Jaish al Adl
-
పాక్ ఉగ్రస్థావరాలపై ఇరాన్ దాడులు
జెరూసలేం: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తూ తమ దేశంలో ఉగ్రదాడులకు తెగబడుతున్న జైష్ అల్–అదిల్ ఉగ్రసంస్థ స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడులతో విరుచుకుపడింది. దీంతో ఇప్పటికే హమాస్–ఇజ్రాయెల్ యుద్ధంతో ఉద్రిక్తతలు పెరిగిన పశి్చమాసియాలో పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఇన్నాళ్లూ దౌత్య సంబంధాలు మాత్రమే కొనసాగుతున్న పాకిస్తాన్, ఇరాన్‌ల మధ్య ఒక్కసారిగా వైరం ప్రజ్వరిల్లింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని గ్రీన్ మౌంటేన్ పర్వతప్రాంతంలోని జైష్ అల్ అదిల్(ఆర్మీ ఆఫ్ జస్టిస్) సంస్థకు చెందిన రెండు స్థావరాలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బలగాలు డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు గాయపడ్డారు. ఇరాన్ విదేశాంగ మంత్రితో పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్లా దావోస్ నగరంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో మంతనాలు జరిపిన రోజే ఈ దాడులు జరగడం గమనార్హం. ఇరాన్ రాయబారిపై వేటు జైష్ అనేది 2012లో పాక్‌లో నెలకొలి్పన సున్నీ ఉగ్రసంస్థ. ఇరాన్లో జైష్ తరచూ ఇరాన్ భద్రతాబలగాలపై దాడులకు దిగుతోంది. సైనికులను అపహరిస్తూ ఇరాన్ ప్రభుత్వానికి పెద్దతలనొప్పిగా తయారైంది. పాక్ సరిహద్దు పట్టణం పంజ్‌ఘర్ కేంద్రంగా పనిచేస్తూ జైష్ దాడులకు దిగుతోందని ఇప్పటికే పలుమార్లు ఇరాన్ ఆరోపించింది. ఈనెలలో సున్నీ ఉగ్రసంస్థ ఒకటి సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో జంట ఆత్మాహుతి దాడులకు పాల్పడి వంద మందిని బలితీసుకున్న విషయం తెల్సిందే. దీంతో సున్నీ ఉగ్రసంస్థలపై ఉక్కుపాదం మోపాలని ఇరాన్ నిశ్చయించుకుంది. అందులోభాగంగానే పాక్‌లోని జైష్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. అయితే తమ భూభాగంపై విదేశీ దాడిని పాకిస్తాన్ తీవ్రంగా ఆక్షేపించింది. పాక్‌లోని ఇరాన్ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారిని పిలిపించుకుని తన నిరసన వ్యక్తంచేసింది. తమ దేశంలోని ఇరాన్ రాయబారిని బహిష్కరించింది. ఇరాన్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంది. ‘పాక్ గగనతలాన్ని అనుమతిలేకుండా వినియోగించడం, దురి్వనియోగం చేయడం ద్వారా ఇరాన్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించింది. ఇది పాక్ సార్వ¿ౌమత్వాన్ని అవమానించడమే. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను అపహాస్యం చేస్తూ ఇలా దాడులకు దిగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీని తీవ్ర పరిణామాలను ఇరాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని పాక్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇరాన్ ఆర్మీ అధికారి కాల్చివేత జైష్ ఉగ్రస్థావరాలపై దాడి జరిగిన మరుసటి రోజే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారిని ఉగ్రవాదులు కాలి్చచంపారు. పాక్, అఫ్గానిస్తాన్‌లతో సరిహద్దు పంచుకుంటున్న సిస్తాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఈ ఉగ్రదాడి ఘటన జరిగిందని ఇరాన్ అధికార వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ బుధవారం తెలిపింది. -
పాకిస్తాన్లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్
టెహ్రాన్: పాకిస్తాన్ భూభాగంలో మంగళవారం రాత్రి తాము సర్జికైల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు ఇరాన్ ఎలైట్ రెవల్యూషనరీ గార్డ్స్(ఐఆర్జీసీ) ప్రకటించింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జైష్ ఉల్–అదల్ అనే ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న తమ ఇద్దరు బోర్డర్ గార్డులను విజయవంతంగా విడిపించామని పేర్కొంది. వారిని సురక్షితంగా ఇరాన్‌కు చేర్చామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వాహాబీ టెర్రరిస్టు గ్రూప్ అయిన జైష్ ఉల్–అదల్ 2018 అక్టోబర్ 16న 12 మంది ఐఆర్జీసీ గార్డులను అపహరించింది. పాక్–ఇరాన్ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వారిని సురక్షితంగా విడిపించేందుకు ఇరు దేశాల మిలటరీ అధికారులు ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. మిలటరీ ఆపరేషన్లు నిర్వహించి, ఇప్పటివరకు దాదాపు 10 మందిని ఐఆర్జీసీ గార్డులను విడిపించగలిగారు. తాజాగా సర్జికల్ స్ట్రైక్స్‌తో ఇరాన్ సైన్యం మిగిలిన ఇద్దరిని కూడా రక్షించింది. ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్–అదల్ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగిస్తోంది. ఇరాన్‌లోని బలూచ్ సున్నీల హక్కులను కాపాడడానికి తాము పోరాడుతున్నామని చెబుతోంది. -
మీ స్వర్గాన్ని కూల్చేస్తాం
► పాకిస్తాన్‌కు ఇరాన్ వార్నింగ్ టెహ్రాన్: సోమవారం పాకిస్తాన్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ సరిహద్దుల్లో రెచ్చిపోతున్న సున్నీ మిలిటెంట్లను అదుపులో ఉంచాలని హెచ్చరించింది.లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపింది. వారి స్థావరాలపై దాడిచేయాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. గత నెలలో పాక్-ఇరాన్ సరిహద్దుల్లో పాక్ సున్నీలు జరిపిన కాల్పుల్లో పదిమంది ఇరాన్ సైనికులు మరణించారు. 'జైష్-అల్-ఆదిల్' పాక్ సున్నీమిలిటెంట్లు భూబాగం నుంచే లాంగ్ రేంజ్ తుపాకులతో కాల్పులు జరిపారు. సుదూర సరిహద్దు ఉన్న రెండు దేశాలు స్మగ్లింగ్, ఏర్పాటు వాదలు కాల్పులతో అశాంతి నెలకొందని ఇరాన్ తెలిపింది. ఇరాన్ ఆర్మీ మేజర్‌జనరల్ మహమ్మద్ బకేరి మాట్లాడుతూ ఇలాంటి పరిస్థిలు కొనసాగిస్తే సహించేది లేదన్నారు. సరిహద్దులో ఆందోళనలు సృష్టస్తున్న ఉగ్రవాదుల స్థావరాలను పాక్ అంతచేస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇకపై ఇదే పరిస్థితి కొనసాగితే వారు స్వర్గంగా భావిస్తున్న వారి స్థావరాలు ఎక్కడ ఉన్నాభూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. గత వారం పాకిస్తాన్లో పర్యటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జావీద్ జరీఫ్ సరిహద్దు వెంట భద్రత పెంచాలని నవాజ్‌షరీఫ్‌ను కోరారు. దీనిపై పాకిస్తాన్ హామీ ఇచ్చింది. ఇలాగే 2014లో 'జైష్-అల్-ఆదిల్' ఐదుగురు ఇరాన్ సైనికులను కిడ్నాప్ చేసింది. వారిని విడిపించడానికి ఇరాన్ భద్రతా బలగాలను పాక్ భూబాగంలోకి పంపింది. అయితే దీనిని పాక్తీవ్రంగా వ్యతిరేఖించింది. ఇది అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధమని వాదించింది.