కరోనా బాధితులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ మందును ఔషధంగా ఇస్తున్న విషయం తెలిసిందే. దీనికోసం అగ్రరాజ్యాల నుంచి చిన్నదేశాల వరకు భారత్ ముందు మోకరిల్లాయి. సుమారు 30 దేశాలు తమకూ ఆ మందును పంపించాలని భారత్‌ను చేతులెత్తి వేడుకుంటున్నాయి. ప్రస్తుత తరుణంలో దీనికన్నా మెరుగైన ఔషధం లేకపోవడంతో ఈ మందుకు అంత గిరాకీ ఏర్పడింది. అమెరికాలోని ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్) సైతం కరోనాకు ఈ మందును వినియోగించవచ్చని సూచించింది. అయితే మలేరియాను కట్టడి చేసే ఈ డ్రగ్ కరోనా వైరస్‌ను పూర్తిగా తగ్గించడంలో ఏమంత ప్రభావవంతంగా పనిచేయట్లేదని చైనా అధ్యయనం పేర్కొంది. (లాక్‌డౌన్..కరోనా గాన్!)
అధ్యయనంలో భాగంగా చైనా పరిశోధకులు ఆసుపత్రిలోని 150 మంది కరోనా పేషెంట్లను ఎంపిక చేసుకుని రెండు గ్రూపులుగా విభజించారు. అందులో ఒక గ్రూపుకు సాధారణ చికిత్సను అందించగా మిగతావారికి హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇచ్చారు. అనంతరం ఇరు వర్గాల వారి ఫలితాలను పరీక్షించగా ఈ యాంటీ మలేరియా డ్రగ్ వైరస్‌ల స్థాయిని కొంతవరకే తగ్గించగలిగిందని, ప్రామాణిక చికిత్స కన్నా మరింత మెరుగ్గా పనిచేయలేదని పెదవి విరిచారు. మరికొందరు నిపుణులు సైతం దీని మోతాదు మించితే రోగుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. (భారత్ అనుమతినిచ్చింది: మలేషియా)
Comments
Please login to add a commentAdd a comment