big ben bell
-
సంగీతానికి సరిహద్దులు లేవోయి!
దేశానికి సరిహద్దులు ఉండొచ్చుగానీ సంగీతానికి ఉండవు అని మరోసారి గుర్తు చేసిన ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతూ ‘ఆహా’ అనిపిస్తోంది. విషయం ఏమనగా... భారతీయ యువతి ఒకరు లండన్‌లోని బిగ్‌బెన్(గ్రేట్ బెల్ ఆఫ్ ది గ్రేట్ క్లాక్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్)కు సమీపంలో బాలీవుడ్ సినిమా ‘క్వీన్’లోని ‘లండన్ తుమ్ఖడా’ పాటకు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల జనాలు గుంపులుగా చేరి ఆ డాన్స్‌ను ఆసక్తితో చూడడం మొదలుపెట్టారు. సీన్ ఇదే అయితే ఈ సీన్ గురించి చెప్పడానికి అంత సీన్ ఉండేది కాదు. అయితే హిందీ భాషలో ఒక్క ముక్క కూడా అర్థం కాని ఆ జనాలు యువతితో పాటు డ్యాన్స్ చేయడం కోసం కాలు కదపడమే విషయం. . ‘ఇలాంటి దృశ్యాన్ని లండన్‌లో మాత్రమే చూడగలం’ అనే కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
జనవరి 31న ‘బిగ్‌బెన్’ బ్రెగ్జిట్ గంటలు
లండన్: లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బిగ్‌బెన్ గడియారం బ్రెగ్జిట్‌ను పురస్కరించుకుని జనవరి 31వ తేదీ రాత్రి ప్రత్యేకంగా గంటలు మోగించనుంది. పార్లమెంట్ ఆవరణలోని ఎలిజబెత్ టవర్‌లో ఉన్న 160 ఏళ్లనాటి ఈ గడియారానికి ప్రస్తుతం రూ.554 కోట్లతో మరమ్మతులు చేపడుతున్నారు. పనుల్లో పాల్గొంటున్న సిబ్బందికి ఇబ్బంది కలగరాదని ప్రస్తుతం ఈ గడియారం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే గంటలు కొట్టేలా ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సరాదిన డిసెంబర్ 31వ తేదీ రాత్రి మోగేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో గంటలు మోగాలంటే ప్రత్యేకంగా పార్లమెంట్ తీర్మానం చేయాల్సి ఉంటుంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వేరు పడుతున్న బ్రెగ్జిట్ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 31వ తేదీ రాత్రి 11 గంటలకు బిగ్‌బెన్ గంటలు కొట్టేలా చూడాలంటూ 50 మంది ఎంపీలు చేసిన విజ్ఞప్తికి స్పీకర్ సానుకూలంగా స్పందించారని ‘ది సండే టెలిగ్రాఫ్’ పత్రిక తెలిపింది. -
బిగ్ బెన్ మోగేది ఎప్పుడో తెలుసా!
లండన్: లండన్‌లోని వెస్ట్మినిస్టర్లోగల ప్రసిద్ధ క్లాక్‌టవర్ బిగ్‌బెన్ మూడేండ్లుగా మూగబోయింది. దీంతో 157 ఏండ్ల పురాతన టవర్‌ను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించడం లేదు. ఇది పనిచేయకుండా నిశబ్దంగా మారడంతో 40 మిలియన్ డాలర్లతో పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టారు. గడియారం ముల్లు, లోలకానికి మరమ్మతులు చేపట్టనున్నారు. 334 మెట్లు ఉన్న టవర్‌ను ఎక్కడం అందరికీ సాధ్యం కాకపోతుండటంతో ఓ లిఫ్ట్‌ను సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా దీన్ని చూసేందుకు సందర్శకులను ఎప్పుడు అనుమతిస్తారనే విషయంపై తొలిసారిగా అధికారిక ప్రకటన వెలువడింది. క్రిస్మస్ తర్వాతే మరమ్మతు పనులన్నీ పూర్తవుతాయని, ఆ తర్వాతే పర్యాటకులను అనుమతిస్తామని బ్రిటన్ పార్లమెంట్ అధికారులు తెలిపారు. నిజానికి డిసెంబర్ 31వ తేదీ ముగిసి.. నూతన సంవత్సరం ప్రారంభమయ్యే గడియలో ఈ బిగ్‌బెన్ గడియారాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఈ పర్యాటక స్థలాన్ని చూసేందుకు లక్షలాదిమంది వచ్చే అవకాశముందని, వారంతా నిరాశగా తిరిగివెళ్లిపోవడం బాగుండదని భావించిన అధికారులు క్రిస్మస్ నాటికి బిగ్‌బెన్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించారు. -
అందుకే.. బిగ్‌బెన్ ధ్వని అంత మధురం
లండన్: లండన్‌లో ఉన్న అతి పెద్ద క్లాక్ టవర్ బిగ్‌బెన్. దీని నిర్మాణం జరిగి దాదాపు 160 ఏళ్లు గడుస్తున్నాయి. బిగ్‌బెన్ గంట సుమారు 13.7 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచి నిత్యం ఇక్కడకి ఎందరో పర్యాటకులు వస్తుంటారు. ఎంతో ఘనచరిత్ర కలిగిన ఈ బిగ్‌బెన్ గురించి శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ గడియారంలోని గంట చేసే ధ్యని అంత మధురంగా ఎందుకు ఉంటుంది? అన్న విషయాన్ని లేజర్ సహాయంతో కనుగొన్నారు. బిగ్బెన్లో గంటను మోగించడానికి 200 కిలోల బరువుండే సుత్తిని ఉపయోగిస్తారు. ఈ ప్రయోగం కోసం వారు రెండు లేజర్లను ఉపయోగించారు. వీటి సహాయంతో గంట నుంచి ఉత్పత్తి అయ్యే పౌనః పున్యాలను మ్యాపింగ్ చేసి ఒక యానిమేషన్‌ను రూపొందించారు. దీని ద్వారా గంట వెలువరించే విభిన్న కంపనాల నమూనాలను గుర్తించారు. ప్రత్యేక పౌనః పున్యాల వరుసల కారణంగా బిగ్‌బెన్ నుంచి శ్రావ్యమైన ధ్వని వెలువడుతుందని పరిశోధకులు గుర్తించారు. అదన్నమాట సంగతి! అందుకే, బిగ్‌బెన్ నుంచి వెలువడే ధ్వని అంత మధురంగా ఉంటుంది అని వివరించారు.