చిన్న క్రిస్మస్‌ గ్రీటింగ్‌ కార్డు | Greeting card line starts a conversation about LGBTQ holiday anxiety over family acceptance | Sakshi
Sakshi News home page

చిన్న క్రిస్మస్‌ గ్రీటింగ్‌ కార్డు

Published Mon, Dec 25 2017 2:06 AM | Last Updated on Mon, Dec 25 2017 2:06 AM

Greeting card line starts a conversation about LGBTQ holiday anxiety over family acceptance - Sakshi

లండన్‌: ప్రపంచంలోనే అత్యంత చిన్న క్రిస్మస్‌ గ్రీటింగ్‌ కార్డుని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు. 15్ఠ20 మైక్రో మీటర్ల వైశాల్యం గల ఈ కార్డుని శక్తిమంతమైన మైక్రోస్కోపు ద్వారానే చూడొచ్చు. ఒక్క పోస్టేజీ స్టాంపుపై 200 మిలియన్‌ గ్రీటింగ్‌కార్డులు పడతాయి. నేషనల్‌ ఫిజికల్‌ లాబోరేటరీ (ఎన్‌పీఎల్‌)కి చెందిన శాస్త్రవేత్తలు ఈ వినూత్న గ్రీటింగ్‌కార్డుని రూపొందించారు. ప్లాటినం పూతగల సిలికాన్‌ నైట్రెడ్‌తో ఈ కార్డును తయారు చేశామని శాస్త్రవేత్తల్లో ఒకరైన కెన్‌ మిన్‌గార్డు తెలిపారు. ఈ కార్డు కొత్త పరికరాల రూపకల్పనలో ఉపయోగపడుతుందన్నారు. ఇంతకుముందు రికార్డుల్లో ఉన్న దాని కంటే ఈ గ్రీటింగ్‌ కార్డు పది రెట్లు చిన్నదని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement