ఇరాక్‌లో 74 మంది జిహాదీలు హతం
కిర్కుక్: ఇరాక్ భద్రతా దళాలు 74 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. గత మూడు రోజులుగా కిర్కుక్ నగరంలో భద్రతా దళాలకు, జిహాదీలకు మధ్య జరిగిన కాల్పులు ముగిశాయి. ఈ కాల్పుల్లో 74 మంది జిహాదీలు మరణించినట్లు ప్రొవిన్షియల్ గవర్నర్ నజుముద్దీన్ కరీం తెలిపారు.
శుక్రవారం సుమారు వంద మంది ఉగ్రవాదులు నగరంపై దాడులు ప్రారంభించారని అందులో కొంత మంది స్లీపర్ సెల్స్ కూడా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ ఉగ్రదాడుల్లో సుమారు 46 మంది ప్రజలు మరణించారని అందులో ఎక్కువగా భద్రతాదళ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం దాడులు ముగిశాయని, పరిస్థితులు అదుపులోకి వచ్చాయని ఆయన వివరించారు.