సాక్షి, న్యూఢిల్లీ: చాబహార్ రైల్వే ప్రాజెక్ట్ నుంచి భారత్ జౌట్ అయ్యింది అనే వాదనను సీనియర్ ఉన్నతాధికారి ఒకరు ఖండించారు. భారత్ చాబహార్ పోర్టు ప్రాజెక్ట్‌లో భాగమైన రైల్వే లైన్‌ను నిర్మించడానికి కట్టుబడి ఉందని తెలిపారు. దీనికి సంబంధించి టెహ్రాన్‌లోని ఇండియన్ ఎంబసి మాట్లాడుతూ, ‘చాబహార్- జహేదన్ రైల్వే లైన్ నిర్మించడానికి భారత్ కట్టుబడి ఉంది. ఈ విషయంలో భారత్ ఎప్పుడూ ఇరాన్ ఉన్నతాధికారులతో టచ్‌లోనే ఉంది . ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు కొనసాగిస్తాం’ అని తెలిపారు.
చదవండి: చైనా ఆఫర్.. ఇండియా ఔట్..!
ఈ విషయంపై ఇరాన్ ప్రభుత్వానికి చెందిన వారు మాట్లాడుతూ, చాబహార్ పోర్టుకు నిధులు సమకూర్చడంతో పాటు ఎంతో ముఖ్యమైన చాబహార్- జహీదన్ రైల్వే లైన్ నిర్మాణం ప్రాజెక్ట్ నిర్మాణంలోనూ, అదే విధంగా జహేదన్ నుంచి టర్కిమినిస్తాన్ బోర్డర్ సరక్స్ వరకు నిర్మించే రైల్వే లైన్ ప్రాజెక్ట్‌లోనూ భారత్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని భావిస్తున్నాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు ఇండియా నిధులు చేకూర్చడం లేదు. దీని కోసం ఇరాన్ ప్రభుత్వమే ఖర్చు చేస్తోంది’ అని తెలిపారు. ఇండియా దీని కోసం త్వరలోనే నిధులు సమకూరుస్తుంది అని భావిస్తున్నామన్నారు. రైల్వే లైన్ నిర్మించడానికి అవసరమైన సామాగ్రిని తరలించడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని, రైల్వే లైన్ పనులు ప్రారంభం కావాల్సి ఉన్నాయని తెలుస్తోంది.
చదవండి: ఇరాన్ అలక
Comments
Please login to add a commentAdd a comment