త్వరలో హెచ్‌ఐవీ టీకా! | HIV vaccine soon! | Sakshi
Sakshi News home page

త్వరలో హెచ్‌ఐవీ టీకా!

Published Tue, Nov 29 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM

త్వరలో హెచ్‌ఐవీ టీకా!

త్వరలో హెచ్‌ఐవీ టీకా!

వాషింగ్టన్: హెచ్‌ఐవీని నియంత్రించే అధునాతన కొత్త టీకాలను అభివృద్ధి చేయడంలో చివరి అంకానికి దక్షిణాఫ్రికాలో శ్రీకారం చుట్టారు. ‘హెచ్‌ఐవీ వ్యాక్సిన్ ట్రయల్స్ నెట్‌వర్క్’లో చివరిదైన ‘హెచ్‌వీటీఎన్ 702’ అనే టీకాను ప్రస్తుతం పరీక్షించనున్నారు. ఇంతకుముందు పరీక్షించిన టీకాలు సత్ఫలితానివ్వడం తెలిసిందే.

హెవీటీఎన్ 702 విజయవంతమైతే హెచ్‌ఐవీని నియంత్రించడానికి మంచి టీకా దొరికినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో 5,400 మంది హెచ్‌ఐవీ సోకిన స్త్రీ, పురుషులపై టీకాలను పరీక్షించనున్నట్లు అమెరికా ఎన్‌ఐఏఐడీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్సియస్ డిసీజెస్) డెరైక్టర్ ఆంథోని ఫాసీ వెల్లడించారు. దక్షిణాఫ్రికాలోని 15 ప్రాంతాల్లో ఈ టీకాను పరీక్షిస్తున్నారు. 2020 చివరికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement