జెట్ నౌకలో ఎగిరిపోదామా..! | Future Megayachts May Cruise Skies and Seas | Sakshi
Sakshi News home page

జెట్ నౌకలో ఎగిరిపోదామా..!

Published Sun, May 31 2015 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

జెట్ నౌకలో ఎగిరిపోదామా..!

జెట్ నౌకలో ఎగిరిపోదామా..!

ఇది భవిష్యత్తులో రూపుదిద్దుకోబోయే విలాసవంతమైన నౌక. దీని ప్రత్యేకత ఏమిటంటే.. మనం కావాలనుకున్నప్పుడు దీని పై డెక్ ఓ జెట్ విమానంలా మారిపోతుంది. రెక్కల్లో ఏర్పాటుచేసిన రోటార్ల వల్ల ఇది నిట్టనిలువుగా టేకాఫ్ తీసుకుంటుంది. అనంతరం ఇందులోని జెట్ ఇంజిన్లు వాయువేగంతో ముందుకు దూసుకుపోతుంది. రష్యాకు చెందిన వాస్లిన్ క్లుయ్‌కిన్ అనే డిజైనర్ ఈ డిజైన్ రూపొందించాడు. మొనాకో-2050గా నామకరణం చేసిన ఈ జెట్ నౌక.. 2050లో ఎగిరే అవకాశం ఉందని అతడు చెబుతున్నాడు. ఎంతటి వ్యయప్రయాసలకోర్చి అయినా సరే ఈ నౌకను తయారుచేస్తానని పేర్కొన్నాడు.
 

Advertisement

పోల్

Advertisement