కృష్ణా విద్యాలయంలో శనివారం జరిగిన ఫైనల్లో 2-1 స్కోరుతో భవాన్స్ స్కూల్‌పై నెగ్గింది. భారత జట్టు స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ముఖ్య అతిథిగా హాజరై విజేతకు మెమెంటోను అందించాడు. తాను ఇదే పాఠశాలలో చదువుకున్నానని, చదువుతో పాటు క్రీడలకు కూడా పాఠశాల యాజమాన్యం అధిక ప్రాధాన్యమివ్వడం వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నట్టు ఓజా చెప్పాడు. -
23 పట్టణాల్లో జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్ష
ఈసారి హైదరాబాద్‌లో కేవలం ఆఫ్‌లైన్ పరీక్ష మాత్రమే సాక్షి, హైదరాబాద్: జేఈఈ-మెయిన్స్ 2014 పరీక్ష ను ఈసారి రాష్ట్రంలోని 23 పట్టణాల్లో ఆన్లైన్లో రాసే సౌలభ్యం కల్పించారు. జేఈఈ-మెయిన్ 2013 పరీక్ష సందర్భంగా తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఆన్లైన్ పరీక్ష కోసం సీబీఎస్ఈ అనేక పట్టణాలను ఎంపిక చేసింది. మన రాష్ట్రంలో అనంతపురం, బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, కడప, కాకినాడ, కంచకర్ల, కరీంనగర్, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం పట్టణాల్లో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. వరంగల్, ఖమ్మం, తిరుపతి, గుంటూరులతో పాటు హైదరాబాద్‌లో ఆఫ్‌లైన్ పరీక్ష రాసేందుకు కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. అయితే హైదరాబాద్‌లో గతంలో ఉన్న రీతిలో ఆన్లైన్లో పరీక్ష రాసేందుకు ఇప్పుడు అవకాశం లేకుండాపోయింది. సహాయక కేంద్రాల ఏర్పాటు: ఏప్రిల్ 6న ఆఫ్‌లైన్‌లో, ఏప్రిల్ 9, 11, 12, 19 తేదీల్లో ఆన్లైన్ విధానంలో జరగనున్న జేఈఈ-మెయిన్-2014 పరీక్షకు ఈ నెల 15న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వీటిని ఆన్లైన్లో డిసెంబర్ 26 వరకు మాత్రమే స్వీకరిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తులు నింపే ప్రక్రియలో సహకరించేందుకు రాష్ట్రంలో 15 సహాయక కేంద్రాలను ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్, హిమాయత్‌నగర్‌లోని హోవర్డ్ పబ్లిక్ స్కూల్, సికింద్రాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, విజయవాడలోని వీపీ సిద్దార్థ పబ్లిక్ స్కూల్, ఎన్.సెయింట్ మాథ్యూస్ పబ్లిక్ స్కూల్, గుంటూరులోని శ్రీవెంకటేశ్వర బాలకుటీర్, తిరుపతిలో కేంద్రీయ విద్యాలయం నంబరు 1, భారతీయ విద్యాభవన్, అనంతపురంలో శ్రీసత్యసాయి స్కూల్, వరంగల్‌లో వరంగల్ పబ్లిక్ స్కూల్, విశాఖలో వికాస్ విద్యానికేతన్, రామనాథ్ సెకండరీ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఖమ్మంలో హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో ఈ సహాయక కేంద్రాలను ఏర్పాటుచేశారు.