పార్లమెంట్ లో ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ | CRPF jawan fires accidental shots inside Parliament House | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ లో ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ

Published Tue, Nov 11 2014 9:36 PM | Last Updated on Sat, Aug 11 2018 9:02 PM

పార్లమెంట్ లో ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ - Sakshi

పార్లమెంట్ లో ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ

న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్ హౌస్ లో సీఆర్ఫీఎఫ్ జవాను చేతిలోని తుపాకీ ప్రమాదవశాత్తు పేలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్నిరోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

పార్లమెంట్ డ్యూటీ గ్రూపు(పీడీజీ)కు చెందిన సెక్యురిటీ గార్డు చేతిలోని తుపాకీ ప్రమాదవశాత్తు పేలి నాలుగు బుల్లెట్లు బయటకు దూసుకువచ్చాయని సీఆర్ఫీఎఫ్ ఐజీ జుల్ఫికర్ హాసన్ చెప్పారు. ఈ బుల్లెట్లు ఎవరినీ తాకలేదని తెలిపారు. అత్యంత సున్నిత ప్రాంతమైన పార్లమెంట్ కాంప్లెక్స్ లో ఈ ఘటన జరిగిందన్నారు. పేలుడుకు  కారణమైన సెక్యురిటీ గార్డును విధుల నుంచి తొలగించినట్టు చెప్పారు. అతడి వద్ద నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement