లండన్: లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌లోగల ప్రసిద్ధ క్లాక్‌టవర్ బిగ్‌బెన్ మూడేండ్లుగా మూగబోయింది. దీంతో 157 ఏండ్ల పురాతన టవర్‌ను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించడం లేదు. ఇది పనిచేయకుండా నిశబ్దంగా మారడంతో 40 మిలియన్ డాలర్లతో పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టారు. గడియారం ముల్లు, లోలకానికి మరమ్మతులు చేపట్టనున్నారు. 334 మెట్లు ఉన్న టవర్‌ను ఎక్కడం అందరికీ సాధ్యం కాకపోతుండటంతో ఓ లిఫ్ట్‌ను సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా దీన్ని చూసేందుకు సందర్శకులను ఎప్పుడు అనుమతిస్తారనే విషయంపై తొలిసారిగా అధికారిక ప్రకటన వెలువడింది.
క్రిస్మస్ తర్వాతే మరమ్మతు పనులన్నీ పూర్తవుతాయని, ఆ తర్వాతే పర్యాటకులను అనుమతిస్తామని బ్రిటన్ పార్లమెంట్ అధికారులు తెలిపారు. నిజానికి డిసెంబర్ 31వ తేదీ ముగిసి.. నూతన సంవత్సరం ప్రారంభమయ్యే గడియలో ఈ బిగ్‌బెన్ గడియారాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఈ పర్యాటక స్థలాన్ని చూసేందుకు లక్షలాదిమంది వచ్చే అవకాశముందని, వారంతా నిరాశగా తిరిగివెళ్లిపోవడం బాగుండదని భావించిన అధికారులు క్రిస్మస్ నాటికి బిగ్‌బెన్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment