కునుకు పట్టట్లేదా..!
సీఆర్‌వై 1 అనే జన్యువులో తేడా ఉండటం వల్ల నిద్ర తొందరగా పట్టదని, నిద్రకు ఉపకరించే హార్మోన్ మెలటోనిన్ కూడా చాలా ఆలస్యంగా ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. సీఆర్‌వై1 జన్యువు క్లాక్, బీఎంఏఆర్ వంటి ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుందని.. ఈ ప్రొటీన్లు మరిన్ని జన్యువులు పనిచేసేందుకు కారణమవుతాయని వివరించారు. ఈ జన్యువులో తేడా కారణంగా ఈ రెండు ప్రొటీన్లు ఉత్పత్తి కావని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో పనిచేసే ఇద్దరు వ్యక్తుల్లో జన్యుమార్పులు ఉన్నప్పటికీ వారికి ఏ విధమైన నిద్ర సమస్యల్లేవని తెలిసింది. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చని అలీనా అంచనా వేస్తున్నారు.