సింగపూర్: చైనీయులు ఆరాధ్య దైవం 'మజు'కు చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. సముద్ర దేవతైన మజు విగ్రహం సెన్సేషన్‌గా మారడానికి పెద్ద కారణం కూడా ఉంది. సౌత్ ఈస్ట్ ఏషియన్ టూర్‌ను ముగించుకుని వచ్చిన దేవత విగ్రహం తిరిగి చైనాకు బయల్దేరింది. మలేసియా, సింగపూర్‌లలో అత్యధికంగా సెటిల్ అయిన చైనీయుల కోసం.. వారి ఆరాధ్య దైవం మజును పర్యటనకు తీసుకెళ్లారు ఆర్గనైజర్స్.
'మజు'ను మెరిసే దుస్తులతో, పూల మాలలతో, కొన్ని కరెన్సీ నోట్లతో మజు విగ్రహాన్ని అందంగా అలకరించారు. దాదాపు ఏడు రోజుల పాటు మలేసియా, సింగపూర్ దేశాల్లో పర్యటన అనంతరం మజును తిరిగి చైనాకు తీసుకెళ్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. విమానంలో ప్రయాణానికి ముందు కొంతసేపు మజు విగ్రహాన్ని ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఉంచారు ఆర్గనైజర్స్. ఆ సమయంలో మజు విగ్రహాన్ని కొందరు ఫోటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.
చైనీయుల ఆరాధ్య దైవం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో సేదదీరుతున్నారని కామెంట్లు చేశారు. మరికొందరు మజు విగ్రహాన్ని బిజినెస్ క్లాస్‌లో చైనాకు తీసుకెళ్తున్నారని తెలిసి ముక్కున వేలేసుకున్నారు. అయితే, పర్యటనకు ముందు కౌలాలంపూర్ నుంచి మలక్కా వెళ్లేందుకు బస్‌లో మజు విగ్రహాన్ని తీసుకెళ్లారు ఆమె రక్షకులు. అక్కడికి పొరుగునే ఉన్న సింగపూర్ వెళ్లేందుకు ఓ లారీ వెనుక భాగంలో మజు విగ్రహాన్ని ఉంచి తీసుకెళ్లినట్లు తెలిసింది.
కాగా, పర్యటనలో ఉన్న మజు దేవతా విగ్రహాన్ని దర్శించుకునేందుకు మూడు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. మలేసియా, సింగపూర్‌లలో అత్యధికంగా నివసిస్తున్న చైనీయుల సౌకర్యం కోసమే మజును పర్యటనకు తీసుకువచ్చినట్లు వెల్లడించారు ఆర్గనైజర్స్. భవిష్యత్తులో శాన్ ఫ్రాన్సిస్కోకు సైతం మజును తీసుకెళ్లే ఆలోచన ఉందని చెప్పారు.
బిజినెస్ క్లాస్‌లో.. దేవతామూర్తి పర్యటన
Published Mon, Jul 10 2017 7:07 PM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM
Advertisement
Advertisement