
న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనపై సోమవారం మరోసారి కమాండ్‌స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా వైపున ఉన్న మోల్దో వద్ద ఇరు దేశాల సైనికాధికారులు చర్చల్లో పాల్గొన్నారు. కాగా, తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ వద్ద జూన్ 15 రాత్రి చైనా, భారత బలగాల పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో కల్నల్ సంతోష్‌బాబుతో సహా 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. దాదాపు 43 మంది చైనా సైనికులు గల్వాన్ ఘర్షణల్లో మృతి చెందినట్టు వార్తలొస్తున్నప్పటికీ మరణాలపై సంఖ్యపై అక్కడి ప్రభుత్వం ఎటువంటి ప్రకటనా చేయలేదు. కాగా, ఇరు దేశాలు గాల్వన్ లోయ తమదంటే తమదంటూ ప్రకటనలు చేస్తున్న తరుణంలో కమాండ్‌స్థాయి చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది.
(చదవండి: ప్రకటనలపట్ల మోదీ జాగ్రత్తగా ఉండాలి: మన్మోహన్)
Comments
Please login to add a commentAdd a comment