పిల్లాడితో చంపించిన ఐఎస్
వాషింగ్టన్: ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఆఖరికి చిన్నపిల్లలతో కూడా హత్యలు చేయిస్తోంది. తాజాగా ఈ సంస్థ మంగళవారం విడుదల చేసిన వీడియోలో ఓ బాలుడు ఇజ్రాయెల్ పౌరుడిని చంపుతున్న దృశ్యాలున్నాయి. మృతుడిని ఇస్మాయిల్ ముసల్లం (19)గా గుర్తించారు. ముసల్లం మోకాళ్లపై నిల్చుని ఉన్నాడు. అతన్ని ఉగ్రవాది సూచనల మేరకు ఓ చిన్న పిల్లవాడు నుదిటిపై కాల్చి చంపినట్టు అందులో ఉంది.