మీ స్వర్గాన్ని కూల్చేస్తాం
► పాకిస్తాన్‌కు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: సోమవారం పాకిస్తాన్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సరిహద్దుల్లో రెచ్చిపోతున్న సున్నీ మిలిటెంట్లను అదుపులో ఉంచాలని హెచ్చరించింది.లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపింది. వారి స్థావరాలపై దాడిచేయాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది.
గత నెలలో పాక్-ఇరాన్ సరిహద్దుల్లో పాక్ సున్నీలు జరిపిన కాల్పుల్లో పదిమంది ఇరాన్ సైనికులు మరణించారు. 'జైష్-అల్-ఆదిల్' పాక్ సున్నీమిలిటెంట్లు భూబాగం నుంచే లాంగ్ రేంజ్ తుపాకులతో కాల్పులు జరిపారు. సుదూర సరిహద్దు ఉన్న రెండు దేశాలు స్మగ్లింగ్, ఏర్పాటు వాదలు కాల్పులతో అశాంతి నెలకొందని ఇరాన్ తెలిపింది.
ఇరాన్ ఆర్మీ మేజర్‌జనరల్ మహమ్మద్ బకేరి మాట్లాడుతూ ఇలాంటి పరిస్థిలు కొనసాగిస్తే సహించేది లేదన్నారు. సరిహద్దులో ఆందోళనలు సృష్టస్తున్న ఉగ్రవాదుల స్థావరాలను పాక్ అంతచేస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇకపై ఇదే పరిస్థితి కొనసాగితే వారు స్వర్గంగా భావిస్తున్న వారి స్థావరాలు ఎక్కడ ఉన్నాభూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. గత వారం పాకిస్తాన్‌లో పర్యటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జావీద్ జరీఫ్ సరిహద్దు వెంట భద్రత పెంచాలని నవాజ్‌షరీఫ్‌ను కోరారు. దీనిపై పాకిస్తాన్ హామీ ఇచ్చింది.
ఇలాగే 2014లో 'జైష్-అల్-ఆదిల్' ఐదుగురు ఇరాన్ సైనికులను కిడ్నాప్ చేసింది. వారిని విడిపించడానికి ఇరాన్ భద్రతా బలగాలను పాక్ భూబాగంలోకి పంపింది. అయితే దీనిని పాక్‌తీవ్రంగా వ్యతిరేఖించింది. ఇది అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధమని వాదించింది.