లండన్: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే అంశంలో(బ్రెగ్జిట్) తుది ఒప్పందాన్ని నిలుపుదల లేదా జాప్యం చేసేందుకు పార్లమెంటుకు అధికారాలు కట్టబెడుతూ రూపొందించిన ఈయూ (సవరణ) బిల్లుకు ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ గురువారం ఆమోదం తెలిపింది. బ్రిటన్ ఎగువ సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 355, వ్యతిరేకంగా 244 ఓట్లు పడ్డాయి.
దీంతో ఈయూతో మరోసారి చర్చలు జరపమని బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు పార్లమెంటుకు అధికారం ఏర్పడుతుంది. అలాగే తుది ఒప్పందం నచ్చకపోతే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని కూడా నిలువరించవచ్చు. బ్రెగ్జిట్‌పై పార్లమెంటుకు ఎన్ని హామీలు ఇచ్చినా హౌస్ ఆఫ్ లార్డ్స్ సవరణలకు అనుకూలంగా ఓటు వేయడం తమను తీవ్రంగా నిరాశపరిచిందని బ్రిటన్ మంత్రి మార్టిన్ కల్లనాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment