Parliament complex
-
Photo Viral: ప్రధాని మోదీ, రాహుల్ నవ్వుతూ.. అప్యాయ పలకరింపు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వేదికగా నేడు ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒకరిని ఒకరు అప్యాయంగా పలకరించుకున్నారు. శుక్రవారం సాయంత్రం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన ఓ అనూహ్య సమావేశం ఇందుకు వేదికగా నిలిచింది.కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. దీంతో ఉభయసలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. వాస్తవానికి ఆగస్టు 12న ముగియాల్సి ఉండగా నేడు సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.అయితే సమావేశాల ముగింపుకు ముందు పార్లమెంట్ అవరణలో అనధికారిక టీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలతోపాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలందరూ ఒకరినొకరు పలకరించుకుంటూ చిరునవ్వులు చిందించారు.ప్రధాని సోఫాలో కూర్చోగా.. ఆయన పక్కనే స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి కుడివైపున కుర్చీపై కూర్చున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌చ కిరణ్ రిజిజు, కింజరాపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, పీయూష్ గోయల్‌తో పాటు ప్రతిపక్ష ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, కనిమొళి కూడా ఉన్నారు. నేతలంతా ట్లాడుకుంటున్న సమయంలో ఓ సర్వర్ టీ ట్రేతో రావడం కూడా ఈ ఈఫోటోలో కనిపిస్తుంది.కాగా నిన్నటి మొన్నటి వరకు పార్లమెంట్ సమావేశాల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య వాడీవేడీ వాతవరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక ఇప్పుడు ఉన్నట్టుండి ప్రత్యర్థి పార్టీల నేతలు పరస్పరం ఎదురెదురుగా కులాసాగా కూర్చొని నవ్వుతూ కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. -
జనవరి 31న ‘బిగ్‌బెన్’ బ్రెగ్జిట్ గంటలు
లండన్: లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బిగ్‌బెన్ గడియారం బ్రెగ్జిట్‌ను పురస్కరించుకుని జనవరి 31వ తేదీ రాత్రి ప్రత్యేకంగా గంటలు మోగించనుంది. పార్లమెంట్ ఆవరణలోని ఎలిజబెత్ టవర్‌లో ఉన్న 160 ఏళ్లనాటి ఈ గడియారానికి ప్రస్తుతం రూ.554 కోట్లతో మరమ్మతులు చేపడుతున్నారు. పనుల్లో పాల్గొంటున్న సిబ్బందికి ఇబ్బంది కలగరాదని ప్రస్తుతం ఈ గడియారం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే గంటలు కొట్టేలా ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సరాదిన డిసెంబర్ 31వ తేదీ రాత్రి మోగేందుకు ఏర్పాట్లు చేశారు. దీనిలో గంటలు మోగాలంటే ప్రత్యేకంగా పార్లమెంట్ తీర్మానం చేయాల్సి ఉంటుంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వేరు పడుతున్న బ్రెగ్జిట్ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 31వ తేదీ రాత్రి 11 గంటలకు బిగ్‌బెన్ గంటలు కొట్టేలా చూడాలంటూ 50 మంది ఎంపీలు చేసిన విజ్ఞప్తికి స్పీకర్ సానుకూలంగా స్పందించారని ‘ది సండే టెలిగ్రాఫ్’ పత్రిక తెలిపింది. -
పార్లమెంట్ లో ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ
న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్ హౌస్ లో సీఆర్ఫీఎఫ్ జవాను చేతిలోని తుపాకీ ప్రమాదవశాత్తు పేలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్నిరోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. పార్లమెంట్ డ్యూటీ గ్రూపు(పీడీజీ)కు చెందిన సెక్యురిటీ గార్డు చేతిలోని తుపాకీ ప్రమాదవశాత్తు పేలి నాలుగు బుల్లెట్లు బయటకు దూసుకువచ్చాయని సీఆర్ఫీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హాసన్ చెప్పారు. ఈ బుల్లెట్లు ఎవరినీ తాకలేదని తెలిపారు. అత్యంత సున్నిత ప్రాంతమైన పార్లమెంట్ కాంప్లెక్స్ లో ఈ ఘటన జరిగిందన్నారు. పేలుడుకు కారణమైన సెక్యురిటీ గార్డును విధుల నుంచి తొలగించినట్టు చెప్పారు. అతడి వద్ద నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.