ISIS fighters
-
ఇరాక్‌లో 74 మంది జిహాదీలు హతం
కిర్కుక్: ఇరాక్ భద్రతా దళాలు 74 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. గత మూడు రోజులుగా కిర్కుక్ నగరంలో భద్రతా దళాలకు, జిహాదీలకు మధ్య జరిగిన కాల్పులు ముగిశాయి. ఈ కాల్పుల్లో 74 మంది జిహాదీలు మరణించినట్లు ప్రొవిన్షియల్ గవర్నర్ నజుముద్దీన్ కరీం తెలిపారు. శుక్రవారం సుమారు వంద మంది ఉగ్రవాదులు నగరంపై దాడులు ప్రారంభించారని అందులో కొంత మంది స్లీపర్ సెల్స్ కూడా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ ఉగ్రదాడుల్లో సుమారు 46 మంది ప్రజలు మరణించారని అందులో ఎక్కువగా భద్రతాదళ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం దాడులు ముగిశాయని, పరిస్థితులు అదుపులోకి వచ్చాయని ఆయన వివరించారు. -
'25 వేల మంది ఐసిస్ ఉగ్రవాదులు హతం'
లండన్: గత 20 నెలలుగా బ్రిటన్, దాని మిత్ర దేశాల వైమానిక దాడుల్లో 25 వేల మందికి పైగా ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు బ్రిటన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్(ఆర్ఎఎఫ్) కల్నల్ వారెన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వరుస దాడులతో ఐసిస్ కు కోలుకోని ఎదురుదెబ్బ తగిలిందన్నారు. సిరియా, ఇరాక్‌లోని ఐఎస్ ఆధీన ప్రాంతాల్లో జిహాదీ ఉగ్రవాదుల సంఖ్య సగానికి తగ్గిందన్నారు. గత మూడు వారాల్లోనే 600 మంది ఉగ్రవాదులు మరణించారన్నారు. ఉత్తర ఇరాక్‌లోని దాదాపు ప్రస్తుతం 30 వేల మంది కంటే తక్కువే ఉన్నారు. తాము చేసిన దాడుల్లో ఐసిస్ చమురు క్షేత్రాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిపారు. గత కొన్ని నెలలుగా అమెరికా, సంకీర్ణ సేనలు జరుపుతున్న దాడులతో ఐసిస్ బలహీన పడిందన్నారు. ఒమర్ ఆల్-షిషానీ, జిహాది జాన్ సహా 100 మందిపైగా ఐసిస్ నేతలను మట్టుబెట్టినట్టు వారెన్ వెల్లడించారు. -
ఈ 'రష్యన్ రాంబో' మంచి ప్రేమికుడు కూడా
మాస్కో సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనేది ఆ యువకుడు చిన్నప్పటినుంచీ కలలు గన్నాడు. కానీ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉగ్రవాదులతో పోరాడి దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకుంటానని అనుకోలేదు. తన వివాహం సమయంలో ప్రేమను అందంగా, హృద్యంగా ప్రకటించిన ఆ ప్రేమికుడు అంతే దైర్య, సాహసాలను ప్రదర్శించి అసలు సిసలు సైనిక అధికారిగా నిలిచిపోయాడు. హీరో ఆఫ్ ది రష్యన్ గా కీర్తిని సాధించాడు. ఐస్ ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో దృఢమైన నిర్ణయం తీసుకుని ప్రాణాలు కోల్పోయిన అతనే రష్యా కు చెందిన సైనిక అధికారి అలెగ్జాండర్ ప్రొకోరెన్కోవ్(25) . దేశంలోని పత్రికలు అలెగ్జాండెర్ ను రష్యా రాంబోగా కీర్తిస్తున్నాయి. అలెగ్జాండర్ రష్యన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్‌లో ప్రత్యేక అధికారిగా పనిచేసేవాడు. ఇతనికి రెండు నెలల క్రితమే సిరియాలోని ప్రాచీన నగరం పాల్మెయర్ వద్ద దాడి చేయాల్సిన లక్ష్యాలను గుర్తించి రష్యా యుద్ధ విమానాలకు మార్గదర్శకత్వం వహించే బాధ్యతలు అప్పగించారు. అలెగ్జాండర్ విధి నిర్వహణలో ఉండగా ఐఎస్ ఉగ్రవాదులు అతన్ని చుట్టుముట్టారు. తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదు, ఉగ్రవాదులను తుద ముట్టించాలనే లక్ష్యంతో అతను పనిచేశాడు. ఉగ్రవాదులపై పోరులో భాగంగా వారితో పోరుకు సై అన్నాడు. వారికి లొంగిపోయేందుకు నిరాకరించి ఎదురొడ్డి నిలబడ్డాడు. తాను ఉన్న ప్రదేశంపై బాంబుల వర్షం కురిపించాలని రష్యా వాయుసేనకు , అధికారులకు సమాచారం అందించాడు. ఈ నేపథ్యంలోనే పోరులో ప్రాణాలొదిలాడు. యుద్ధ విమానాలు ఐస్ ఉగ్రవాదులను అనతరం తుదముట్టించాయి. ఈ విషయాన్ని రష్యా సైనిక వర్గాలు కూడా ధ్రువీకరించాయి. రష్యా స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్‌కు చెందిన ఓ అధికారి వైమానిక దాడులను సమన్వయ పరుస్తుండగా ప్రాణాలు కోల్పోయాడని పేర్కొంది. మరోవైపు ఐసిస్ ఐదుగురు రష్యన్ ప్రత్యేక దళ అధికారులను పాల్మీర సమీపంలో హత్య చేసినట్లు డెడ్ బాడీ చిత్రాలను వీడియోలను, గత వారం రిలీజ్ చేసింది. అతని మృతదేహం ఇంకా రష్యా చేరనప్పటికీ అన్ని అధికార సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అధ్యక్షుడు పుతిన్ స్వయంగా అతని కటుంబీకులను కలిసి సంతాపం తెలియజేయనున్నట్టు సమాచారం. కాగా18 నెలల క్రితం అలెగ్జాండర్‌కు ఎకతేరీనతో వివాహమైంది. అతని భార్య ప్రస్తుతం గర్భవతి. ఎకతెరీనతో పెళ్లి సందర్భంగా ప్రపంచంలో తాను అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా భావిస్తూ అలెగ్జాండర్ ఓ వీడియో తీసాడు. తనకు ప్రపంచంలో అత్యుత్తమమైన భార్య దొరికిందంటూ తన ప్రేమను వ్యక్తం చేశాడు. సైనికుడిగా దేశానికి సేవ చేయాలనే తన కల కూడా సాకారమైందని సంబరపడ్డాడు. ఇంతలోనే ఉగ్రదాడిలో అసువులు బాశాడు. దీంతో అతని గ్రామం విషాదంతో మూగబోయింది. అతను చాలా ప్రతిభావంతుడని అలెగ్జాండెర్ కు చదువు చెప్పిన ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. అయితే తన భర్త సైనిక అధికారి అని తెలుసుకానీ, సిరియాలో యుద్ధభూమిలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలియదని భార్య ఎకతెరీనా చెప్పింది. -
ఐసిస్‌లో ఆర్థిక సంక్షోభం
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, వేతనాల్లో కోత విధిస్తుండటం వల్ల జిహాదీలు ఇతర ఉగ్రవాద సంస్థలకు తరలి వెళ్తున్నారని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనం ప్రచురించింది. దళాల్లో కొత్తగా చేరికలు తగ్గిపోయాయని పేర్కొంది. ఐసిస్ తాజా ఓటములకు అది కూడా ఒక కారణమని ఆ సంస్థ వ్యవహారాల్లో నిపుణుడైన ప్రిన్స్టన్ వర్సిటీ ప్రొఫెసర్ జాకోబ్ షాపిరోను ఉటంకిస్తూ ఆ పత్రిక పేర్కొంది. కాగా, ఇస్లామిక్ స్టేట్ ప్రమాదం భారత్‌కు ఉందని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ హెచ్చరించింది. ఐఎస్‌తో సంబంధాలున్నాయన్న అనుమానాలతో దాదాపు 12 మందిని యూఏఈ ఇటీవలే భారత్‌కు తిప్పిపంపింది. -
తలకు తల ప్రతీకారం.. ఎనిమిది మందిని నరికేశారు
-
తలకు తల ప్రతీకారం.. 8 మందిని నరికేశారు
కాబూల్: అఫ్ఘానిస్తాన్ సైన్యం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల తరహాలో ప్రతీకారం తీర్చుకుంది. గత శనివారం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు నలుగురు సైనికుల తలలను నరికివేయగా, అదో రోజు అఫ్ఘాన్ సైన్యం నలుగురు ఐఎస్ ఉగ్రవాదులను తలలను నరికివేసి ప్రతీకారం తీర్చుకుంది. అప్ఘాన్‌లోని నంగార్మర్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఎనిమిది మంది ఐఎస్, అఫ్ఘాన్ సైన్యం మధ్య పరస్పర దాడుల్లో బందీలుగా చిక్కారు. ఐఎస్ ఉగ్రవాదులకు నలుగురు సైనికులు బందీలుగా దొరకగా, అఫ్ఘాన్ సైనికులకు నలుగురు ఐఎస్ ఉగ్రవాదులను బందించింది. ఐఎస్ ఉగ్రవాదులు సైనికుల తలలను నరికివేశారని తెలియగానే, అప్ఘాన్ సైన్యం అదే తరహాలో ప్రతీకారం తీర్చుకుంది. నంగార్మర్ ప్రావిన్స్‌లో అచిన్ జిల్లా గవర్నర్ గలిబ్ ముజాహిబ్ ఈ విషయాన్ని వెల్లడించారు. అఫ్ఘాన్ సైన్యం నరికివేసిన ఐఎస్ ఉగ్రవాదుల తలలను ఓ ప్రధాన రోడ్డు పక్కన ఉంచింది. రోడ్డు పక్కన రాళ్లను ఒకదానిపై మరొకటి ఉంచి స్తంభాల్లో పేర్చి.. వాటిపై ఉగ్రవాదుల తలలను ప్రదర్శించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను హతమారుస్తామని, అఫ్ఘాన్ సైనికులు తుపాకీలు పైకెత్తి నినాదాలు చేశారు.