ఇండియాపై ముషార్రఫ్కు కన్నుకుట్టింది! | Former Pak President Musharraf blames India for Torkham clash | Sakshi
Sakshi News home page

ఇండియాపై ముషార్రఫ్కు కన్నుకుట్టింది!

Published Thu, Jun 16 2016 7:24 PM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

ఇండియాపై ముషార్రఫ్కు కన్నుకుట్టింది!

ఇండియాపై ముషార్రఫ్కు కన్నుకుట్టింది!

ఇస్లామాబాద్: భారత్-అప్ఘనిస్థాన్ సంబంధాలు చూసి పాకిస్థాన్కు కన్నుకుట్టింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ భారత్పై తన అక్కసు వెళ్లగక్కాడు. భారత్ చెప్పినట్లల్లా అప్ఘనిస్థాన్ ఆడుతోందని, అలా చేయకూడదని అన్నారు. భారత్ స్వార్థంతో చేసే పనులకు అప్ఘనిస్థాన్ ఆకర్షణకు లోనై పాకిస్థాన్కు శత్రువుగా మారొద్దంటూ వ్యాఖ్యానించాడు. అప్ఘనిస్థాన్ కు భారత్ వ్యత్యాసం ఉందని, కానీ పాకిస్థాన్తో పోలీస్తే మాత్రం చాలా దగ్గర అనుబంధం ఉంటుందనే విషయం తెలుసుకోవాలని అన్నారు.

పాకిస్థాన్-అప్ఘనిస్థాన్ సరిహద్దులోని తోర్కామ్ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకొని ఓ పాకిస్థాన్ సీనియర్ ఆర్మీ అధికారి చనిపోయాడు. ఈ ఘటనపై స్పందించిన ముషార్రఫ్.. భారత్ ను తప్పుబట్టారు. విలువలు, జాతి, భాష, మతంవంటి విషయాల్లో చాలా దగ్గర సంబంధాలు తామిద్దరికి(అప్ఘనిస్థాన్-పాకిస్థాన్) ఉంటాయని, భారత్ చెప్పినట్లు చేస్తూ ఆ దేశం తప్పు చేస్తోందంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. పాకిస్థాన్కు అప్ఘనిస్థాన్ వ్యతిరేకంగా మార్చడమే ధ్యేయంలాగా కనిపిస్తోందంటూ ఆయన వ్యాఖ్యానించాడు. ఓ పత్రికకు, ఆన్ లైన్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement