
మొబైల్..మంకీ..
ఇప్పుడంతా ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్ల హవానే.. ఇందుకు నరులే కాదు.. వానరులూ అతీతం కాదన్నట్లు ఈ ఫొటో కనిపిస్తుంది కదూ.. చల్లని నీటిలో ఎంజాయ్ చేస్తున్నా అంటూ ఫేస్‌బుక్‌లో స్టేటస్ అప్‌డేట్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ మంకీ ఫొటోను నెదర్లాండ్స్‌కు చెందిన మార్సెల్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు.
నేషనల్ హిస్టరీ మ్యూజియంతో కలసి బీబీసీ వారు నిర్వహిస్తున్న వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ -2014లో పీపుల్స్ చాయిస్ అవార్డు విభాగం తుది జాబితా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 50 ఫొటోల్లో ఇదీ ఒకటి. ప్రజలు వేసే ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. సెప్టెంబర్ 5తో ఓటింగ్ ముగుస్తుంది. అక్టోబర్‌లో విజేతల వివరాలను ప్రకటిస్తారు.