ఇరాక్‌లో 74 మంది జిహాదీలు హతం | Iraqi Forces Kill 74 ISIS Fighters in Kirkuk, Ending Three-Day Assault | Sakshi
Sakshi News home page

ఇరాక్‌లో 74 మంది జిహాదీలు హతం

Published Tue, Oct 25 2016 10:43 AM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

Iraqi Forces Kill 74 ISIS Fighters in Kirkuk, Ending Three-Day Assault

కిర్కుక్‌: ఇరాక్‌ భద్రతా దళాలు 74 మంది ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. గత మూడు రోజులుగా కిర్కుక్‌ నగరంలో భద్రతా దళాలకు, జిహాదీలకు మధ్య జరిగిన కాల్పులు ముగిశాయి. ఈ కాల్పుల్లో 74 మంది జిహాదీలు మరణించినట్లు ప్రొవిన్షియల్‌ గవర్నర్‌ నజుముద్దీన్‌ కరీం తెలిపారు.

శుక్రవారం సుమారు వంద మంది ఉగ్రవాదులు నగరంపై దాడులు ప్రారంభించారని అందులో కొంత మంది స్లీపర్‌ సెల్స్‌ కూడా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ ఉగ్రదాడుల్లో సుమారు 46 మంది ప్రజలు మరణించారని అందులో ఎక్కువగా భద్రతాదళ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం దాడులు ముగిశాయని, పరిస్థితులు అదుపులోకి వచ్చాయని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement