వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 11 సంవత్సరాల బాలిక రాసిన ఉత్తరం ఇప్పుడు అంతర్జాలంలో హల్‌చల్ చేస్తోంది. ఈ లెటర్‌కు ఫేస్‌బుక్‌లో ఇప్పటివరకూ 10 వేలకు పైగా రియాక్షన్స్ వచ్చాయి. వేల మందిని ఈ ఉత్తరం కదిలిస్తోంది. ఇంతకూ ఎవరా బాలిక.. ఏమిటా ఉత్తరం.. ట్రంప్‌కు ఎందుకు రాసింది.. అనే సందేహాలు మీకు వస్తున్నాయా? అయితే ఈ వార్తను చదవాల్సిందే.
ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించారు. దీనిపై స్పందించిన ఆస్ట్రియా బాలిక పౌలా.. ట్రంప్‌కు ప్రత్యేకంగా ఒక ఉత్తరం రాసింది. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండెర్.. ఆ ఉత్తరాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అందించారు. అంతేకాక ఆయన ఆ లెటర్‌ను తన ఫేస్‌బుక్‌లోనూ పోస్ట్ చేశారు. ఆ ఉత్తరంలో.. ‘మిస్టర్ ప్రెసిడెంట్.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఇది నిజం. వాతావరణంలో వస్తున్న మార్పులకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పరిష్కారాలను వెతకాల’ని 11 ఏళ్ల పౌలా.. ట్రంప్‌కు విజ్ఞప్తి చేసింది.
ట్రంప్ అంకుల్.. ట్రంప్ అంకుల్..!
Published Sun, Sep 24 2017 5:26 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM
Advertisement