గుడ్ మార్నింగ్.. | Good Morning | Sakshi
Sakshi News home page

గుడ్ మార్నింగ్..

Published Sat, Oct 25 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM

గుడ్ మార్నింగ్..

గుడ్ మార్నింగ్..

ఉషోదయ వేళ.. పక్కనే సముద్రుడి ఘోష.. అయినా ఇవేమీ పట్టనట్లు కొన్ని బద్దకంగా బండ మీద దొర్లుతుంటే.. మరికొన్నిటికి ఇంకా తెలవారనే లేదు. సివంగులు తమ పిల్లలతో ఉన్న ఈ ఫొటోను అమెరికాకు చెందిన ఫొటో జర్నలిస్ట్ మైఖేల్ నిక్ నికోల్స్ తీశారు. ‘ద లాస్ట్ గ్రేట్ పిక్చర్’ పేరిట తీసిన ఈ చిత్రం నేచురల్ హిస్టరీ మ్యూజియం, బీబీసీ వారు కలసి నిర్వహించిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2014 గ్రాండ్ టైటిల్ విన్నర్‌గా నిలిచింది.

ఈ ప్రతిష్టాత్మక పురస్కారంతోపాటు బ్లాక్ అండ్ వైట్ విభాగంలోనూ విజేతగా ఎన్నికైంది. మైఖేల్ ఈ చిత్రాన్ని టాంజానియాలోని సెరెన్‌గెటీ జాతీయ పార్కులో తీశారు. కొన్ని నెలలుగా తాను వాటి చుట్టూ తిరుగుతూ ఫొటోలు తీశానని.. అలాంటి సమయంలోనే ఈ అద్భుత చిత్రం చేజిక్కిందని నిక్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement