లండన్: లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బిగ్‌బెన్ గడియారం బ్రెగ్జిట్‌ను పురస్కరించుకుని జనవరి 31వ తేదీ రాత్రి ప్రత్యేకంగా గంటలు మోగించనుంది. పార్లమెంట్ ఆవరణలోని ఎలిజబెత్ టవర్‌లో ఉన్న 160 ఏళ్లనాటి ఈ గడియారానికి ప్రస్తుతం రూ.554 కోట్లతో మరమ్మతులు చేపడుతున్నారు. పనుల్లో పాల్గొంటున్న సిబ్బందికి ఇబ్బంది కలగరాదని ప్రస్తుతం ఈ గడియారం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే గంటలు కొట్టేలా ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సరాదిన డిసెంబర్ 31వ తేదీ రాత్రి మోగేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో గంటలు మోగాలంటే ప్రత్యేకంగా పార్లమెంట్ తీర్మానం చేయాల్సి ఉంటుంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వేరు పడుతున్న బ్రెగ్జిట్ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 31వ తేదీ రాత్రి 11 గంటలకు బిగ్‌బెన్ గంటలు కొట్టేలా చూడాలంటూ 50 మంది ఎంపీలు చేసిన విజ్ఞప్తికి స్పీకర్ సానుకూలంగా స్పందించారని ‘ది సండే టెలిగ్రాఫ్’ పత్రిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment