
ఐసిస్‌లో ఆర్థిక సంక్షోభం
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, వేతనాల్లో కోత విధిస్తుండటం వల్ల జిహాదీలు ఇతర ఉగ్రవాద సంస్థలకు తరలి వెళ్తున్నారని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనం ప్రచురించింది. దళాల్లో కొత్తగా చేరికలు తగ్గిపోయాయని పేర్కొంది. ఐసిస్ తాజా ఓటములకు అది కూడా ఒక కారణమని ఆ సంస్థ వ్యవహారాల్లో నిపుణుడైన ప్రిన్స్‌టన్ వర్సిటీ ప్రొఫెసర్ జాకోబ్ షాపిరోను ఉటంకిస్తూ ఆ పత్రిక పేర్కొంది.
కాగా, ఇస్లామిక్ స్టేట్ ప్రమాదం భారత్‌కు ఉందని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ హెచ్చరించింది. ఐఎస్‌తో సంబంధాలున్నాయన్న అనుమానాలతో దాదాపు 12 మందిని యూఏఈ ఇటీవలే భారత్‌కు తిప్పిపంపింది.