ఉద్యోగార్థులకు శుభవార్త! ఆకాశమే హద్దుగా ఆధునిక ప్రపంచం సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకొంటోంది. కంప్యూటరీకరణ నేపథ్యంలో విశ్వవ్యాప్తంగా సగానికి పైగా జనం ప్రతి విషయానికీ ఇంటర్నెట్ నే ఆశ్రయించడం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్ కు అత్యధిక ప్రాధాన్యత లభిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు గూగుల్ లేనిదే పని జరగని పరిస్థితి ఏర్పడింది. ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గూగుల్... తమ సంస్థలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది. వివరాల్లోకి వెడితే...
సాఫ్ట్ వేర్ దిగ్గజం గూగుల్ తాజాగా తమ సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. గూగుల్ డ్రైవర్ లెస్ కార్ల తయారీలో కొంతకాలంగా పూర్తిశాతం దృష్టి సారించిచిన సంస్థ... ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకోవడంతో కార్లను విడుదల చేసేందుకు ముందు వాటిని సమర్థవంతంగా నడపగలిగే ఉద్యోగస్థులకోసం వెతుకుతోంది. డ్రైవర్ లెస్ కార్ల సృష్టికి శ్రీకారం చుట్టి, కొంత కాలంగా అదే పనిలో నిమగ్నమైన గూగుల్... వెహికిల్ సేఫ్లీ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు డ్రైవర్ లెస్ కార్ల పనితీరు తెలుసుకోడానికి పని చేయాల్సి ఉంటుంది.
బ్యాచులర్ డిగ్రీతోపాటు ఇంతకు ముందు ఎటువంటి ప్రమాదాలు జరపనట్లు రుజువు చేసుకోవడమే ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులకు ముఖ్యమైన అర్హత. దీనికి తోడు అభ్యర్థులపై ఎటువంటి క్రిమినల్ కేసులూ ఉండకూడదు. అలాగే నిమిషానికి 40 పదాలు టైప్ చేయగలిగే అనుభవం కూడ ఉండాలి. ఈ ఉద్యోగం రోజుకు 6 గంటలనుంచి 8 గంటల పాటు ఉంటుంది. వారానికి ఐదు రోజుల మాత్రమే పని దినాలు. 12 నుంచి 24 నెలల కాంట్రాక్ట్ నిబంధనతో ఉద్యోగానికి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రోడ్లపై డ్రైవర్ లెస్ కార్ల పని తీరును పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు తమ ఇంజనీర్లకు విషయాలను అందించడమే ఈ ఉద్యోగంలో ముఖ్యంగా చేయాల్సిన పని.
కారు డ్రైవర్లకోసం గూగుల్ 'సెర్చ్'
Published Thu, May 19 2016 9:42 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement
Advertisement