
టెహ్రాన్ : మధ్యప్రాచ్య దేశం ఇరాన్‌లో దాదాపు పది వేల మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారిన పడినట్లు ఆ దేశ వార్తా సంస్థలు గురువారం తెలిపాయి. ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ఖాసీమ్ జాన్‌బాబాయి ఈ విషయం తెలిపినట్లు ఐఎస్‌ఎన్‌ఏ వార్తా సంస్థ తెలిపింది.అయితే కొన్ని రోజుల క్రితం వెలువడ్డ సమాచారం ప్రకారం దాదాపు 800 మంది ఆరోగ్య కార్యకర్తలు వైరస్ బారినపడ్డారు. వీరిలో సుమారు వంద మంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ చెబుతోంది. వైరస్ కారణంగా గురువారం నాటికి ఇరాన్‌లో 7249 మంది మరణించారు. ఇప్పటివరకూ దేశంలో మొత్తం 1.29 లక్షల మందికి కరోనా సోకింది. బుధవారం నుంచి 24 గంటల్లో 2392 మంది కొత్తగా వ్యాధి బారిన పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment