180 ఏళ్ల క్రితమే గ్లోబల్‌ వార్మింగ్‌ | Humans have caused climate change for 180 years | Sakshi
Sakshi News home page

180 ఏళ్ల క్రితమే గ్లోబల్‌ వార్మింగ్‌

Published Fri, Aug 26 2016 2:11 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

180 ఏళ్ల క్రితమే గ్లోబల్‌ వార్మింగ్‌

180 ఏళ్ల క్రితమే గ్లోబల్‌ వార్మింగ్‌

మెల్‌బోర్న్‌: పారిశ్రామికీకరణ పేరుతో మానవుడు అవలంబిస్తున్న వింత పోకడలతో గ్లోబల్‌ వార్మింగ్‌ (భూతాపం) నానాటికీ పెరిగిపోతుంది. ఈ గ్లోబల్‌ వార్మింగ్‌ ఇప్పటిది కాదట! 180 ఏళ్ల క్రితం ఇది ప్రారంభమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ (ఏఎన్‌యూ) శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. వీరు చేపట్టిన ఒక అధ్యయనంలో 1830లో నుంచి గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రారంభమైందని తేల్చారు. ఆ సమయంలో మొదలైన పారిశ్రామిక విప్లవం ద్వారా గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రారంభమైందని   ఏఎన్‌యూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నెరిలీ అబ్రామ్‌ తెలిపారు.

పసిఫిక్, అట్లాంటిక్‌ సముద్రాల ప్రాంతాల్లో  1830 సంవత్సరం లేదా అంతకంటే ముందే ఈ గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రారంభమై ఉండొచ్చని ఆమె చెప్పారు. సాధారణంగా ఈ వాతావరణ మార్పులు 20వ దశాబ్దానికి చెందినవిగా చాలా మంది భావిస్తారని కాని అంతకు పూర్వమే మార్పులు ప్రారంభమైనట్లు ఆమె వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement