అల్ట్రాసౌండ్ స్కాన్ లో భూతం?! | Is this the creepiest ultrasound ever? Internet goes into a frenzy over photo that appears to reveal a 'demon' watching over an unborn baby | Sakshi
Sakshi News home page

అల్ట్రాసౌండ్ స్కాన్ లో భూతం?!

Published Mon, Jan 4 2016 5:54 PM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM

అల్ట్రాసౌండ్ స్కాన్ లో భూతం?! - Sakshi

అల్ట్రాసౌండ్ స్కాన్ లో భూతం?!

యూకే : అల్ట్రాసౌండ్ స్కాన్లో ఓ భూతం ఉన్నట్లు కనిపిస్తే? కడుపులో ఉన్న శిశువును ఆ భూతం తదేకంగా గుడ్లు మిటకరించి చూస్తున్నట్లు అనిపిస్తే? వామ్మో.. ఓరి దేవుడో.. అని అరవాలనిపిస్తుంది కదూ. సరిగ్గా అలాంటి ఓ అల్ట్రాసౌండ్ స్కాన్ కాపీ జనాలకి పిచ్చెక్కించింది. దాదాపు పది లక్షల మంది ఆ స్కాన్ కాపీని చూసి ఆలోచనలో పడ్డారు.

సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో భూతాలు,దుష్ట శక్తులు వంటి వాటి గురించి మాట్లాడేందుకు కూడా కొంతమంది ఇష్టపడరు. కానీ అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు వార్తల్లోకి రాకుండా ఉండవు. 8 నుంచి 10 వారాల గర్భవతికి చెందిన అల్ట్రాసౌండ్ స్కాన్ కాపీలో శిశువును చూస్తున్నట్లుగా ఓ వింత ఆకారం కనిపించడం అనుమానాలకు దారితీసింది. గుండ్రటి ముఖం, నల్లటి కళ్లు,తలపైన చిన్న కొమ్ములాంటి భాగాలతో ఉన్న ఓ వింత ఆకారం గర్భంలోని శిశువును గమనిస్తున్నట్లుగా ఉంది.

యూకేలో కొన్ని నెలల క్రితం పలువురిని విస్మయపరిచిన ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ కాపీని 2015కు సంబంధించి ఎంపికైన ఉత్తమ పోస్ట్ల్లో ఒకటిగా వర్ణిస్తూ ఓ ప్రముఖ వెబ్సైట్ మూడు రోజుల క్రితం పోస్ట్ చేసింది.అంతే.. ఆ స్కాన్కు సంబంధించి బోలెడన్ని కామెంట్లు, ఆనక చర్చలు జరిగాయి. అంతా జరిగాక కూడా అసలు విషయమేంటో తేల్చలేకపోయారు.

కొందరు భూతం అంటారు, ఇంకొందరు దేవత అంటారు, మరికొందరు అసలక్కడ ఏదీ లేదంటూ కొట్టిపారేస్తారు.ఇక ఆ స్కాన్ సెంటర్లోని ఉద్యోగులైతే ఈ విషయంపై నోరుమెదిపితే ఒట్టు. మొత్తానికి ఆ శిశువు మాత్రం ప్రసవ సమయానికి రెండు నెలల ముందే ప్రపంచాన్ని చూసేశాడు.మరి ఆ వింత ఆకారం సంగతేంటంటారా.. మీకేమైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement