Rockefeller University
-
కార్పొరేట్లకు ‘హిండెన్‌బర్గ్’ తరహా షాక్!
న్యూఢిల్లీ: కొద్ది నెలల క్రితం పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్‌ను కుదిపేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తరహాలో మరో సంస్థ దేశీ కార్పొరేట్ గ్రూప్‌ల అవకతవకలను బయటపెట్టేందుకు సిద్ధమవుతోంది. రాక్‌ఫెలర్ బ్రదర్స్ ఫండ్, జార్జ్ సొరోస్ వంటి దిగ్గజాల దన్ను గల ఓసీసీఆర్పీ (ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోరి్టంగ్ ప్రాజెక్టు) సన్నద్ధమవుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. యూరప్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వ్యాప్తంగా ఉన్న 24 లాభాపేక్షరహిత ఇన్వెస్టిగేటివ్ సంస్థలు కలిసి ఈ పరిశోధనాత్మక రిపోరి్టంగ్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసినట్లు వివరించాయి. అవి త్వరలోనే ఏదైనా నివేదిక లేదా వరుస కథనాలను ప్రచురించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. ముందుగా ఒక నిర్దిష్ట కార్పొరేట్ కంపెనీలో విదేశీ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించిన అవకతవకలను బయటపెట్టవచ్చని సంబంధిత వర్గాలు వివరించాయి. అయితే సదరు కార్పొరేట్ సంస్థ పేరును మాత్రం వెల్లడించలేదు. 2006లో ఏర్పాటైన ఓసీసీఆర్పీ వెబ్సైట్ ప్రకారం సంఘటిత నేరాలను శోధించడం సంస్థ ప్రత్యేకత. ఇన్వెస్టర్ జార్జ్ సొరోస్‌కి చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్, ఫోర్డ్ ఫౌండేషన్, ఓక్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ మొదలైనవి దీనికి నిధులు సమకూరుస్తున్నాయి. -
‘వెలుగు’తోంది ఇండియా!
సాక్షి, అమరావతి: మన దేశంలో 1996 నాటికి కేవలం 7 కోట్ల విద్యుత్ సర్వీసులుండేవి. ఇప్పుడు దాదాపు 26 కోట్ల సర్వీసులతో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద విద్యుత్ వినియోగదారులున్న దేశంగా అవతరించింది. వీటిలో 41 శాతం పరిశ్రమలు, 26 శాతం గృహావసరాలకు వినియోగిన్నారు. కేవలం ఈ లెక్కలే కాదు.. విద్యుత్ రంగంపై జరుగుతున్న అధ్యయనాలు సైతం భారత్ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతోందని స్పష్టం చేస్తున్నాయి. అయితే, దేశంలో 13 శాతం గృహాలకు మాత్రం ఇప్పటికీ విద్యుత్ అందుబాటులో లేదు. విద్యుత్ వినియోగదారులు, డిస్కంపై రాక్ఫెల్లర్ ఫౌండేషన్, నీతి ఆయోగ్‌తో కలిసి స్మార్ట్ పవర్ ఇండియా జరిపిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశ జనాభాలో దాదాపు 87 శాతం మందికి గ్రిడ్ ఆధారిత విద్యుత్ అందుబాటులో ఉందని సర్వే వెల్లడించింది. సగటున 17 గంటల సరఫరా దేశంలో విద్యుత్ అందుబాటులో లేని 13 శాతం మంది ఇతర మార్గాల్లో విద్యుత్‌ను పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 13 శాతంలో ఎక్కువగా 62 శాతం మంది వ్యవసాయదారులు ఉండటం గమనార్హం. కేవలం 4 శాతం గృహాలకు మాత్రమే గ్రిడ్ ఆధారిత విద్యుత్ లేదు. 92 శాతం మంది కస్టమర్లకు కేవలం 50 మీటర్ల లోపుగానే విద్యుత్ మౌలిక సదుపాయాలు లభిస్తున్నాయి. వ్యవసాయ కేటగిరీ సర్వీసులకు ఇది 75 శాతంగా ఉంది. మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న వినియోగదారులకు కనెక్షన్ రేటు 86 శాతం, వ్యవసాయ వినియోగదారులకు కనెక్షన్ రేటు 70 శాతం, సంస్థాగత వినియోగదారులకు కనెక్షన్ రేటు 81 శాతంగా ఉంది. విద్యుత్ అందుబాటులో లేకపోవడానికి కారణాలివీ కొందరికి విద్యుత్ అందుబాటులో లేకపోవడానికి కారణాలను కూడా అధ్యయనం వెల్లడించింది. కస్టమర్‌కు దూరంగా విద్యుత్ స్తంభం ఉండటం 47 శాతం, విద్యుత్ ఖర్చులు, వినియోగదారు చార్జీలు 35 శాతం, పేలవమైన సేవల నాణ్యత 20 శాతం కారణంగా ఉన్నాయి. వాణిజ్య కస్టమర్లలో దాదాపు సగం మంది సర్వీసు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఖర్చులు భరించలేకపోవడం అని అధ్యయనంలో వెల్లడించారు. గ్రిడ్ ఆధారిత విద్యుత్ కనెక్షన్ ఉన్న గృహ వినియోగదారులలో 92 శాతం మంది తక్కువ మంజూరైన లోడ్ 0–1 కిలోవాట్ పరిధిలోనే ఉన్నారు. విద్యుత్ సరఫరా సగటున రోజుకు సుమారు 17 గంటలు ఉంటోంది. 70 శాతం మంది గృహ వినియోగదారులు వారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నారు. దాదాపు 75 శాతం మంది గృహ వినియోగదారులకు విద్యుత్ కోతల గురించి ముందస్తు నోటిఫికేషన్ అందటం లేదు. 63 శాతం మంది వినియోగదారులు వారంలో ఒకటి కంటే ఎక్కువ వోల్టేజి సమస్యలకు గురయ్యారు. 16 శాతం మంది వినియోగదారులు విద్యుత్ ప్రమాదాలను చవిచూశారు. -
ఒంటివాసనే దోమకాటుకు మూలం
న్యూయార్క్: దోమలు. మనందరికీ ఉమ్మడి శత్రువులు. మలేరియా, జైకా, డెంగీ ప్రాణాంతక జ్వరాలకు కారణం. ఇవి కొందరినే ఎక్కువగా కుట్టడానికి కారణం ఏమిటి? ఫలానా రక్తం గ్రూప్ ఉన్నవారిని, రక్తంలో చక్కెర స్థాయిలు బాగా ఉన్నవారిని, వెల్లుల్లి, అరటిపండ్లు ఎక్కువగా తినేవారిని, మహిళలను దోమలు అధికంగా కుడుతుంటాయని అనుకుంటుంటారు. కానీ, ఇవేవీ నిజం కాదని అమెరికాలోని రాక్ఫెల్లర్ వర్సిటీ పరిశోధకులు తేల్చిచెప్పారు. శరీరం నుంచి వెలువడే ఓ రకం వాసనే దోమలను ఆయస్కాంతంలా ఆకర్షిస్తుందని, అలాంటి వారినే అవి ఎక్కువగా కుడుతుంటాయని తేల్చారు. ఈ వాసనకు కారణం శరీరంలోని కొవ్వు అమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్). ఇవి దోమలను ఆకర్షించే వాసనను ఈ ఉత్పత్తి చేస్తాయట! అధ్యయనం వివరాలను ‘జర్నల్ సెల్’లో ప్రచురించారు. మస్కిటో మ్యాగ్నెట్ మారదు చర్మంలో కార్బోజైలిక్ యాసిడ్స్ స్థాయిలు అధికంగా ఉన్నవారి పట్ల దోమలు విపరీతంగా ఆకర్షణకు గురవుతాయని అమెరికాలోని ‘రాక్ఫెల్లర్స్ ల్యాబొరేటరీ ఆఫ్ న్యూరోలింగ్విస్ట్ అండ్ బిహేవియర్’ ప్రతినిధి లెస్లీ వూషెల్ చెప్పారు. చర్మంలో భారీగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే దోమల ముప్పు అధికమేనని వివరించారు. జైకా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికున్‌గున్యా వంటి జ్వరాలకు కారణమయ్యే ‘ఎడిస్ ఈజిప్టి’ దోమలపై మూడేళ్లు అధ్యయనం చేశారు. చర్మంలో ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిలు బాగా ఉన్నవారే ఎక్కువగా దోమకాటుకు గురవుతున్నట్లు గుర్తించారు. ఆ అమ్లాల నుంచి ఉత్పత్తయ్యే గ్రీజులాంటి కార్బోజైలిక్ యాసిడ్స్ చర్మంపై కలిసి పొరలాగా పేరుకుంటాయి. వాటి నుంచి వచ్చే ఒక రకమైన వాసన దోమలను ఆకట్టుకుంటుందట!. -
కునుకు పట్టట్లేదా..!
కొందరికి రాత్రి వేళల్లో నిద్రపట్టాలంటే గగనమే. ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు అని మనలో చాలామందే అనుకుంటూ ఉంటాం. ఇలా నిద్రపట్టకపోవడానికి జన్యుపరమైన కారణాలు కావొచ్చని చెబుతున్నారు రాక్ఫెల్లర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు. చాలామందికి నిద్రలేమి వారసత్వంగా కూడా రావొచ్చని చెబుతున్నారు. జీవితాంతం తెల్లవారుజామున రెండు మూడు గంటలకు మాత్రమే నిద్రపట్టే మహిళపై చేసిన పరిశోధనల ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చినట్లు అలీనా పార్కే తెలిపారు. సీఆర్‌వై 1 అనే జన్యువులో తేడా ఉండటం వల్ల నిద్ర తొందరగా పట్టదని, నిద్రకు ఉపకరించే హార్మోన్ మెలటోనిన్ కూడా చాలా ఆలస్యంగా ఉత్పత్తి జరుగుతుందని పేర్కొన్నారు. సీఆర్‌వై1 జన్యువు క్లాక్, బీఎంఏఆర్ వంటి ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుందని.. ఈ ప్రొటీన్లు మరిన్ని జన్యువులు పనిచేసేందుకు కారణమవుతాయని వివరించారు. ఈ జన్యువులో తేడా కారణంగా ఈ రెండు ప్రొటీన్లు ఉత్పత్తి కావని పేర్కొన్నారు. రాత్రి వేళల్లో పనిచేసే ఇద్దరు వ్యక్తుల్లో జన్యుమార్పులు ఉన్నప్పటికీ వారికి ఏ విధమైన నిద్ర సమస్యల్లేవని తెలిసింది. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించొచ్చని అలీనా అంచనా వేస్తున్నారు.